- Home
- Sports
- Cricket
- సిరాజ్ కు కోహ్లి మద్దతిచ్చాడు.. అతడికి నువ్వు అండగా ఉంటే అద్భుతాలు చేస్తాడు.. హిట్ మ్యాన్ ను కోరిన ఇర్ఫాన్
సిరాజ్ కు కోహ్లి మద్దతిచ్చాడు.. అతడికి నువ్వు అండగా ఉంటే అద్భుతాలు చేస్తాడు.. హిట్ మ్యాన్ ను కోరిన ఇర్ఫాన్
Irfan Pathan Urges Rohit Sharma to Backs Avesh Khan: టీమిండియా యువ పేసర్ మహ్మద్ సిరాజ్ ఎదుగుదలలో విరాట్ కోహ్లి పాత్ర ఎంతో ఉంది.. సిరాజ్ కు కోహ్లి మద్దతిచ్చిన మాదిరిగానే రోహిత్ శర్మ కూడా...

దేశంలో ఉన్న యువ క్రికెటర్లలో టాలెంట్ కు కొదవ లేదు. అయితే కావాల్సిందల్లా వారికి సరైన మద్దతు. కష్టకాలంలో వారికి కాస్త అండగా నిలిస్తే టీమిండియాకు సంచలన విజయాలు అందించడానికి ఎంతోమంది ఆటగాళ్లు ఉన్నారు.
టీమిండియాలో ఇప్పుడిప్పుడే బౌలర్ గా ఎదుగుతున్న యువ పేసర్ అవేశ్ ఖాన్ కు కూడా ఇలాంటి మద్దతే కావాలని అంటున్నాడు మాజీ ఆల్ రౌండర్ ఇర్పాన్ పఠాన్.
ప్రస్తుతం టీమిండియా ప్రధాన బౌలర్ గా ఎదిగిన మహ్మద్ సిరాజ్ కు మాజీ సారథి విరాట్ కోహ్లి ప్రోద్బలం అందించాడని, అటువంటి మద్దతు అవేశ్ కు కూడా కావాలని హిట్ మ్యాన్ ను పఠాన్ కోరాడు.
ఓ క్రీడా ఛానెల్ తో మాట్లాడుతూ.. ‘క్రికెట్ లో మంచి రోజుల కంటే బ్యాడ్ డేస్ (సరిగా రాణించకపోవడం) ఎక్కువగా ఉంటాయి. అలాంటివి వచ్చినప్పుడు జట్టులోని కెప్టెన్, కోచ్, టీమ్ మేనేజ్మెంట్ మీకు మద్దతుగా నిలవాలి.
మనం మహ్మద్ సిరాజ్ గురించి మాట్లాడాల్సి వస్తే.. అతడికి మాజీ సారథి విరాట్ కోహ్లి పూర్తి మద్దతుగా నిలిచాడు. సిరాజ్ లో కాన్ఫిడెన్స్ పెరిగి ఇవాళ అతడు ప్రధాన బౌలర్ స్థాయికి ఎదిగాడంటే ఆ క్రెడిట్ కచ్చితంగా కోహ్లికే దక్కుతుంది. అందులో ఎంతమాత్రమూ సందేహం లేదు. సిరాజ్ కు అతడు చాలా మద్దతిచ్చాడు.
ఆటగాళ్లకు అలాంటి మద్దతు అవసరం. అవేశ్ ఖాన్ కూడా మంచి టాలెంట్ ఉన్న బౌలర్. ఇప్పుడు అతడికి కూడా సిరాజ్ కు దక్కిన మద్దతే కావాలి.. అప్పుడే అతడిలో కాన్ఫిడెన్స్ పెరిగి బాగా రాణించగలుగుతాడు’ అని అన్నాడు.
కాగా.. ఇటీవలే ముగిసిన విండీస్ తో ఆఖరి టీ20లో అరంగ్రేటం చేసిన అవేశ్ ఖాన్ లంకతో ధర్మశాలలో ముగిసిన మూడో టీ20 లో రాణించాడు. మూడో టీ20లో ఆడాడు. ఈ మ్యాచులో రెండు వికెట్లు కూడా తీసుకున్నాడు.
ఇక ఐపీఎల్ లో గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడి అదరగొట్టిన అవేశ్ ఖాన్ ను ఈ ఏడాది లక్నో సూపర్ జెయింట్స్ రూ. 10 కోట్లతో దక్కించుకున్న విషయం తెలిసిందే. అన్ క్యాప్డ్ ప్లేయర్ల జాబితాలో అత్యధిక ధర దక్కింది అవేశ్ ఖాన్ కే...