- Home
- Sports
- Cricket
- 2 నెలలు, నలుగురు కెప్టెన్లు, ఇద్దరు కోచ్‌లు... కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక టీమిండియా పరిస్థితి ఇది..
2 నెలలు, నలుగురు కెప్టెన్లు, ఇద్దరు కోచ్‌లు... కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక టీమిండియా పరిస్థితి ఇది..
విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం, భారత క్రికెట్ టీమ్ వాతావరణాన్ని పెంట పెంట చేసేసింది. సిరీస్ కో కెప్టెన్, టూర్‌కో సారథి అన్నట్టుగా టీమ్‌లో ప్రతీ ఒక్కరూ కెప్టెన్సీ చేసేస్తున్నారు...

మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక ఏడాది గ్యాప్‌లో 6 అంతర్జాతీయ సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్‌ని అందుకున్నాడు. అయితే టీమిండియా పరిస్థితి మాత్రం మరోలా ఉంది..
గత ఏడాది ఏకంగా ఏడుగురు, టీమిండియాకి కెప్టెన్లుగా వ్యవహరించారు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, జస్ప్రిత్ బుమ్రా, శిఖర్ ధావన్ కెప్టెన్సీల్లో మ్యాచులు ఆడింది భారత జట్టు..
ఆసియా కప్ 2022, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీల్లో ఓడిన భారత జట్టు, సౌతాఫ్రికా టూర్‌లో వన్డే సిరీస్‌లో క్లీన్ స్వీప్ అయ్యింది. ఆఖరికి బంగ్లాదేశ్‌లోనూ వన్డే సిరీస్ కోల్పోయింది. కోహ్లీ కెప్టెన్‌గా కొనసాగి ఉంటే ఐసీసీ టైటిల్స్ రాకపోయినా ఆసియా కప్ అయినా గెలిచి ఉండేదని విరాట్ ఫ్యాన్స్ ఆవేదన..
ప్రస్తుతం వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ఆడనుంది టీమిండియా. ఈ టీ20 సిరీస్‌కి హర్ధిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు..
Jasprit Bumrah
వెస్టిండీస్ సిరీస్ తర్వాత ఐర్లాండ్ టూర్‌కి వెళ్తుంది భారత జట్టు. ఈ టూర్‌కి జస్ప్రిత్ బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. ఈ సిరీస్ ద్వారా ఏడాది తర్వాత రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు బుమ్రా. ఐర్లాండ్ టూర్‌లో టీమిండియాకి వీవీఎస్ లక్ష్మణ్, హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తాడు..
ఆ తర్వాత ఆసియా క్రీడల కోసం ఓ జట్టు, చైనా వెళ్తుంది. ఆసియా క్రీడల్లో భారత క్రికెట్ పురుషుల జట్టుకి రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. వీవీఎస్ లక్ష్మణ్ కోచింగ్‌లో ఆసియా క్రీడల్లో పాల్గొంటుంది భారత జట్టు..
ఆగస్టు 30 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్ 2023 టోర్నీలో రోహిత్ శర్మ కెప్టెన్సీలో పాల్గొంటుంది టీమిండియా... ఈ టోర్నీకి రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తాడు..
అంటే రెండు నెలల గ్యాప్‌లో టీమిండియాకి నలుగురు కెప్టెన్లు మారుతుంటే, ఇద్దరు హెడ్ కోచ్‌గా వ్యవహరించబోతున్నారు. హార్ధిక్ పాండ్యా, బుమ్రా గాయపడితే ఈ సంఖ్య మరింత పెరగొచ్చు.. 2022 జనవరి నుంచి లెక్కబెడితే, టీమిండియా కెప్లెన్ల సంఖ్య 9కి చేరింది.. ప్రపంచంలో ఏ జట్టూ ఇంత తక్కువ గ్యాప్‌లో ఇంత మంది కెప్టెన్లను మార్చలేదు.