వరుసగా 2-3 వికెట్లు పడ్డాయంటే, మ్యాచ్ పాకిస్తాన్‌దే... సంజయ్ మంజ్రేకర్ కామెంట్స్..
2021 టీ20 వరల్డ్ కప్‌కి ముందు టీమిండియాపై ఒక్క వరల్డ్ కప్ మ్యాచ్‌లోనూ గెలవలేకపోయింది పాకిస్తాన్. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి టాపార్డర్ వైఫల్యమే ప్రధాన కారణం. రోహిత్ శర్మ ఇన్నింగ్స్ తొలి బంతికే డకౌట్ కాగా కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ అట్టర్ ఫ్లాప్ అయ్యారు..

విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ రాణించినా మిగిలిన ప్లేయర్ల నుంచి ఆశించిన పర్ఫామెన్స్ రాలేదు. బౌలర్లు అట్టర్ ఫ్లాప్ కావడంతో 10 వికెట్ల తేడాతో టీమిండియాపై విజయం అందుకుంది పాకిస్తాన్. 2022 టీ20 వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా రివెంజ్ తీర్చుకోగలిగింది..
2021 వరల్డ్ కప్ మ్యాచ్ తర్వాత కూడా కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ బ్యాటు నుంచి చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ రాలేదు. రోహిత్ 4, రాహుల్ 4, సూర్యకుమార్ యాదవ్ 10 పరుగులు చేసి అవుట్ అయ్యారు.
హార్ధిక్ పాండ్యా 40 పరుగులు చేసి పర్వాలేదనిపించినా అక్షర్ పటేల్ 2, దినేశ్ కార్తీక్ 1 పరుగు చేసి అవుటయ్యారు.. వన్‌డౌన్‌లో వచ్చిన విరాట్ కోహ్లీ 53 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 82 పరుగులతో విరోచిత పోరాటం చేసి టీమిండియాని గెలిపించాడు..
విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం చేసినా హార్ధిక్ పాండ్యా తప్ప మరో ఎండ్‌లో సరైన సహకారం లభించకపోవడంతో ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ తీవ్ర ఉత్కంఠభరితంగా సాగింది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వరల్డ్ కప్ మ్యాచ్.. అశ్విన్ ఆఖర్లో కాస్త కంగారుపడినా రిజల్ట్ మారిపోయి ఉండేది..
‘టీమిండియాకి టాప్ 3 ప్లేయర్లే ముఖ్యం. రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మ ఈ ముగ్గురే చాలా కీలకం. 50 ఓవర్ల క్రికెట్ ఫార్మాట్‌లో విరాట్ కోహ్లీ కీ ప్లేయర్. వన్డేల్లో రాణించాలంటే టెస్టు ఫార్మాట్ స్కిల్స్ చాలా అవసరం...
రోహిత్ శర్మకు గత వన్డే వరల్డ్ కప్‌లో 5 సెంచరీలు ఉన్నాయి. మొదటి 10 ఓవర్లలో శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వికెట్లు కోల్పోకపోతే టీమిండియా విజయావకాశాలు కచ్ఛితంగా పెరుగుతాయి. ఒకవేళ 10 ఓవర్లలోనే 2-3 వికెట్లు పడితే మాత్రం టీమిండియా కోలుకోవడం కష్టమవుతుంది..
అలాగే టీమిండియా గెలవాలంటే 10 ఓవర్లలోపే వికెట్లు తీయగలగాలి. వాళ్లకు మంచి ఆరంభం దక్కితే టీమిండియాపై ప్రెషర్ పెరుగుతుంది. అది పాకిస్తాన్‌కి అనుకూలంగా మారవచ్చు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్..
వన్డే ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్‌లో 5 మ్యాచులకు కెప్టెన్సీ చేసిన రోహిత్ శర్మ, ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఆసియా కప్ 2018లో రోహిత్ రెస్ట్ తీసుకుని, ధోనీ కెప్టెన్సీలో ఆఫ్ఘాన్‌తో మ్యాచ్ ఆడింది టీమిండియా. ఈ మ్యాచ్ టైగా ముగిసింది.