MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • పెళ్లిరోజునే వన్డేల్లో డబుల్ సెంచరీ! రితికా అంటే రోహిత్‌కి ఎంతో స్పెషలో చెప్పడానికి...

పెళ్లిరోజునే వన్డేల్లో డబుల్ సెంచరీ! రితికా అంటే రోహిత్‌కి ఎంతో స్పెషలో చెప్పడానికి...

ప్రస్తుత భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి సోషల్ మీడియాలో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే, మాస్ జనాల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు రోహిత్ శర్మ. ఐపీఎల్‌లో ఐదు టైటిల్స్ గెలిచి, లేటు వయసులో టీమిండియా కెప్టెన్సీ దక్కించుకున్న రోహిత్ శర్మ పెళ్లి రోజు నేడు. క్రికెట్ మేనేజర్ రితికా సాజ్దేని ప్రేమించి పెళ్లాడాడు రోహిత్...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Dec 13 2022, 02:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Image credit: Instagram

Image credit: Instagram

తెలుగు జీన్స్ కలిగిన రోహిత్ శర్మకు ఈరోజు (డిసెంబర్ 13) చాలా చాలా స్పెషల్. ఎందుకంటే 2015లో ఇదే రోజున రితికా సాజ్దేని పెళ్లాడాడు రోహిత్. అంతేకాదు రికార్డు స్థాయిలో వన్డేల్లో త్రిబుల్ డబుల్ సెంచరీ బాదింది కూడా నేడే. స్పోర్ట్స్ మేనేజర్‌గా వ్యవహారించిన రితికాకి, రోహిత్ శర్మకు పెళ్లికి ఆరేళ్ల క్రితమే పరిచయం ఏర్పడింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Image credit: Instagram

Image credit: Instagram

రోహిత్ కంటే ముందు విరాట్ కోహ్లీకి కూడా మేనేజర్‌గా వ్యవహారించింది రితికా... ఆ సమయంలో రితికా, విరాట్ కలిసి ఓ సినిమా థియేటర్‌కి వెళ్లడంతో ఈ ఇద్దరూ ఢేటింగ్‌లో ఉన్నారని ప్రచారం జరిగింది. అయితే అందులో నిజం లేదని తర్వాత తేలిపోయింది...
 

38

భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కి రాఖీ కడుతూ అన్నయ్యా అంటూ ప్రేమగా పిలిచేది రితికా. అలా రితికాపై రోహిత్ శర్మకు మంచి ఇంప్రెషన్ ఏర్పడింది. అది స్నేహంగా మారి, ఆ తర్వాత ప్రేమకు దారి తీసి చివరకు పెళ్లి దాకా వెళ్లింది...

48

తన క్రికెట్ కెరీర్‌కి ప్రాణం పోసిన ముంబైలోని బోరివాలి స్పోర్ట్స్ క్లబ్‌కి రితికాను తీసుకెళ్లిన రోహిత్ శర్మ... మోకాళ్లపై నుంచొని రింగ్‌తో ఆమెకు ప్రపోజ్ చేశాడట... 11 ఏళ్ల వయసులో ఇదే స్పోర్ట్స్ క్లబ్‌లో క్రికెటర్‌గా కెరీర్‌ను మొదలెట్టాడు రోహిత్ శర్మ... రోహిత్ ప్రపోజల్‌కి రితికా ‘ఎస్’ చెప్పడంతో వీరిద్దరూ డిసెంబర్ 13, 2015లో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. 

58

యాదృచ్ఛికమో లేక పెళ్లాయ్యాక లక్ కలిసి వచ్చిందో తెలీదు కానీ... అంతకుముందు దాకా భారత జట్టులోకి వస్తూ పోతూ ఉన్న రోహిత్ శర్మ, 2015 తర్వాత టీమిండియాలో కీలక ప్లేయర్‌గా మారిపోయి వైట్ బాల్ క్రికెట్‌లో వైస్ కెప్టెన్‌గా కూడా నియమించబడ్డాడు...

68

అందుకే రితికా వచ్చాకే తన కెరీర్ మలుపు తిరిగిందని బాగా నమ్ముతాడు రోహిత్ శర్మ. తన భార్య రితికాపై ఉన్న ప్రేమను ఆటలో చూపించడం రోహిత్ శర్మ స్పెషాలిటీ. భార్య పుట్టిన రోజున, పెళ్లి రోజున జరిగిన మ్యాచుల్లో రోహిత్‌ బ్యాటు నుంచి చిరస్మరణీయ పర్ఫామెన్స్‌లు వచ్చాయి. 2017లో తన పెళ్లిరోజునే వన్డేల్లో మూడో డబుల్ సెంచరీ బాదాడు రోహిత్ శర్మ... 

78

2017లో శ్రీలంకపై మొహాలీలో రికార్డు స్థాయిలో మూడో ద్విశతకం బాదాడు... 153 బంతుల్లో 13 ఫోర్లు, 12 సిక్సర్లతో వన్డేల్లో మూడో డబుల్ సెంచరీ నమోదుచేసిన రోహిత్, 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఒకటి కంటే ఎక్కువ సార్లు 200+ అందుకున్న ఏకైక బ్యాటర్‌గా నిలిచాడు. 

88

రోహిత్ శర్మ, రితికా దంపతలకు 2018లో సమైరా అనే పాప జన్మించింది. విరాట్ కోహ్లీ - అనుష్క శర్మ తమ పాప వామిక ముఖం కూడా బయటికి రాకుండా జాగ్రత్త పడుతుంటే రితికా, రోహిత్ మాత్రం సమైరాతో దిగిన ఫోటోలను స్పెషల్‌గా పోస్ట్ చేస్తూ ఉంటారు... 

About the Author

CR
Chinthakindhi Ramu
రోహిత్ శర్మ
Latest Videos
Recommended Stories
Recommended image1
Justin Greaves: అసలు ఎలా సాధ్యం బ్రో? ఒక్క రన్ ఇవ్వకుండా 5 ఓవర్లు, 5 వికెట్లు.. మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్
Recommended image2
Saransh Jain : 33 ఏళ్ల లేటు వయసులో టీమిండియా గేటు తాకే ఛాన్స్.. ఎవరీ సరాన్ష్ జైన్?
Recommended image3
Team India squad: శ్రీలంకతో బిగ్ ఫైట్.. టీమిండియాలో భారీ మార్పులు.. 33 ఏళ్ల ఆల్‌రౌండర్‌కు లక్కీ ఛాన్స్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved