- Home
- Sports
- Cricket
- కనీసం ఆ ఎక్స్‌ప్రెషన్ అయినా మార్చు అన్నా... చూడలేకపోతున్నాం! విరాట్ కోహ్లీ డకౌట్ తర్వాత...
కనీసం ఆ ఎక్స్‌ప్రెషన్ అయినా మార్చు అన్నా... చూడలేకపోతున్నాం! విరాట్ కోహ్లీ డకౌట్ తర్వాత...
విరాట్ కోహ్లీ... గత దశాబ్దంలో నమ్మశక్యం కాని విధంగా పరుగుల వరద పారించిన క్రికెటర్. అసాధ్యమనుకున్న సచిన్ టెండూల్కర్ రికార్డులు బ్రేక్ చేయగలడని నమ్మిన బ్యాటర్. కానీ రెండేళ్లుగా ఆ రన్ మెషిన్ వేగం తగ్గింది...

అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు (ప్రస్తుత తరంలో), ఐపీఎల్‌లో 6 వేలకు పైగా పరుగులు, దశాబ్దంలో 20 వేలకు పైగా పరుగులు చేసిన ఏకైక క్రికెటర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ, కొన్నాళ్లుగా సరైన ఫామ్ అందుకోలేకపోతున్నాడు...
ఐపీఎల్ 2022 సీజన్‌కి ముందు బీసీసీఐతో విభేదాల కారణంగా మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీకి రాజీనామా చేసిన విరాట్ కోహ్లీ.. అప్పటి నుంచి మానసికంగా కూడా కాస్త బ్యాలెన్స్ కోల్పోయినట్టు కనిపిస్తోందని అంటున్నారు ఫ్యాన్స్...
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇప్పటిదాకా 7 మ్యాచులు ఆడిన విరాట్ కోహ్లీ... 119 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో రెండు సార్లు రనౌట్ అయ్యాడు విరాట్...
ఎట్టి పరిస్థితుల్లోనూ వికెట్ కోల్పోవడానికి ఇష్టపడని విరాట్ కోహ్లీ... రనౌట్ అయ్యే పరిస్థితి వస్తే డైవ్ చేసి అవుట్ అవ్వకుండా ఉండేందుకు శాయశక్తులా ప్రయత్నించేవాడు. కానీ ఈ సారి విరాట్‌లో ఆ తపన కనిపించడం లేదు...
తాజాగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఛమీరా బౌలింగ్‌లో దీపక్ హుడాకి క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డకౌట్ అయ్యాడు విరాట్ కోహ్లీ...
అవుటైన తర్వాత నవ్వుతూ... ఓ నిస్తేతజమైన నవ్వు నవ్వుతూ పెవిలియన్ చేరాడు విరాట్ కోహ్లీ. కోహ్లీ అభిమానులు, తన అభిమాన క్రికెటర్‌ని ఇలా చూడలేకపోతున్నారు...
అవుటైన తర్వాత నవ్వుతూ... ఓ నిస్తేతజమైన నవ్వు నవ్వుతూ పెవిలియన్ చేరాడు విరాట్ కోహ్లీ. కోహ్లీ అభిమానులు, తన అభిమాన క్రికెటర్‌ని ఇలా చూడలేకపోతున్నారు...
ఇంతకుముందు విరాట్ కోహ్లీ అవుట్ అయితే కోపంతో రగిలిపోయేవాడు. ఆవేశం, ఆగ్రహం తన కళ్లల్లో కనిపించేవి. ఇప్పుడు విరాట్‌లో ఆ ఫైర్ కనిపించడం లేదు.. పరుగులు చేయలేకపోయినా పర్లేదు కానీ, అలా నవ్వుతూ కనిపిస్తుంటే... చూడలేకపోతున్నామని అంటున్నారు విరాట్ ఫ్యాన్స్...
భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా విరాట్ కోహ్లీ ఫామ్‌పై స్పందించాడు. ‘విరాట్ కోహ్లీ అతిగా క్రికెట్ ఆడేశాడు. ఇప్పుడు అతనికి విశ్రాంతి చాలా అవసరం...’ అంటూ కామెంట్ చేశాడు గవాస్కర్...
‘అవును, విరాట్‌కి ఇప్పుడు బ్రేక్ చాలా అవసరం. పెళ్లి, పాప, మీడియా, వ్యక్తిగత జీవితంతో పాటు కొన్ని ఇతర సమస్యలు కూడా విరాట్‌ని చాలా డిస్టర్బ్ చేశాడు. విరాట్ ఓ బిగ్గెస్ట్ స్టార్.. అతన్ని ఇలా చూడలేం...’ అంటూ కామెంట్ చేశాడు కేవిన్ పీటర్సన్...
విరాట్ కోహ్లీ ఎక్స్‌ప్రెషన్‌ని ప్రమోషన్ కోసం వాడేసింది టీఎస్‌ఆర్‌టీసీ. ‘కండక్టర్ గారు వచ్చి పాస్ అడిగినప్పుడు, బస్ పాస్ ఇంట్లో మరిచిపోయిన మన రియాక్షన్... మీరు ఎప్పడైనా పాస్ మరిచిపోయి బస్సు ఎక్కారా?’ అంటూ పోస్టు చేసింది తెలంగాణ ఆర్‌టీసీ...