MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • T20 World Cup 2026 : వెళుతూ వెళుతూ ఆల్ టైమ్ రికార్డు బద్దలుగొట్టిన ఆసిస్.. అదేంటో తెలుసా?

T20 World Cup 2026 : వెళుతూ వెళుతూ ఆల్ టైమ్ రికార్డు బద్దలుగొట్టిన ఆసిస్.. అదేంటో తెలుసా?

AUSTRALIA vs OMAN : టీ20 వరల్డ్ కప్ 2026 కి గ్రాండ్ విక్టరీతో వీడ్కోలు పలికింది ఆస్ట్రేలియా. పసికూన ఒమన్ తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో అరుదైన రికార్డు నెలకొల్పింది. 

2 Min read
Author : Arun Kumar P
Published : Feb 20 2026, 11:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఆసిస్ అరుదైన రికార్డు
Image Credit : Getty

ఆసిస్ అరుదైన రికార్డు

ICC Men's T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ లో మరో సంచలనం నమోదయ్యింది. ఇప్పటికే టోర్నీ నుండి నిష్క్రమించిన ఆస్ట్రేలియా అదిరిపోయే ఫినిషింగ్ టచ్ ఇచ్చింది. వరుస ఓటములతో విసిగిపోయిన ఆసిస్ టీం పసికూన ఒమన్ పై విశ్వరూపం చూపింది... అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ లో చెలరేగి టీ20 వరల్డ్ కప్ లోనే అరుదైన విజయాన్ని సాధించింది.

24
కేవలం 10 ఓవర్లలోపై లక్ష్యచేధన...
Image Credit : ANI

కేవలం 10 ఓవర్లలోపై లక్ష్యచేధన...

వరల్డ్ కప్ లీగ్ స్టేజ్ లో చివరి మ్యాచ్ ఆస్ట్రేలియా, ఒమన్ మధ్య జరిగింది. శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియంలో మొదట బ్యాటింగ్ కు దిగిన ఒమన్ చతికిలపడింది... ఆసిస్ బౌలర్ల దాటికి బ్యాటింగ్ లైనప్ 16.2 ఓవర్లు మాత్రమే ఆడి 104 పరుగులకే కుప్పకూలింది. 105 పరుగుల లక్ష్యాన్ని కూడా అదే ఊపుతో చేధించింది ఆసిస్.

ఆసిస్ ఓపెనర్ల దూకుడుముందు 105 పరుగుల లక్ష్యం చిన్నబోయింది. కెప్టెన్ మిచెల్ మార్ష్ కేవలం 33 బంతుల్లోనే 64 పరుగులు (6 సిక్సర్లు, 7 ఫోర్లు) చేశాడు. ట్రావిస్ హెడ్ కూడా 19 బంతుల్లో 32 పరుగులు చేశాడు. చివర్లో ఇగ్నిస్ 6 బంతుల్లో 12 పరుగులతో మెరిశాడు. దీంతో కేవలం 9.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించి రికార్డు సృష్టించింది.

Related Articles

Related image1
T20 World Cup 2026 : అతిచిన్న వయసులో అద్భుత సెంచరీ.. ఎవరీ యువరాజ్ సమ్రా.. ఇండియాతో లింక్ ఏంటి?
Related image2
T20 World Cup 2026: సూపర్ 8లో భారత్, సౌతాఫ్రికాలకు జింబాబ్వే వార్నింగ్ !
34
ఇంగ్లాండ్ రికార్డును సమంచేసిన ఆసిస్...
Image Credit : Getty

ఇంగ్లాండ్ రికార్డును సమంచేసిన ఆసిస్...

టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యంత వేగంగా 100 కంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని చేధించిన జట్టుగా ఆసిస్ చరిత్ర సృష్టించింది. 9.4 ఓవర్లలోనే లక్ష్యచేధన అంటే మరో 62 బంతులు మిగిలుండగానే విజయం సాధించిందన్నమాట. 2004 వరల్డ్ కప్ లో యూఎస్ పై ఇంగ్లాండ్ ఇలాగే 62 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది... ఈ రికార్డును ఆసిస్ సమం చేసింది.

ఇదే ఆస్ట్రేలియా మొదటి వరల్డ్ కప్ (2007) లో ఇలాంటి విజయాన్నే అందుకుంది. శ్రీలంకపై 102 పరుగుల లక్ష్యాన్ని 58 బంతులు మిగిలుండగానే ఆసిస్ విజయం సాధించింది. ఇక 2024లో యూఎస్ పై వెస్టిండిస్ 55 బంతులు, 2021లో ఆసిస్ పై ఇంగ్లాండ్ 50 బంతులు మిగిలుండగానే విజయం సాధించాయి. ఇవే టీ20 వరల్డ్ కప్ లో టాప్ రికార్డులు. 

44
ఒమన్ ఓటమిని శాసించిన జంపా
Image Credit : Getty

ఒమన్ ఓటమిని శాసించిన జంపా

మొదట బ్యాటింగ్ కు దిగిన ఒమన్ టాప్ ఆర్డర్ ఆసిస్ బౌలర్ ఆడమ్ జంపా దెబ్బకు విలవిల్లాడిపోయింది. హమద్ మీర్జా, మహ్మద్ నదీమ్, షకీల్ అహ్మద్, షఫీక్ జన్ వికెట్లను పడగొట్టాడు జంపా. ఓపెనర్లు ఆమిర్ ఖలీల్, కెప్టెన్ జతీందర్ సింగ్ వికెట్లనను బార్ట్‌లెట్ పడగొట్టాడు. మిడిల్ ఆర్డర్ లో వసీం అలీ 32 పరుగులతో రాణించడంతో ఒమన్ గౌరవప్రదంగా 104 పరుగులైన చేయగలిగింది. ఒమన్ బ్యాటింగ్ లైనప్ నడ్డివిరిచిన జంపాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రికెట్
క్రీడలు
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
అండర్ డాగ్స్‌గా సూపర్ 8కి.. పిల్లబచ్చా అనుకుంటే అంచనాలు తలకిందులే..
Recommended image2
అది కోహ్లీకే సాధ్యం.. టీమిండియా రన్ మెషిన్‌ను ఆకాశానికి ఎత్తేసిన కమ్మిన్స్
Recommended image3
ధోనికే థ్యాంక్స్.. నా ఆటను మార్చింది అతడే.. దూబే సంచలన వ్యాఖ్యలు
Related Stories
Recommended image1
T20 World Cup 2026 : అతిచిన్న వయసులో అద్భుత సెంచరీ.. ఎవరీ యువరాజ్ సమ్రా.. ఇండియాతో లింక్ ఏంటి?
Recommended image2
T20 World Cup 2026: సూపర్ 8లో భారత్, సౌతాఫ్రికాలకు జింబాబ్వే వార్నింగ్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved