- Home
- Sports
- Cricket
- వరల్డ్ కప్ గెలిచేందుకు కావాల్సిన టీమ్, భారత్ దగ్గర లేదు... పాక్ మాజీ ఆల్‌రౌండర్ మహ్మద్ హాఫీజ్ కామెంట్స్..
వరల్డ్ కప్ గెలిచేందుకు కావాల్సిన టీమ్, భారత్ దగ్గర లేదు... పాక్ మాజీ ఆల్‌రౌండర్ మహ్మద్ హాఫీజ్ కామెంట్స్..
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి భారత్ వేదిక ఇవ్వనుంది. అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే వన్డే వరల్డ్ కప్‌లో 10 జట్లు పోటీపడబోతున్నాయి. 12 ఏళ్ల తర్వాత స్వదేశంలో జరుగుతున్న వరల్డ్ కప్ కావడంతో టీమిండియానే హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగుతోంది..

Mohammad Hafeez
‘టీమిండియా చాలా మంచి జట్టు, అయితే బెస్ట్ మాత్రం కాదు. గత కొన్నేళ్లుగా వాళ్లు ఎలా ఆడుతున్నారో గమనిస్తే ఎవ్వరైనా దీన్ని ఒప్పుకోవాల్సిందే. నాకౌట్ మ్యాచుల్లో ప్రెషర్‌ని టీమిండియా ఫేస్ చేయలేకపోతోంది..
Shoaib Malik-Mohammad Hafeez
నాకౌట్ లేదా ఫైనల్ దాకా వెళ్లాలంటే మంచి టీమ్ ఉంటే సరిపోతుంది. టైటిల్ గెలవాలంటే మాత్రం మ్యాచ్ విన్నర్లు కావాలి. ద్వైపాక్షిక సిరీసుల్లో వాళ్లు అద్భుతంగా ఆడుతున్నారు. ఐసీసీ టోర్నీల విషయానికి వచ్చేసరికి తేలిపోతున్నారు..
ఇప్పటికీ వాళ్ల దగ్గర వరల్డ్ కప్ గెలిచేందుకు కావాల్సిన టీమ్ లేదు. జస్ప్రిత్ బుమ్రా గాయం నుంచి కోలుకుని, రీఎంట్రీ ఇస్తున్నాడు. అయితే అతను వరల్డ్ కప్ మొత్తం ఆడగలడా? ఇంతకుముందు చూపించిన ఇంపాక్ట్ చూపించగలడా?
Team India
అతని ఫిట్‌నెస్‌పై నాకైతే చాలా అనుమానాలు ఉన్నాయి. అతను ఫిట్‌గా ఉండి, టీమ్‌కి అందుబాటులో ఉన్నా టీమిండియాకి చాలా సమస్యలు ఉన్నాయి. మిడిల్ ఆర్డర్‌లో సరైన ప్లేయర్లు లేరు... టాపార్డర్‌లో రోహిత్, విరాట్ తప్ప మిగిలిన ప్లేయర్లకు అనుభవం లేదు..
ఐసీసీ ఈవెంట్లలో టీమిండియా తేలిపోవడానికి ఇదే ప్రధాన కారణం. ఐసీసీ టైటిల్ గెలిచి పదేళ్లు గడుస్తున్నా, వరల్డ్ కప్ గెలవడానికి కావాల్సిన టీమ్‌ని వాళ్లు తయారుచేయలేకపోతున్నారు. మెగా ఈవెంట్లలో బాగా ఆడాలంటే ప్లేయర్ల మెంటల్ స్ట్రెంగ్త్ చాలా ముఖ్యం..
ఐపీఎల్‌లో బాగా ఆడిన ప్లేయర్లను టీమ్‌లోకి తీసుకుంటున్నారు. వాళ్లు అంతర్జాతీయ స్థాయిలో అదే రకమైన ప్రదర్శన ఇవ్వలేకపోతున్నారు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వంటి హై ఓల్టేజీ మ్యాచుల్లో ఐపీఎల్ ఆడిన అనుభవం ఎందుకూ పనికి రాదు..
hafeez
అదీకాకుండా ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం చాలా పెరిగింది. ప్రతీ ప్లేయర్ కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటున్నాడు. ఇది కూడా వారిని తీవ్ర ఒత్తిడిలోకి గురి చేస్తోంది. ఆ విషయంలో పాక్ ప్లేయర్లు చాలా బెటర్. టీమిండియా ప్లేయర్లకు వచ్చినంత సోషల్ మీడియ అటెన్షన్ మాకు రాదు..
ఒక్కసారి బరిలో దిగిన తర్వాత రెండో ఆలోచన ఉండకూడదు. నేను చేయగలనా? అనే అనుమానం అస్సలు రాకూడదు. అలాగని ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయకూడదు.
ప్రత్యర్థి బలాన్ని అంచనా వేసి, దాన్ని తన బలంగా మార్చుకోగలగాలి. అప్పుడు ఎలాంటి మ్యాచుల్లో అయినా విజయం సాధించొచ్చు. దీనికి మానసిక బలం చాలా అవసరం..’ అంటూ చెప్పుకొచ్చాడు పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ మహ్మద్ హఫీజ్..