- Home
- Sports
- Cricket
- విరాట్ అలా అనగానే నా ఒళ్లు జలదరించింది... ఆర్‌సీబీ మాజీ ప్లేయర్ దేవ్‌దత్ పడిక్కల్...
విరాట్ అలా అనగానే నా ఒళ్లు జలదరించింది... ఆర్‌సీబీ మాజీ ప్లేయర్ దేవ్‌దత్ పడిక్కల్...
ఐపీఎల్ 2020 సీజన్ ద్వారా వెలుగులోకి వచ్చి, టీమిండియా తరుపున ఆరంగ్రేటం కూడా చేసేశాడు యంగ్ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్. ఆర్‌సీబీ తరుపున రెండు సీజన్లు ఆడిన దేవ్‌దత్ పడిక్కల్‌ని ఆ టీమ్ రిటైన్ చేసుకోకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...

ఐపీఎల్ 2020 సీజన్‌లో విరాట్ కోహ్లీతో కలిసి ఓపెనింగ్ చేసిన దేవ్‌దత్ పడిక్కల్, ఆరంగ్రేటంలోనే వరుసగా నాలుగు హాఫ్ సెంచరీలు బాది అందరి దృష్టినీ ఆకర్షించాడు...
ఐపీఎల్ 2021 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 52 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లతో 101 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు దేవ్‌దత్ పడిక్కల్...
Virat Kohli-Devdutt Padikkal
మరో ఎండ్‌లో విరాట్ కోహ్లీ 47 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 72 పరుగులు చేయడంతో 178 పరుగుల టార్గెట్‌ని 16.3 ఓవర్లలో వికెట్లేమీ కోల్పోకుండా ఛేదించి ఘన విజయం నమోదు చేసింది ఆర్‌సీబీ...
‘‘ఆర్‌సీబీలో ఒకప్పుడు ఓ సంఘటన మాత్రం నాకు క్లియర్‌గా గుర్తుండిపోయింది. ఆర్ఆర్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత కెమెరాలు విరాట్‌ను ఫాలో అవుతున్నాయి...
అప్పుడు విరాట్ భాయ్... ‘దేవ్‌దత్ దగ్గరికి వెళ్లండి. ఈరోజు అతనిది...’ అన్నాడు. ఆ మాటలు వినగానే నా ఒళ్లు జలదరించింది...’’ అంటూ చెప్పుకొచ్చాడు దేవ్‌దత్ పడిక్కల్...
ఐపీఎల్ 2022 మెగా వేలంలో దేవ్‌దత్ పడిక్కల్‌ని తిరిగి కొనుగోలు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...
దేవ్‌దత్ పడిక్కల్ కోసం రూ.4 కోట్ల వరకూ కోట్ చేసింది ఆర్‌సీబీ. అయితే ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ పడిక్కల్ కోసం బరిలో దిగడంతో ఆర్‌సీబీ పోటీ నుంచి తప్పుకుంది...
దేవ్‌దత్ పడిక్కల్‌ను రూ.7.75 కోట్లకు కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్. తొలి రెండు మ్యాచుల్లో మిడిల్ ఆర్డర్‌లో పడిక్కల్‌ని ఆడించిన ఆర్ఆర్, లక్నోతో మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ స్థానంలో ఓపెనర్‌గా ఆడించింది.