- Home
- Sports
- Cricket
- ధోనీ, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్ ఉండి ఏం లాభం, అంబటి రాయుడిని ఆడించాల్సింది... రవిశాస్త్రి షాకింగ్ కామెంట్స్
ధోనీ, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్ ఉండి ఏం లాభం, అంబటి రాయుడిని ఆడించాల్సింది... రవిశాస్త్రి షాకింగ్ కామెంట్స్
2019 వన్డే వరల్డ్‌కప్ సమయంలో అంబటి రాయుడిని జట్టుకి ఎంపిక చేయడంపై జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. స్వయంగా అంబటి రాయుడు, సెలక్టర్ల తీరుతో విసుగు చెంది, అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు అర్ధాంతరంగా ప్రకటించాడు... తాజాగా ఈ విషయంపై షాకింగ్ కామెంట్లు చేశాడు మాజీ కోచ్ రవిశాస్త్రి...

2019 వన్డే వరల్డ్‌కప్ టోర్నీకి ఎంపిక చేసిన భారత జట్టులో మహేంద్ర సింగ్ ధోనీ, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్ రూపంలో ముగ్గురు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్లకు చోటు కల్పించారు సెలక్టర్లు...
నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసే సమర్థుడైన బ్యాట్స్‌మెన్ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న టీమిండియా, వరల్డ్ కప్ ముందువరకూ ఆ స్థానంలో మెరుగ్గా రాణిస్తున్న అంబటి రాయుడికి విశ్వ కప్ ఆడే జట్టులో చోటు దక్కలేదు...
అంబటి రాయుడి కంటే మెరుగ్గా బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్ చేసే విజయ్ శంకర్‌ను వన్డే వరల్డ్‌కప్ టోర్నీకి ఎంపిక చేసినట్టు కామెంట్ చేశాడు అప్పటి చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్.. అందుకే టీమిండియా మ్యాచులు చూసేందుకు ‘త్రీడీ గ్లాసెస్’ కొన్నానని అంబటి రాయుడు వేసిన ట్వీట్, సంచలనంగా మారింది...
కనీసం ఆరు మ్యాచులు ఆడిన అనుభవం కూడా సెలక్టర్లు, సెలక్షన్ ప్యానెల్‌లో ఉండడం వల్లే ఓ వరల్డ్ కప్‌కి ఎలాంటి టీమ్ కావాలో తెలుసుకోలేక, లాటరీలో ప్లేయర్లను ఎంపిక చేస్తున్నారని విమర్శలు కూడా వచ్చాయి...
‘వన్డే వరల్డ్‌కప్ 2019 టోర్నీకి టీమ్ సెలక్షన్‌లో మా ప్రమేయం లేదు. వరల్డ్ కప్‌కి ముగ్గురు వికెట్ కీపర్లు ఎందుకో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు...
నాలుగో స్థానంలో సరైన బ్యాట్స్‌మెన్ లేడు. అంబటి రాయుడిని ఎంపిక చేయలేదు. వికెట్ కీపర్లుగా ఎమ్మెస్ ధోనీ, దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్‌లను సెలక్ట్ చేశారు...
ముగ్గురు వికెట్ కీపర్లు ఉంటే, బ్యాటింగ్ లోపాలన్నీ పోతాయా? టీమ్ సెలక్షన్ అంతా అయ్యాక, మా అభిప్రాయం అడిగారు. అయినా మా అభిప్రాయాలకు పెద్దగా విలువనిచ్చేవాళ్లు కాదు...
హెడ్‌కోచ్‌గా ఉన్నప్పుడు భారత జట్టు సాధించిన విజయాలతో సంతృప్తి చెందాను. అయితే ఐసీసీ టైటిల్ గెలవకపోవడం మాత్రం ఎప్పటికీ లోటే...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలుస్తామనే అనుకున్నాం. అయితే ఐదేళ్ల పాటు టాప్‌లో ఉన్న జట్టు, ఫైనల్ మ్యాచ్‌లో ఓడడం బాధపెట్టింది. అయితే ఆ ఓటమికి పరిస్థితులు కలిసి రాకపోవడం కూడా కారణం...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ కోచ్ రవిశాస్త్రి...
వయసు ప్రధాన కారణంగా చూపిస్తూ అంబటి రాయుడిని వన్డే వరల్డ్‌కప్ టీమ్‌కి ఎంపిక చేయలేదు సెలక్టర్లు. శిఖర్ ధావన్, విజయ్ శంకర్, హార్ధిక్ పాండ్యా వంటి ప్లేయర్లు గాయం కారణంగా తప్పుకున్నా అంబటి రాయుడికి అవకాశం దక్కలేదు...
వన్డే వరల్డ్‌కప్ 2019 టోర్నీలో వరుస విజయాలతో గ్రూప్‌లో టేబుల్ టాపర్‌గా నిలిచిన టీమిండియా, వర్షం కారణంగా రెండు రోజుల పాటు సాగిన సెమీ ఫైనల్‌లో 18 పరుగుల తేడాతో ఓడింది.