- Home
- Sports
- Cricket
- ఈ రాహుల్ ద్రావిడ్ కంటే రవిశాస్త్రియే చాలా బెటర్... సౌతాఫ్రికా టెస్టు సిరీస్ ఓటమి తర్వాత...
ఈ రాహుల్ ద్రావిడ్ కంటే రవిశాస్త్రియే చాలా బెటర్... సౌతాఫ్రికా టెస్టు సిరీస్ ఓటమి తర్వాత...
టీమిండియా ఏ మ్యాచ్‌లో ఓడినా, మొదట ట్రోలింగ్ ఎదుర్కొనేది కెప్టెన్, హెడ్ కోచ్‌లే. తాజాగా సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్ ఓటమి తర్వాత కూడా టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌పై విమర్శల వర్షం కురుస్తోంది...

ఆడిలైడ్ టెస్టులో ఘోర పరాజయం తర్వాత అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చి, ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలిచి అబ్బురపరిచింది టీమిండియా...
స్వదేశంలో ఇంగ్లాండ్ సిరీస్‌లోనూ, ఆ తర్వాత ఇంగ్లాండ్ టూర్‌లోనూ టీమిండియా పర్ఫామెన్స్ టాప్ క్లాస్‌గా సాగింది. చెన్నై టెస్టు తర్వాత వరుసగా మూడు మ్యాచుల్లో గెలిచి, సిరీస్ గెలిచింది భారత జట్టు...
ఇంగ్లాండ్ టూర్‌లో నాలుగు టెస్టుల్లో రెండు టెస్టుల్లో గెలిచిన టీమిండియా, వర్షం కారణంగా మొదటి టెస్టులో విజయాన్ని అందుకోలేక డ్రాగా ముగించింది...
రవిశాస్త్రి కోచింగ్‌లో టీమిండియా ఆటతీరు, ప్రత్యర్థి జట్లకు వణుకుపుట్టించేలా సాగింది. అయితే ఇప్పుడు టీమిండియాలో ఆ ఫైర్ కనిపించలేదు...
లార్డ్స్ టెస్టులో కేవలం గంటన్నరలో ఇంగ్లాండ్ వంటి టాప్ క్లాస్ బ్యాటింగ్ టీమ్‌ను, వారిదేశంలోనే ఆలౌట్ చేసింది భారత జట్టు... ఆ మ్యాచ్‌లో టీమిండియా ఆటతీరు, జింకలపై విరుచుకుపడిన పులుల్లా సాగింది...
విరాట్ కోహ్లీ అగ్రెసివ్ కెప్టెన్సీకి, హెడ్ కోచ్ రవిశాస్త్రి దూకుడైన నిర్ణయాలు కూడా కలిసి టీమిండియా టాప్ క్లాస్ పర్ఫామెన్స్‌తో ప్రత్యర్థికి చుక్కలు చూపించేది...
సౌతాఫ్రికా సిరీస్‌లో అలాంటి ఫైర్ టీమిండియాలో కనిపించలేదు. రవిశాస్త్రితో పోలిస్తే రాహుల్ ద్రావిడ్ చాలా మృదు స్వభావి. ఆయన ఆటతీరు కూడా అంతే...
కేప్ టౌన్ టెస్టులో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూసినవాళ్లకీ, టీమిండియాపై హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్రభావం ఏ రేంజ్‌లో పడిందో అర్థం అవుతుంది...
విరాట్ కోహ్లీ అగ్రెసివ్ కెప్టెన్సీకి రాహుల్ ద్రావిడ్ క్లాస్ కోచింగ్‌కి పొంతన కుదురకపోవడం వల్లే సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్ ఓడిందని అంటున్నారు క్రికెట్ అభిమానులు...
సెంచూరియన్ టెస్టు మ్యాచ్ గెలిచిన తర్వాత టెస్టు సిరీస్ ఓడిపోవడం, రెండో టెస్టులో విరాట్ కోహ్లీ గాయంతో దూరం కావడంతో ఇది పూర్తిగా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ వైఫల్యమేనంటూ ట్రోల్స్ చేస్తున్నారు ఫ్యాన్స్...