పాక్ చేతుల్లో ఓడిపోవాల్సి వస్తుందని టీమిండియా భయపడుతోంది! పీసీబీ మాజీ ఛైర్మెన్ నజం సేథీ కామెంట్స్..
ఆసియా కప్ 2023 టోర్నీలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మొదటి మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే రద్దయ్యింది. అయితే ఈ రెండు జట్ల మధ్య సెప్టెంబర్ 10న సూపర్ 4 రౌండ్ మ్యాచ్ జరగనుంది..
ఆసియా కప్ 2022 టోర్నీలో పాక్‌పై గ్రూప్ మ్యాచ్‌లో గెలిచిన టీమిండియా, సూపర్ 4 మ్యాచ్‌లో పరాజయం పాలైంది. ఆ తర్వాత శ్రీలంకతో మ్యాచ్‌లోనూ ఓడడంతో ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయింది భారత జట్టు...
షెడ్యూల్ ప్రకారం సూపర్ 4 రౌండ్ మ్యాచులు కొలంబోలో జరగాల్సి ఉంది. అక్కడ అయితే కుండపోత వర్షాలు కురుస్తుండడంతో హంబతోట వేదికగా సూపర్ 4, ఫైనల్ మ్యాచులు నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ భావించింది. అయితే ఆ నిర్ణయంపై పాక్ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం..
హంబతోటలో వాతావరణం, కొలంబోలో వాతావరణాన్ని పూర్తి భిన్నంగా ఉంటుంది. సముద్ర తీరాన ఉన్న హంబతోటలో వేడి ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా ఆఖరి నిమిషంలో కొలంబో నుంచి సూపర్ 4 మ్యాచులు హంబతోటకి మార్చాలనే ఆలోచనను విరమించుకున్నట్టు సమాచారం..
‘బీసీసీఐ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ కలిసి ఈరోజు ఉదయం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌ని కొలంబోలో కాకుండా హంబతోటలో పెట్టాలని నిర్ణయించుకున్నట్టు పీసీబీకి తెలిపాయి.కొలంబోలో వర్షాలు పడుతుండడంతో హంబతోటలో మ్యాచ్ పెట్టాలని అనుకున్నారు..
Image credit: Getty
అయితే ఒక్క గంటలోనే ఆలోచన మార్చుకుని, కొలంబోలోనే మ్యాచ్ పెడదామని చెప్పారు. అసలు ఏం జరుగుతోంది? పాకిస్తాన్ చేతుల్లో ఓడిపోవాల్సి వస్తుందని టీమిండియా భయపడుతోందా? హంబతోటలో వర్షం కురిసే ఛాన్సే చాలా తక్కువని వాతావరణ శాఖ చెబుతోంది..’ అంటూ ట్వీట్ చేశాడు పీసీబీ మాజీ ఛైర్మెన్ నజం సేథీ..