‘హమ్మయ్యా... నువ్వైనా గేమ్‌ను అర్థం చేసుకున్నావు...’ కేవిన్ పీటర్సన్‌కి రోహిత్ శర్మ మెసేజ్...
మ్యాటర్ లేనోడు, అయ్యో ఈరోజు మంగళవారం అన్నాడట... ఈ సామెత ఇంగ్లాండ్ క్రికెటర్లకు సరిగా సరిపోతుంది. భారత స్పిన్నర్ల బౌలింగ్ ముందు నిలవలేక, పిచ్ బాగోలేదని వమర్శలు చేస్తోంది ఇంగ్లాండ్. ఐదు ఇన్నింగ్స్‌ల్లో 200+ స్కోరు చేయలేకపోయిన ఇంగ్లాండ్ జట్టుకి ఆ దేశ మీడియా ఫుల్లుగా సపోర్టు చేస్తోంది...
మొతేరా పిచ్‌పై తీవ్రమైన చేస్తోంది బ్రిటీష్ మీడియా. ఈ పిచ్ టెస్టు మ్యాచ్‌కి ఏ మాత్రం సరిపోదని, దీన్ని వెంటనే బహిష్కరించాలంటూ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే ఇంగ్లాండ్ జట్టు కూడా పిచ్‌పై ఐసీసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే...
మొతేరా పిచ్ ఏ మాత్రం బాగోలేదంటూ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్‌తో మైకేల్ వాగన్ వంటి మాజీ క్రికెటర్లు వ్యాఖ్యానించారు. అయితే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కేవిన్ పీటర్సన్ మాత్రం పిచ్ తప్పు ఏమీ లేదంటూ వీడియో సందేశం ద్వారా తెలిపాడు...
‘పింక్ బాల్ టెస్టులో ఇరు జట్ల బ్యాటింగ్ ఏ మాత్రం బాగోలేదు. రెండు జట్లూ కూడా సరైన బ్యాటింగ్ ప్రదర్శన ఇవ్వడంలో ఘోరంగా ఫెయిల్ అయ్యాయి... వాళ్లు చేసిన తప్పులను వాళ్లు అంగీకరించాలి.. చెత్త బ్యాటింగ్ చేసి, అవుట్ అయ్యామని ఒప్పుకోవాల్సిందే...
అవుట్ అయిన 30 మందిలో 21 మంది స్ట్రైయిట్ బాల్స్‌కే అవుట్ అయ్యారు. అంటే పిచ్‌లో ఎలాంటి లోపం లేదు. ఏ మాత్రం డేంజరస్‌గానూ లేదు... కేవలం బెటర్ బ్యాటింగ్ చేయాల్సింది...
మంచి బ్యాటింగ్ ప్రదర్శన చేసి ఉంటే, టెస్టు మ్యాచ్ మూడో రోజుకీ, ఇంకా బాగుంటే ఈజీగా నాలుగో రోజుకి కూడా వెళ్లి ఉండేది... ’ అంటూ కామెంట్ చేశాడు కేవిన్ పీటర్సన్...
కేవిన్ పీటర్సన్ వీడియో మెసేజ్‌పై భారత క్రికెటర్ రోహిత్ శర్మ స్పందించాడు. ‘థ్యాంక్యూ పీటర్సన్... ఇక్కడ ఆటను కరెక్టుగా అర్థం చేసుకునేందుకు నువ్వు ఒక్కడివైనా ఉన్నావు...’ అంటూ కామెంట్ చేశాడు రోహిత్ శర్మ...
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ మైఖేల్ వాగన్ మాత్రం మొతేరా పిచ్‌పై విమర్శలు చేస్తూనే ఉన్నాడు... ‘టీమిండియా ఏం చేసినా, ఐసీసీ అనుమతి ఉంటుందని, అందుకే ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటోంది. ఇలాంటి పిచ్ టెస్టు క్రికెట్‌కి నష్టం కలిగిస్తుంది...’ అంటూ కామెంట్ చేశాడు మైఖేల్ వాగన్.
అంతేకాదు నాలుగో టెస్టు కోసం మొతేరా పిచ్ క్యూరేటర్ నాగళితో దున్నుతూ మైదానాన్ని సిద్ధం చేస్తున్నానంటూ ట్రోల్ చేశాడు మైఖేల్ వాగన్. ఇంగ్లాండ్ బ్యాటింగ్ కోచ్ జానాథన్ ట్రాట్ కూడా బ్యాటింగ్ సరిగా లేనప్పుడు, పిచ్‌ను నిందించడం అనవసరమని చెప్పాడు.
రెండో టెస్టులో ఇంగ్లాండ్ ఓడిన తర్వాత పిచ్‌పై విమర్శలు చేసింది ఆ జట్టు. అయితే ఇదే పిచ్‌పై రోహిత్, అశ్విన్ సెంచరీలు బాదడం, రహానే, కోహ్లీ, పంత్ హాఫ్ సెంచరీలు బాదడంతో ఆ విమర్శలను ఎవ్వరూ పట్టించుకోలేదు... అయితే మూడో టెస్టులో టీమిండియా కూడా 145 పరుగులకే కుప్పకూలడంతో పిచ్ విమర్శలు మరింతగా పెరిగాయి.