ఆస్ట్రేలియాకి చుక్కలు చూపిస్తున్న భారత బౌలర్లు... ఆరు వికెట్లు కోల్పోయిన ఆసీస్...

First Published Dec 28, 2020, 11:38 AM IST

బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా పట్టు సాధించింది. మొదటి ఇన్నింగ్స్‌లో 131 పరుగుల ఆధిక్యం తర్వాత... ఆతిథ్య ఆస్ట్రేలియాను 100 పరుగుల లోపే 6 వికెట్లు తీసి ఊహించని షాక్ ఇచ్చారు భారత బౌలర్లు. ఐసీసీ నెం.1 బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్‌ను మరోసారి సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేర్చిన భారత బౌలర్లు, టాప్ క్లాస్ ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేశారు.

నాలుగో ఓవర్ మొదటి బంతికే జో బర్న్స్‌ను పెవిలియన్ చేర్చాడు ఉమేశ్ యాదవ్...

ఆ తర్వాత 49 బంతుల్లో 28 పరుగులు చేసిన లబుషేన్‌ను రవిచంద్రన్ అశ్విన్ పెవిలియన్‌కు పంపించాడు. 42 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది ఆస్ట్రేలియా.

స్టీవ్ స్మిత్, లబుషేన్ కలిసి టీ విరామానికి మరో వికెట్ పడకుండా కాపాడారు. అయితే టీ విరామం తర్వాత స్మిత్‌ను క్లీన్ బౌల్డ్ చేసి షాక్ ఇచ్చాడు బుమ్రా...

స్టీవ్ స్మిత్ సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరడం ఈ సీజన్‌లో ఇది నాలుగోసారి... బాక్సింగ్ డే టెస్టులో మూడోసారి...

ఓ వైపు వికెట్లు పడుతున్నా ఎంతో ఓపిగ్గా బ్యాటింగ్ చేశాడు ఆసీస్ ఓపెనర్ మాథ్యూ వేడ్. 137 బంతుల్లో 3 ఫోర్లతో 40 పరుగులు చేశాడు...

అయితే మాథ్యూ వేడ్‌ను రవీంద్ర జడేజా బోల్తా కొట్టించాడు.

జడ్డూ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ రూపంలో అవుట్ అయ్యాడు వేడ్. రివ్యూ తీసుకున్నా ఆసీస్‌కి ఫలితం లేకపోయింది.

46 బంతుల్లో 17 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్‌ను మహ్మద్ సిరాజ్ అవుట్ చేశాడు.

సిరాజ్ బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు హెడ్.

ఆ తర్వాత కొద్దిసేపటికే కెప్టెన్ టిమ్ పైన్‌ను కూడా పెవిలియన్‌కి పంపించాడు రవీంద్ర జడేజా.

9 బంతుల్లో 1 పరుగు చేసిన పైన్, పంత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

99 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా... ఇంకా భారత స్కోరుకి వెనకబడే ఉంది.

ఆల్‌రౌండర్లు ప్యాట్ కమ్మిన్స్, కామెరూన్ గ్రీన్ క్రీజులో ఉన్నారు. వీరిద్దరి రాణింపుపైనే ఆసీస్ స్కోరు ఆధారపడి ఉంది.

బౌలింగ్ చేస్తూ గాయపడిన ఉమేశ్ యాదవ్‌ను స్కానింగ్ కోసం పంపించినట్టు తెలిపింది బీసీసీఐ.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?