MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • వన్డే వరల్డ్ కప్‌లో చోటు దక్కించుకోని ప్లేయర్లతో ఏషియన్ గేమ్స్‌కి... ఆగస్టు నాటికి మీడియా రైట్స్‌ ఢీల్...

వన్డే వరల్డ్ కప్‌లో చోటు దక్కించుకోని ప్లేయర్లతో ఏషియన్ గేమ్స్‌కి... ఆగస్టు నాటికి మీడియా రైట్స్‌ ఢీల్...

గత ఏడాది ఐపీఎల్ 2022 సీజన్‌కి ముందు మార్చిలో ఆఫ్ఘాన్‌తో మూడు వన్డేల  సిరీస్ ఆడాల్సింది టీమిండియా. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా అది వర్కవుట్ కాలేదు. ఐపీఎల్ 2023 సీజన్ ముగిసిన తర్వాత జూన్‌లో ఆఫ్ఘాన్‌తో సిరీస్ జరగాల్సింది. టీమిండియా ప్లేయర్లు రెస్ట్ కోరుకోవడంతో ఈసారి కూడా అది వర్కవుట్ కాలేదు..

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jul 08 2023, 12:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
team india

team india

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ ముగిసిన తర్వాత ఆఫ్ఘాన్‌తో వన్డే సిరీస్ ఆడాల్సింది టీమిండియా. అయితే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి దృష్టిలో పెట్టుకుని, టీమిండియా ప్లేయర్లకు ఏకంగా నెల రోజుల పాటు బ్రేక్ ఇచ్చింది బీసీసీఐ. దీంతో వరుసగా రెండో ఏడాది కూడా వాయిదా పడిన ఆఫ్ఘాన్ సిరీస్‌ని వచ్చే ఏడాది జనవరిలో నిర్వహిస్తామని ప్రకటించాడు బీసీసీఐ సెక్రటరీ జై షా..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
team india

team india

2018లో టీమిండియా మీడియా బ్రాడ్‌కాస్టర్‌గా బాధ్యతలు తీసుకున్న స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ కాంట్రాక్ట్, ఈ ఏడాది మార్చిలో ముగిసింది. జూన్‌లో జరగాల్సిన ఆఫ్గాన్ సిరీస్‌ వాయిదా పడడానికి మీడియా బ్రాడ్‌కాస్టర్‌ లేకపోవడం కూడా ఓ కారణం..

35

‘ఆస్ట్రేలియాతో ఆగస్టులో జరగాల్సిన వన్డే సిరీస్ సమయానికి మీడియా రైట్స్ ఢీల్ జరుగుతుంది. ఈసారి ఏషియన్ గేమ్స్‌లో భారత పురుషుల, మహిళల జట్లు పాల్గొనబోతున్నాయి. అపెక్స్ కౌన్సిల్‌ మీటింగ్‌లో దీనిపై నిర్ణయం తీసుకున్నాం. మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో చోటు దక్కించుకోని ప్లేయర్లను ఏషియన్ గేమ్స్‌కి పంపిస్తాం..

45
Harmanpreet Kaur-Smriti Mandhana

Harmanpreet Kaur-Smriti Mandhana

క్రికెట్ అడ్వైసింగ్ కమిటీ ఆధ్వర్యంలో భారత మహిళా టీమ్ హెడ్ కోచ్‌ కోసం ఇంటర్వ్యూలు జరుగుతాయి. అలాగే బ్యాటింగ్ కోచ్, బౌలింగ్ కోచ్ పోస్టులకు కూడా ఇంటర్వ్యూలు నిర్వహించబోతున్నాం. ఏషియన్ గేమ్స్‌లోపే కోచ్‌ల నియామకం జరుగుతుంది..

55
India vs Australia

India vs Australia

వన్డే వరల్డ్ కప్‌ టోర్నీకి ముందు ఆఫ్ఘాన్‌తో వన్డే సిరీస్ నిర్వహించడానికి అవకాశం లేదు. అందుకే వచ్చే జనవరిలో ఆఫ్ఘాన్‌తో సిరీస్ ఉంటుంది. వరల్డ్ కప్ ముందు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఉంటుంది, వరల్డ్ కప్ తర్వాత టీ20 ప్రపంచ కప్ 2024 టోర్నీని దృష్టిలో ఉంచుకుని ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఉంటుంది.’ అంటూ తెలిపాడు బీసీసీఐ సెక్రటరీ జై షా.. 

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs ENG: వైభవ్ సూర్యవంశీ గురించి నాకు తెలియదు.. శ్రేయాస్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Team India: వరల్డ్ కప్ పోయింది.. ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ కొట్టాల్సిందే.. ఐదుగురు కొత్త ప్లేయర్లకు బంపర్ ఛాన్స్ !
Recommended image3
Ben Stokes: సడన్ షాక్ ఇచ్చిన ఇంగ్లండ్ కెప్టెన్.. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు బెన్ స్టోక్స్ సడన్ రిటైర్మెంట్ ఎందుకిచ్చాడు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved