- Home
- Sports
- Cricket
- వాళ్ల మెయిన్ బౌలర్లు లేరు, ఇండియాని ఓడించడానికి ఇంకో ఛాన్స్ ఇదే... పాక్ మాజీ క్రికెటర్ సర్ఫరాజ్...
వాళ్ల మెయిన్ బౌలర్లు లేరు, ఇండియాని ఓడించడానికి ఇంకో ఛాన్స్ ఇదే... పాక్ మాజీ క్రికెటర్ సర్ఫరాజ్...
ఆసియా కప్ 2022 టోర్నీలో దాయాది దేశాలు భారత్- పాకిస్తాన్ రెండూ కూడా ప్రధాన బౌలర్లు లేకుండా బరిలో దిగుతున్నాయి. పాకిస్తాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ ఆఫ్రిదీ గాయం కారణంగా ఆసియా కప్ 2022 టోర్నీకి దూరమైతే భారత జట్టు స్టార్ బౌలర్లు జస్ప్రిత్ బుమ్రా, హర్షల్ పటేల్ ఇద్దరూ గాయాలతో ఈ టోర్నీకి దూరంగా ఉన్నారు... గత ఏడాది నుంచి మహ్మద్ షమీని టీ20లకు దూరంగా పెట్టింది భారత జట్టు...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో భారత జట్టుపై ఐసీసీ వరల్డ్ కప్స్‌లో మొట్టమొదటి విజయం అందుకున్న పాకిస్తాన్,రాక రాక దక్కిన ఆ విజయాన్ని మరిచిపోలేకపోతోంది.. అందుకే ఆగస్టు 28న జరిగే ఆసియా కప్ మ్యాచ్‌లో భారత్‌పై మరోసారి గెలవబోతున్నట్టు పాక్ మాజీ క్రికెటర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు...
‘మ్యాచులు గెలవాలంటే బౌలర్లే మెయిన్. భారత ప్రధాన పేసర్లు జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ ఇద్దరూ ఈసారి మ్యాచ్ ఆడడం లేదు. దీన్ని పాకిస్తాన్ కరెక్ట్‌గా వాడుకోవాలి. వాళ్లను రెండోసారి అదే గ్రౌండ్‌లో చిత్తుగా ఓడించాలి...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ పేసర్ సర్ఫరాజ్ నవాజ్...
‘పాకిస్తాన్ కొన్నాళ్లుగా వీక్ టీమ్స్‌తో మ్యాచులు ఆడుతోంది. బలమైన టీమ్స్‌తో ఆడడం లేదు. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో పాకిస్తాన్ ఎలా ఆడుతుందో చూడాలి.. స్వదేశంలో ఆడిన మ్యాచులు కూడా బోరింగ్‌గా సాగాయి...
పీసీబీ పిచ్ క్యూరేషన్‌పై దృష్టి పెట్టాలి. పూర్తి డెడ్ పిచ్‌లు రూపొందించి, సెంచరీలు చేసి గొప్ప బ్యాటర్లమని చెప్పుకుంటున్నారు. ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో జరిగింది ఇదే. పిచ్‌లు తేమతో, కాస్త పచ్చికతో అటు బౌలర్లకు, ఇటు బ్యాటర్లకు అనుకూలించే ఉండాలి...’ అంటూ కామెంట్ చేశాడు సర్ఫరాజ్ నవాజ్...
Bumrah and Shami
సర్ఫరాజ్ నవాజ్ చెప్పినట్టుగా భారత జట్టు ప్రధాన బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ ఒక్కడే ఆసియా కప్ 2022 టోర్నీలో ఆడబోతున్నాడు. జస్ప్రిత్ బుమ్రా, హర్షల్ పటేల్ గాయాలతో ఈ టోర్నీకి దూరం కాగా మహ్మద్ షమీకి వర్కలోడ్ తగ్గించే ఉద్దేశంతో గత టీ20 వరల్డ్ కప్ నుంచి పొట్టి ఫార్మాట్‌కి దూరంగా పెట్టింది బీసీసీఐ...
Arshdeep Singh
భువనేశ్వర్ కుమార్‌తో పాటు యంగ్ బౌలర్లు ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్ పేస్ బౌలర్లుగా ఆసియా కప్ ఆడబోతున్నారు. ఆరు నెలల తర్వాత గాయం నుంచి కోలుకున్న దీపక్ చాహార్ ఫామ్‌లోకి వచ్చినా అతన్ని కేవలం స్టాండ్ బై ప్లేయర్‌గా ఆసియా కప్‌కి ఎంపిక చేసింది బీసీసీఐ...