- Home
- Sports
- Cricket
- మరీ ఇంత ఈజీగా గెలిస్తే మ్యాచ్ ఫిక్సింగ్ డౌట్స్ రావా భయ్యా!... మనోళ్లు ఇంత బాగా ఆడతారా..
మరీ ఇంత ఈజీగా గెలిస్తే మ్యాచ్ ఫిక్సింగ్ డౌట్స్ రావా భయ్యా!... మనోళ్లు ఇంత బాగా ఆడతారా..
ఐసీసీ టోర్నీల్లో చేతులు ఎత్తేస్తున్నా, ద్వైపాక్షిక సిరీసుల్లో అందులోనూ స్వదేశంలో జరిగే మ్యాచుల్లో టీమిండియా అదరగొడడం ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న ఆనవాయితీ. గంగూలీ, ద్రావిడ్, ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత శర్మ... ఇప్పుడు హార్ధిక్ పాండ్యా ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు.. అయితే అహ్మాదాబాద్‌లో జరిగిన మూడో టీ20 రిజల్ట్ మాత్రం నమ్మశక్యంగా అనిపించడం లేదు...

Image credit: PTI
న్యూజిలాండ్ జట్టుకి టీమిండియాపై ఐసీసీ టోర్నీల్లో అద్భుతమైన రికార్డు ఉంది. అయితే ద్వైపాక్షిక సిరీసుల విషయానికి వచ్చేసరికి ఇండియాదే డామినేషన్. అదీ ఇండియాలో జరిగే మ్యాచులయితే న్యూజిలాండ్‌కి చాలా పూర్ రికార్డు ఉంది...
Image credit: PTI
అయితే ఎలా చూసినా న్యూజిలాండ్ వంటి టాప్ క్లాస్ టీమ్‌పై టీ20ల్లో 168 పరుగుల భారీ తేడాతో గెలవడం అనేది కొంచెం తేడాగానే అనిపిస్తోంది. అదీకాకుండా టీ20ల్లో 100-130 స్ట్రైయిక్ రేటుతో బ్యాటింగ్ చేసే శుబ్‌మన్ గిల్, 200+ స్ట్రైయిక్ రేటుతో అదరగొట్టి సెంచరీ కొట్టేశాడు...
Image credit: PTI
అది కూడా అలాంటి ఇలాంటి సెంచరీ కాదు, టీ20ల్లో టీమిండియా తరుపున అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డునే లేపేశాడు. ఈ సెంచరీతో గిల్, ఇక త్రీ ఫార్మాట్ ప్లేయర్‌గా తన ప్లేస్ ఫిక్స్ చేసుకున్నట్టే....
టీమ్‌లో ఎంత మంది ఫాస్ట్ బౌలర్లు ఉన్నా తానే ఫస్ట్ ఓవర్ వేసే హార్ధిక్ పాండ్యా, ఈ మ్యాచ్‌లో 4 వికెట్లు తీసి... టీమిండియా టీ20 కెప్టెన్‌గా, ఫ్యూచర్ వైట్ బాల్ కెప్టెన్‌గా తనకు ఎవ్వరూ పోటీ లేరని బీసీసీఐకి క్లారిటీ ఇచ్చేశాడు. ఇలాంటి విజయం తర్వాత కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ వంటి ప్లేయర్లకు కెప్టెన్సీ ఇవ్వడం అయ్యే పని కాదు...
వన్డేల్లో డబుల్ సెంచరీ కొట్టడం ఇంత ఈజీయా అన్నట్టు మొన్న ద్విశతకం బాదిన శుబ్‌మన్ గిల్, ఇప్పుడు టీ20ల్లోనూ సెంచరీ సాధించాడు. గత 8 నెలల గ్యాప్‌లో టీమిండియా తరుపున నమోదైన 15వ సెంచరీ ఇది.ఇంతకుముందెప్పుడూ ఈ రేంజ్‌లో మనోళ్లు సెంచరీలు బాదలేదు..
Image credit: PTI
ఇవన్నీ కలిసి న్యూజిలాండ్‌పై మూడో టీ20లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందనే అనుమానాలు రేగుతున్నాయి. టీమిండియా గెలిచినప్పుడు పాకిస్తాన్ ఫ్యాన్స్ ఇలాంటి ఆరోపణలు చేయడం సర్వసాధారణం. అయితే నిన్నటి మ్యాచ్ చూసిన టీమిండియా ఫ్యాన్సే, మనోళ్లు న్యూజిలాండ్ మరీ పసికూన జట్టుని ఆడినట్టు ఆడుకోవడం కాస్త వింతగా ఉందని ఫీలవుతున్నారు...
shubman gill
బీసీసీఐ చేసిన మ్యాచ్ విన్నింగ్ పోస్టు కింద మ్యాచ్ ఫిక్సింగ్ కామెంట్లు కనిపిస్తున్నాయి. ఎంత స్వదేశంలో జరిగే మ్యాచుల్లో పులులే అయినా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టీమిండియా నుంచి ఇలాంటి డామినేషన్ చూడగలమా? అని బీసీసీఐని ప్రశ్నిస్తున్నారు..
Shubman Gill
మరికొందరేమో మనోళ్లు ఇలాంటి చిన్న చిన్న మ్యాచుల్లో చెలరేగిపోవడం, ఐసీసీ టోర్నీల విషయానికి వచ్చేసరికి భయంతో వణికిపోవడం తరతరాలుగా వస్తున్నదేనంటూ కామెంట్లు పెడుతున్నారు. మూడు ఫార్మాట్లలో సెంచరీలు బాదుతున్న ఇదే శుబ్‌మన్ గిల్, వన్డే వరల్డ్ కప్‌లో ఒక్క హాఫ్ సెంచరీ అయినా కొడతాడేమో చూడాలని ట్రోల్స్ చేస్తున్నారు..