ఆ ఇద్దరూ రిటైర్ అయితే! టీమిండియా మరో శ్రీలంక జట్టులా మారుతుందా... రోహిత్, విరాట్ రిటైర్మెంట్ వార్తలతో...
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో గ్రూప్ స్టేజీకే పరిమితమైన తర్వాత కూడా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో వన్ ఆఫ్ ది టైటిల్ ఫెవరెట్ టీమ్స్‌లో ఒకటిగా నిలిచింది భారత జట్టు. కారణం కొత్త కోచ్, కొత్త కెప్టెన్... విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి చేయలేని పని... రాహుల్ ద్రావిడ్, రోహిత్ శర్మ చేస్తారని భావించారు. అయితే టీమిండియా ఫ్యాన్స్ ఆశలు మాత్రం నెరవేరలేదు...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ తర్వాత రెండేళ్లకు పొట్టి ప్రపంచకప్ ఆడుతోంది టీమిండియా. ఈ టోర్నీ సమయానికి 37 ఏళ్లు దాటే రోహిత్ శర్మ... జట్టుకి అందుబాటులో ఉండడం అనుమానమే. మొన్ననే 34 ఏళ్లు పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ... మరో రెండేళ్లు టీ20 ఫార్మాట్‌లో కొనసాగడానికి ఇష్టపడతాడా? చెప్పడం కష్టమే...
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్ అయితే టీమిండియా పరిస్థితి ఏంటి? ఇప్పుడు టీమిండియా అభిమానులను ఈ కొత్త అనుమానం వెంటాడుతోంది. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ వంటి ప్లేయర్లు రిటైర్ అయే సమయానికి ఎంఎస్ ధోనీ, యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి యంగ్ ప్లేయర్లు.. మంచి అనుభవం సాధించి, మ్యాచ్ విన్నర్లుగా నిరూపించుకున్నారు... సీనియర్ల తర్వాత జట్టు భారాన్ని మోశారు...
ఒకవేళ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్ అయితే టీమిండియా భారాన్ని మోసేది ఎవరు? రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్ వంటి సీనియర్లు ఎక్కువ కాలం జట్టులో కొనసాగే అవకాశం కనిపించడం లేదు. ఇక మిగిలిన జట్టులో హార్ధిక్ పాండ్యా, జస్ప్రిత్ బుమ్రా, భువీలకు మంచి అనుభవం ఉంది...
అయితే వీళ్లు పూర్తి ఫిట్‌నెస్ మెయింటైన్ చేస్తూ టీమ్‌కి పూర్తిగా కొన్నేళ్ల పాటు అందుబాటులో ఉండడం చాలా కష్టం. రిషబ్ పంత్, సంజూ శాంసన్ వంటి ప్లేయర్లు ఉన్నా, వాళ్లు ఇంకా పూర్తిగా మ్యాచ్ విన్నర్లుగా నిరూపించుకోలేకపోయారు. సూర్యకుమార్ యాదవ్ వయసు కూడా 30 దాటేసింది...
సూర్య కూడా టీమ్‌కి కొన్నేళ్ల పాటు అందుబాటులో ఉండడం కష్టమే. చూస్తుంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్ అయితే భారత జట్టు, మరో శ్రీలంక టీమ్‌లా తయారవుతుందేమోనని అనుమానిస్తున్నారు అభిమానులు. మహేళ జయవర్థనే, కుమార సంగర్కర, లసిత్ మలింగ, ముత్తయ్య మురళీధరన్, తిలకరత్నే దిల్షాన్ వంటి స్టార్లు ఉన్నంతకాలం.. టాప్ టీమ్‌గా వెలుగొందింది శ్రీలంక..
Image credit: Getty
వీళ్లంతా రెండు మూడేళ్ల గ్యాప్‌లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవడంతో లంక పరిస్థితి అద్వాన్నంగా తయారైంది. లక్కీగా ఆసియా కప్ 2022 టైటిల్ గెలిచిన శ్రీలంక జట్టు, రెండు ఎడిషన్లలో టీ20 వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ రౌండ్స్‌లో అసోసియేట్ దేశాలతో పోటీ పడాల్సిన పరిస్థితిని ఫేస్ చేసింది...
టీమిండియాని అలాంటి పొజిషన్‌లో చూడలేమని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పూర్తిగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడానికి ముందే తమ ప్లేస్‌ని భర్తీ చేయగల మ్యాచ్ విన్నర్లను గుర్తించి, తయారుచేసి... టీమ్‌కి అందుబాటులో ఉంచాలని కోరుకుంటున్నారు అభిమానులు...