- Home
- Sports
- Cricket
- నీలో నాకు బాగా నచ్చేది అదే.. హ్యాపీ బర్త్ డే మై లవ్.. : భార్యకు టీమిండియా సారథి స్పెషల్ విషెస్
నీలో నాకు బాగా నచ్చేది అదే.. హ్యాపీ బర్త్ డే మై లవ్.. : భార్యకు టీమిండియా సారథి స్పెషల్ విషెస్
Ritika Sajdeh: భారత వన్డే, టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితికా సాజ్దే నిన్న పుట్టినరోజును జరుపుకున్నది. ఈ సందర్భంగా ఆమెకు స్పెషల్ విషెస్ చెప్పాడు హిట్ మ్యాన్.

టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్ సారథి రోహిత్ శర్మ.. భార్య రితికా సాజ్దేకు స్పెషల్ బర్త్ డే విషెస్ చెప్పాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు ముంబైలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా చేతికి గాయమై టూర్ కు దూరమైన రోహిత్.. ప్రస్తుతం ఎన్సీఏ లో ఉన్నాడు.
డిసెంబర్ 21న రితికా పుట్టినరోజు సందర్భంగా రోహిత్ శర్మ ఇన్స్టాగ్రామ్ వేదికగా తన భార్యకు బర్త్ డే విషెస్ చెప్పాడు. ఇప్పటివరకు ఎలా ఉన్నావో.. ఇకపై కూడా అలాగే ఉండు.. అని ఆమెను విష్ చేశాడు.
ఓ పోస్టులో రితికా ఫోటోలు షేర్ చేస్తూ.. ‘హ్యపీయెస్ట్ బర్త్ డే మై లవ్.. ఇప్పటివరకు ఎలా ఉన్నావో ఇకపై కూడా అలాగే ఉండు. నీలో నన్ను భాగా ఆకట్టుకునేది అదే..’ అంటూ శుభాకాంక్షలు తెలిపాడు.
ఈ జంట 2008లో తొలిసారిగా కలిసింది. చాలా కాలం పాటు డేటింగ్ లో ఉన్న రోహిత్-రితికాలు 2015 డిసెంబర్ 13న వివాహ బంధంతో ఒకటయ్యారు. ఈ జంటకు ఒక పాప.
రోహిత్ శర్మకు సంబంధించిన టూర్లు, యాడ్ షూట్స్, ఇతర విషయాలను రితికానే చూసుకుంటుంది. రోహిత్ తో పరిచయం కాకముందు ఆమె.. ఓ స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ సంస్థకు మేనేజర్ గా పనిచేసింది.
ఇక రోహిత్ శర్మ ఆడే ప్రతి మ్యాచులో పాల్గొనే రితికా.. అతడు సెంచరీ చేసినప్పుడు ఫుల్ ఖుషీలో ఉంటుంది. 2017 డిసెంబర్ 13న అతడు మూడో డబుల్ సెంచరీ (శ్రీలంక మీద) చేసినప్పుడు భార్యకు ఫ్లయింగ్ కిస్ పెట్టాడు.
ఆ సందర్భంలో ఆమె భావోద్వేగంతో కన్నీరు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పటికీ ఇంటర్నెట్ లో సెన్సేషనే.
ఇదిలాఉండగా.. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ కు దూరమైన రోహిత్, వన్డే సిరీస్ కు మాత్రం ఆడనున్నాడు. అతడికి పూర్తిస్థాయిలో ఇదే తొలి సిరీస్. ఇన్నాళ్లు విరాట్ సారథ్యంలో ఆడిన రోహిత్ శర్మ నాయకత్వంలో ఇప్పుడు కోహ్లీ ఆడనుండటం విశేషం.