MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • టీమిండియాని భయపెడుతున్న ఇంగ్లాండ్... U19 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో...

టీమిండియాని భయపెడుతున్న ఇంగ్లాండ్... U19 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో...

ఐసీసీ అండర్19 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌ టోర్నీ క్లైమాక్స్‌కి చేరుకుంది. షెఫాలీ వర్మ కెప్టెన్సీలోని భారత జట్టు, న్యూజిలాండ్‌ని సెమీ ఫైనల్‌లో ఓడించి ఫైనల్‌ చేరగా, ఇంగ్లాండ్ జట్టు, ఆస్ట్రేలియాపై 3 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది. ఈ రెండు జట్ల మధ్య ఆదివారం, జనవరి 29న టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jan 28 2023, 03:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో భారత జట్టు, గ్రూప్ స్టేజీలో వరుస విజయాలు అందుకుని టేబుల్ టాపర్‌గా సెమీ ఫైనల్ చేరింది. అయితే సెమీస్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది టీమిండియా...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Shafali Verma

Shafali Verma

అంతకుముందు మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2019 టీమిండియాని సెమీస్‌లో ఓడించిన న్యూజిలాండ్‌పై ఘన విజయం అందుకున్న భారత జట్టు, ఇప్పుడు అసలు సిసలైన ఛాలెంజ్‌ని ఫేస్ చేయనుంది. ఇప్పుడు 2022 మెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాని ఓడించిన ఇంగ్లాండ్‌ని భారత జట్టు ఫైనల్‌లో ఎదుర్కోనుంది...

36

అండర్19 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో జింబాబ్వే, పాకిస్తాన్, వాండా, ఐర్లాండ్ జట్లపై భారీ విజయాలు అందుకుంది ఇంగ్లాండ్. జింబాబ్వేపై 174 పరుగుల తేడాతో, వాండా టీమ్‌పై 138 పరుగుల తేడాతో, ఐర్లాండ్‌పై 121 పరుగుల తేడాతో గెలిచిన ఇంగ్లాండ్.. పాక్‌తో మ్యాచ్‌లో 53 పరుగుల తేడాతో గెలిచింది...
 

46

సూపర్ 6 రౌండ్‌లో వెస్టిండీస్‌ను 95 పరుగుల తేడాతో ఓడించిన ఇంగ్లాండ్‌కి ఒక్క ఆస్ట్రేలియా మాత్రమే హోరాహోరీ ఫైట్ ఇవ్వగలిగింది. సెమీస్‌పై ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 99 పరుగులకే ఆలౌట్ అయినా, ఆ లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా 96 పరుగులకే చాపచుట్టేసింది..

56

ఇంగ్లాండ్‌ని స్వల్ప స్కోరుకే ఆలౌట్ చేశామని ఆనందించేలోపు, ఆస్ట్రేలియా 3 పరుగుల తేడాతో ఓడింది. అదీకాకుండా ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ మొట్టమొదటి టోర్నీని (1973లో) గెలిచింది ఇంగ్లాండే...

66
Image credit: Getty

Image credit: Getty

ఆ తర్వాత మొట్టమొదటి ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో కూడా ఇంగ్లాండ్ మహిళా జట్టే (2009లో) విజేతగా నిలిచింది. దీంతో మొట్టమొదటి అండర్19 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్ విజేతగా కాకుండా టీమిండియా అడ్డుకోగలదా? ఆదివారం మ్యాచ్‌లో తేలిపోనుంది.. 
 

About the Author

CR
Chinthakindhi Ramu
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs West Indies: భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే
Recommended image2
రాంచీలో ర‌ఫ్ఫాడించిన షాయ్ హోప్.. టీమిండియాపై వెస్టిండిస్‌ సంచ‌ల‌న విజ‌యం
Recommended image3
virat kohli: ఆ ఆశ్ర‌మానికి వెళ్లినందుకు కోహ్లికి రూ. 5 కోట్లు ఇచ్చారా.? అస‌లేం జ‌రిగిందంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved