MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Sports
  • Cricket
  • Virat Kohli: సీమింగ్ పిచ్ లపై అలా ఆడితే కుదరదు.. విరాట్ ఆ షాట్ ఆడితే బెటర్ అంటున్న ఆర్సీబీ కోచ్

Virat Kohli: సీమింగ్ పిచ్ లపై అలా ఆడితే కుదరదు.. విరాట్ ఆ షాట్ ఆడితే బెటర్ అంటున్న ఆర్సీబీ కోచ్

Ind vs SA: టీమిండియా టెస్టు సారథి విరాట్ కోహ్లి మరోసారి అభిమానులను తీవ్ర నిరాశపరిచాడు. క్రీజులో కుదురుకున్నాక అనవసర షాట్  ఆడి విమర్శల పాలయ్యాడు. 

2 Min read
Author : Srinivas M
Published : Dec 27 2021, 03:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

టీమిండియా టెస్టు జట్టు సారథి విరాట్ కోహ్లి ఆటతీరుపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు రెండేండ్లకు పైగా సెంచరీ చేయలేక తంటాలు పడుతున్న కోహ్లి.. ఈ సారైనా ఆ లోటును  పూడ్చుతాడని  అభిమానులు భావిస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా  తొలి ఇన్నింగ్సులో అతడు ఆ లోటును పూడ్చుతాడానే అనిపించింది. కానీ క్రీజులో నిలదొక్కుకున్న విరాట్.. అనవసరపు షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. 

38

ఆఫ్ స్టంప్ కు దూరంగా వెళ్తున్న బంతిని అనవసరంగా టచ్ చేసిన కోహ్లి.. లుంగి ఎంగిడి బౌలింగ్ లో పెవిలియన్ కు చేరాడు. ఇక ఇదే  విషయమై టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్, ప్రస్తుత ఆర్సీబీ హెడ్ కోచ్ సంజయ్ బంగర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

48

బంగర్ మాట్లాడుతూ... ‘సీమింగ్ పిచ్ లపై  బౌలర్లపై దాడికి దిగడం కంటే మీరు మరోలా గేమ్ ఆడాల్సి ఉంటుంది. అటువంటి పిచ్ లపై కేవలం ఫ్రంట్ ఫుట్ షాట్లు ఆడతామంటే కుదరదు. 

58

ఒకవేళ  బ్యాటర్లు ఆ నిర్దిష్టమైన షాట్లపైనే ఆధారపడితే మాత్రం అది బౌలర్లు ఇట్టే పట్టేస్తారు. వాళ్లు పదే పదే వికెట్లకు దూరంగా  ఊరించే బంతులు వేస్తూ బ్యాటర్ ను బోల్తా కొట్టిస్తారు. 

68

ఇక నిన్న విరాట్ కోహ్లి ఔటైన విధానం చూస్తుంటే.. అతడు బ్యాక్ ఫుట్ ఎలా ఆడాలో అభివృద్ధి చేసుకుంటే మంచిది.  లేకుంటే అతడు కేవలం ఫ్రంట్ ఫుట్ షాట్లు మాత్రమే ఆడినట్టు అనిపిస్తుంది.. నిన్న  విరాట్  ఔటైన షాట్ ను చూసిన అదే భావన కలుగుతుంది. బంతిని అంచనా వేయడంలో చిన్న మానసిక లోపంలా తోస్తుంది....’అని బంగర్ అన్నాడు. 

78

తొలి ఇన్నింగ్సులో ఛతేశ్వర్ పుజారా గోల్డెన్ డక్ గా నిష్క్రమించిన తర్వాత క్రీజులోకి వచ్చిన  విరాట్.. 94 బంతులాడి 35 పరుగులు చేసి మంచి టచ్ లోనే కనిపించాడు. కానీ అనవసర షాట్ ఆడి బలయ్యాడు. ఇలా ఔటవ్వడంపై  అభిమానులతో పాటు చివరికి కోహ్లి కూడా తీవ్ర నిరాశకు గురై ఉంటాడని దక్షిణాఫ్రికా మాజీ పేసర్ షాన్ పొలాక్ వ్యాఖ్యానించాడు. 

88

కోహ్లి చివరిసారిగా 2019 నవంబర్ లో సెంచరీ చేశాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచులో అతడు శతకం బాదాడు. అప్పట్నుంచి ఇప్పటిదాకా కోహ్లి బ్యాట్ నుంచి మళ్లీ మూడంకెల స్కోరును చూడలేదు. 

About the Author

SM
Srinivas M
భారత దేశం
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
టీమిండియా దెబ్బ‌కు పాకిస్థాన్ చిత్తు.. ఆసియాక‌ప్‌లో దుమ్మురేపిన అమ్మాయిలు
Recommended image2
భార‌త్ బౌలింగ్ దెబ్బ‌కు పాక్ విల‌విల‌.. 55 ప‌రుగుల‌కే కుప్పకూలిన పాకిస్థాన్ జ‌ట్టు
Recommended image3
Asia Cup 2026: హాంగ్‌కాంగ్‌ను దంచికొట్టారు.. ఆసియా కప్ 2026 సెమీస్‌కు దూసుకెళ్లిన భారత్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved