తెలుగు వికెట్ కీపర్ శ్రీకర్ భరత్‌కి మళ్లీ నిరాశే... సాహా కోలుకోవడంతో భరత్‌ను ఇక్కడే వదిలేసి...

First Published Jun 4, 2021, 5:58 PM IST

తెలుగు క్రికెటర్, ఆంధ్రా వికెట్ కీపర్ శ్రీకర్ భరత్‌కి మరోసారి నిరాశే ఎదురైంది. ఇంగ్లాండ్ టూర్‌కి బ్యాకప్ వికెట్ కీపర్‌గా ముంబైలో బీసీసీఐ ఏర్పాటుచేసిన బయో బబుల్‌లో క్వారంటైన్‌లో గడిపిన భరత్‌ను ఇంటికి పంపించేసింది భారత క్రికెట్ బోర్డు. వృద్ధిమాన్ సాహా పూర్తిగా కోలుకోవడంతో అతను భారత జట్టుతో కలిసి ఇంగ్లాండ్ టూర్‌కి వెళ్లాడు.