MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Ishan Kishan: టీమిండియాకు కొనసాగుతున్న గాయాల గండం.. సిరీస్ నుంచి మరో ప్లేయర్ ఔట్..?

Ishan Kishan: టీమిండియాకు కొనసాగుతున్న గాయాల గండం.. సిరీస్ నుంచి మరో ప్లేయర్ ఔట్..?

India Vs Srilanka: భారత జట్టును గాయాల బెడద వేధిస్తున్నది.  కీలక ఆటగాళ్లంతా వరుసగా  గాయాల బారీన పడుతున్నారు. ఇప్పటికే  దీపక్ చాహర్, సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్ లు గాయపడగా తాజాగా... 

2 Min read
Author : Srinivas M
Published : Feb 27 2022, 11:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

టీమిండియా  ఏ ముహుర్తాన లంకతో సిరీస్  ప్రారంభించిందో గానీ  రోహిత్ సేనకు ఆటగాళ్ల ఫిట్నెస్ విషయంలో ఏదీ కలిసిరావడం లేదు. సిరీస్ ప్రారంభానికి ముందే స్టార్  ఆటగాళ్లు దీపక్ చాహర్, సూర్యకుమార్  యాదవ్ లు గాయాల బారీన పడ్డారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

రెండో టీ20కి ముందు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కూడా మణికట్టు గాయంతో  సిరీస్ నుంచి దూరమైన విషయం తెలిసిందే. 

39

ఇక ఇప్పుడు టీమిండియాకు మరో షాక్ తగిలింది.  భారత జట్టు యువ వికెట్ కీపర్  ఇషాన్ కిషన్.. రెండో టీ20 సందర్భంగా గాయపడ్డాడు. భారత ఇన్నింగ్స్ సందర్భంగా.. కిషన్ గాయపడ్డాడు.

49

లంక బౌలర్ లాహిరు కుమార వేసిన నాలుగో ఓవర్లో కిషన్ కు గాయమైంది. 147.6 కిలోమీటర్ల వేగంతో  బంతిని విసిరిన లాహిరు కుమార.. బౌన్సర్ వేశాడు. అయితే దానిని డిఫెండ్ చేసే క్రమంలో ఇషాన్ హెల్మెట్ కు బంతి బలంగా తాకింది. 
 

59

దీంతో క్రీజు నుంచి వెళ్లిన  కిషన్..  వెంటనే పక్కకువెళ్లి హెల్మెట్ తీసి తలను చూసుకున్నాడు.  అక్కడే ఉన్న ఫిజియో వచ్చి ఇషాన్ ను పరిశీలించాడు.  అయితే గాయం తీవ్రత ఎక్కువ కాకపోవడంతో కిషన్ మ్యాచును కొనసాగించాడు. కాగా 15 బంతుల్లో రెండు బౌండరీలు సాధించి  16 పరుగులు చేసిన ఇషాన్ కిషన్..  చివరికి లాహిరు బౌలింగ్ లోనే   ఔట్ అయ్యాడు. 

69

మ్యాచ్ ముగిసిన వెంటనే బీసీసీఐ.. కిషన్ ను హిమాచల్ ప్రదేశ్ లోని కంగ్రా ఆస్పత్రికి తరలించింది.  ఇషాన్ తలకు గాయమైందా..? లేదా..? దాని తీవ్రత ఎంత..? అన్న కోణంలో బీసీసీఐ వైద్య బృందం పరీక్షలు చేస్తున్నది. 

79

ఆదివారం కిషన్ వైద్య పరీక్షలకు సంబంధించిన  ఫలితం ఆదివారం రానున్నది. ఇప్పటికైతే కిషన్ బాగానే ఉన్నాడని, అతడు వైద్యులు పరిశీలనలో ఉన్నాడని బీసీసీఐ తెలిపింది. 

89

ఈ నేపథ్యంలో  కిషన్ మూడో టీ20 ఆడేది అనుమానంగానే ఉంది.  ఒకవేళ అతడు ఆడకుంటే నేటి టీ20లో  రోహిత్ తో ఇన్నింగ్స్ ఎవరు ఓపెన్ చేస్తారనే విషయంపై ఆసక్తి నెలకొన్నది.

99

కిషన్ తో పాటు.. శ్రీలంక వికెట్ కీపర్  దినేశ్ చండిమాల్ కూడా గాయపడ్డాడు. భారత్ తో ఇన్నింగ్స్ సందర్బంగా.. కీపింగ్ చేస్తుండగా అతడికి గాయమైంది.  కిషన్, చండిమాల్ ఇద్దరూ కంగ్రా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు.

About the Author

SM
Srinivas M
భారత దేశం
రోహిత్ శర్మ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Virat Kohli: రిటైర్మెంట్ పై అభిమానుల గుండె పగిలే వార్త చెప్పిన కోహ్లీ
Recommended image2
Virat Kohli: విరాట్ కోహ్లీ విధ్వంసం.. ఒకే సెంచరీతో 10 సంచలన రికార్డులు బద్దలు
Recommended image3
IND vs WI 1st ODI: కోహ్లీ, గిల్ విశ్వ‌రూపం.. వెస్టిండీస్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved