కొడుకుతో కలిసి ప్రైవేటు జెట్‌లో... టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా లగ్జరీ లైఫ్ విశేషాలు...
టీమిండియా స్టార్ క్రికెటర్ల లగ్జరీ లైఫ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు మహేంద్ర సింగ్ ధోనీ, అండ్ టీమిండియాలో కొందరికి ప్రత్యేకంగా జెట్ ఫ్లైయిట్స్ ఉన్నాయి. వారిలో భారత ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ ప్లేయర్ హార్ధిక్ పాండ్యా కూడా ఒకడు...
కొన్నాళ్ల క్రితం తండ్రిని కోల్పోయిన హార్ధిక్ పాండ్యా, తన కొడుకుతో కలిసి ప్రైవేట్ జెట్‌లో వెళ్తున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు...
‘నా కొడుకు మొదటి ఫ్లైయిట్’ అంటూ కామెంట్ పెట్టిన ఈ ఫోటోకి మంచి స్పందన వస్తోంది... హార్ధిక్ పాండ్యా పోస్టు చేసిన ఫోటోపై భారత క్రికెటర్ దినేశ్ కార్తీక్ స్పందించాడు...
‘పిల్లలు బాత్రూం పోవడానికి ప్రైవేట్ జెట్ చాలా సౌకర్యంగా ఉంటుంది...’ అంటూ అగస్త్య, హార్ధిక్ పాండ్యా ఫోటోలపై ఫన్నీ కామెంట్ పెట్టాడు దినేశ్ కార్తీక్...
ముంబై ఇండియన్స్‌తో పాటు అన్న కృనాల్ పాండ్యా, హార్ధిక్ భార్య నటాశా, ఆఫ్ఘాన్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ ఈ ఫోటోపై ‘హార్ట్ సింబల్స్’తో కామెంట్ చేశారు...
ఐపీఎల్ 2020, ఆ తర్వాత ఆస్ట్రేలియా టూర్‌లో వన్డే, టీ20 సిరీస్‌ల్లో పాల్గొన్న హార్ధిక్ పాండ్యా... కొడుకుకి నాలుగు నెలల పాటు దూరంగా గడిపాడు...
టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కారణంగా ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెలుచుకున్న హార్ధిక్ పాండ్యా... టెస్టు జట్టులో అవకాశం వచ్చినా, ఇంటికి వెళ్లిపోతానని, కొడుకుని చూడక నాలుగు నెలలు అవుతోందని కామెంట్ చేసిన విషయం తెలిసిందే...
ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కి ఎంపికైన హార్ధిక్ పాండ్యా, కుటుంబంతో కలిసి క్వారంటైన్‌లోకి వెళ్లాడు...
ఇందుకోసం తన సొంత విమానంలో భార్యా, కొడుకుతో కలిసి చెన్నైకి బయలుదేరి వెళ్లాడు హార్ధిక్ పాండ్యా...