INDvsAUS: అయినా తీరు మారలేదు... మూడో వన్డేలో టాపార్డర్ విఫలం... భారీ స్కోరు కష్టమే...
First Published Dec 2, 2020, 11:23 AM IST
INDvAUS: మొదటి రెండు వన్డేల్లో టాస్ ఓడి, ప్రత్యర్థికి భారీ స్కోరు అప్పగించిన టీమిండియా... ఎట్టకేలకు మూడో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కి అనుకూలించే పిచ్‌పై భారీ స్కోరు చేసి, ప్రత్యర్థిని ఒత్తిడిలో పడేయాలనుకున్న విరాట్ కోహ్లీ వ్యూహం ఫలించలేదు. కొత్త బౌలర్లతో బరిలో దిగిన ఆస్ట్రేలియా, భారత టాపార్డర్‌ను తక్కువ స్కోరుకే పెవిలియన్ చేర్చింది...

దూకుడుగా ఆడే మయాంక్ అగర్వాల్ స్థానంలో జట్టులోకి వచ్చిన శుబ్‌మన్ గిల్‌తో ఓపెనింగ్ చేసిన శిఖర్ ధావన్... కేవలం 16 పరుగులకే పెవిలియన్ చేరాడు.

మొదటి రెండు వన్డేల్లో మొదటి వికెట్‌కి 50+ భాగస్వామ్యం రాగా... మూడో వన్డేలో 26 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది భారత జట్టు. హజల్‌వుడ్ వేసిన మొదటి ఓవర్‌లో ఒక్క పరుగు కూడా తీయలేకపోయిన ధావన్, కొత్త బౌలర్ అబ్బాట్ బౌలింగ్‌లో అగర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?