- Home
- Sports
- Cricket
- ఫైనల్ గెలవాలంటే హార్ధిక్ పాండ్యాని ఆడించండి! టీమిండియాకి అతని అవసరం ఉంది.. - షేన్ వాట్సన్..
ఫైనల్ గెలవాలంటే హార్ధిక్ పాండ్యాని ఆడించండి! టీమిండియాకి అతని అవసరం ఉంది.. - షేన్ వాట్సన్..
అప్పుడెప్పుడో 2018 ఆగస్టులో చివరిగా టెస్టు మ్యాచ్ ఆడిన హార్ధిక్ పాండ్యా... ఆసియా కప్ 2018 టోర్నీలో గాయపడి టీమ్‌కి దూరమయ్యాడు. 2019లో వెన్నెముకకి సర్జరీ చేయించుకున్న హార్ధిక్ పాండ్యా, రీఎంట్రీ ఇచ్చినా మూడేళ్ల వరకూ సరిగ్గా బౌలింగ్ చేయలేకపోయాడు... 2020, 21 సీజన్లలో హార్ధిక్ పాండ్యా కేవలం బ్యాటింగ్‌కే పరిమితం కావడంతో అతన్ని రిటైన్ చేసుకోవడానికి ఇష్టపడలేదు ముంబై ఇండియన్స్...

Hardik Pandya Test
ముంబై ఇండియన్స్ 2022 రిటెన్షన్ లిస్టులో చోటు దక్కించుకోని హర్ధిక్ పాండ్యా, రూ.15 కోట్లకు గుజరాత్ టైటాన్స్ టీమ్‌లోకి వెళ్లి, కెప్టెన్‌గా మారి... మొట్టమొదటి సీజన్‌లో ఐపీఎల్ గెలిచేశాడు. ఆ సంగతి పక్కనబెడితే నాలుగేళ్లుగా హార్ధిక్ పాండ్యా టెస్టులు ఆడడం లేదు...
Image credit: PTI
2020 డిసెంబర్‌లో టీ20, వన్డే సిరీసుల్లో మంచి పర్ఫామెన్స్ ఇచ్చి ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ గెలిచిన హార్ధిక్ పాండ్యా, టెస్టు ఫార్మాట్ ఆడతారా? అంటే ఇప్పట్లో ఆ ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చేశాడు. హార్ధిక్ పాండ్యా కేవలం టీ20, వన్డే ఫార్మాట్‌లో కొనసాగేందుకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తోంది...
‘హార్ధిక్ పాండ్యా ఫిట్‌గా ఉంటే అతన్ని టెస్టు క్రికెట్‌లోకి తిరిగి తీసుకురావాలి. అతని స్కిల్స్, టీమ్‌కి చాలా అవసరం. టెస్టుల్లో సుదీర్ఘ స్పెల్స్ వేయకపోయినా టీమ్‌లో ఉండేందుకు అతని బ్యాటింగ్ స్కిల్స్ చాలు.. అతను పవర్ హిట్టర్..
ఐపీఎల్ 2022 సీజన్‌లో హార్ధిక్ పాండ్యా, గుజరాత్ టైటాన్స్‌కి నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. వన్డేల్లో హార్ధిక్ పాండ్యా, పవర్ హిట్టర్ రోల్ పోషించకపోయినా టీమ్‌ని విజయ తీరాలకు ఎలా చేర్చాలో బాగా తెలిసిన ప్లేయర్. ఫిట్‌గా ఉంటే బౌలింగ్‌లో అతను వేసే ఓవర్లు, టీమ్‌కి చాలా ఉపయోగపడతాయి...
Image credit: PTI
అతను కొత్త బంతిని స్వింగ్ చేయగలడు. ఇంగ్లాండ్ పిచ్‌పై స్వింగ్ బౌలింగ్ చాలా ముఖ్యం. ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు టీమ్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తారు...
Image credit: PTI
ఒకవేళ టీమిండియా, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ గెలవాలనుకుంటే హార్ధిక్ పాండ్యా లాంటి స్పెషల్ టాలెంట్స్ ఉన్న ప్లేయర్లను ఆడించాలి...’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్...
<p>Hardik Pandya</p>
న్యూజిలాండ్‌తో సిరీస్ ముగిసిన తర్వాత తన భార్య నటాశా స్టాంకోవిక్‌కి మరోసారి పెళ్లి చేసుకున్న హార్ధిక్ పాండ్యా.. మార్చి 17 నుంచి ప్రారంభమయ్యే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో పాల్గొనబోతున్నాడు.. టీ20 ఫార్మాట్‌కి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న హార్ధిక్ పాండ్యా, 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత వన్డేల్లోనూ కెప్టెన్‌గా ప్రమోషన్ పొందే అవకాశం ఉంది..