- Home
- Sports
- Cricket
- T20 worldcup 2021లో టీమిండియా షెడ్యూల్ ఫిక్స్... నమీబియా, స్కాట్లాండ్‌లతో పూర్తి షెడ్యూల్ ఇదే...
T20 worldcup 2021లో టీమిండియా షెడ్యూల్ ఫిక్స్... నమీబియా, స్కాట్లాండ్‌లతో పూర్తి షెడ్యూల్ ఇదే...
టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ క్వాలిఫైయర్ మ్యాచులు పూర్తయ్యాయి. గ్రూప్ ఏ నుంచి శ్రీలంక, నమీబియా... గ్రూప్ బీ నుంచి స్కాట్లాండ్, బంగ్లాదేశ్ జట్లు... సూపర్ 12 రౌండ్‌కి అర్హత సాధించాయి. రేపటి నుంచి సూపర్ 12 రౌండ్ మ్యాచులు ప్రారంభం కాబోతున్నాయి...

అక్టోబర్ 24న దుబాయ్ వేదికగా దాయాది పాకిస్తాన్‌తో టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో తన తొలి మ్యాచ్ ఆడుతుంది టీమిండియా...
రెండేళ్ల తర్వాత భారత్, పాక్ మధ్య జరుగుతున్న మ్యాచ్ కావడంతో దీనికి భారీ హైప్ వచ్చేసింది... 60 శాతం ప్రేక్షకుల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది.
ఆ తర్వాత అక్టోబర్ 31న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఆడుతుంది భారత జట్టు.
గత 15 ఏళ్లలో ఐసీసీ ఈవెంట్లలో న్యూజిలాండ్‌ను ఓడించలేకపోయింది భారత జట్టు. దీంతో ఈ మ్యాచ్‌పై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ గెలిచిన తర్వాత భారత్‌తో ఆడబోతున్న మ్యాచ్ కావడంతో న్యూజిలాండ్‌పైన కూడా చాలా అంచనాలు ఉన్నాయి...
నవంబర్ 3న ఆఫ్ఘనిస్తాన్‌తో అబుదాబీ వేదికగా టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో మూడో మ్యాచ్ ఆడుతుంది టీమిండియా.
పసికూనగా ఎంట్రీ ఇచ్చినా, టీ20ల్లో ఆఫ్ఘాన్‌కి ఘనమైన రికార్డు ఉంది. కాబట్టి ఈ మ్యాచ్‌ని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు...
నవంబర్ 5న స్కాట్లాండ్‌తో దుబాయ్ వేదికగా మ్యాచ్ ఆడబోతోంది భారత జట్టు. క్వాలిఫైయర్స్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి టేబుల్ టాపర్‌గా సూపర్ 12కి అర్హత సాధించిన స్కాట్లాండ్‌ను కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు...
బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన స్కాట్లాండ్, 140+ పరుగుల స్కోరు చేసి దాన్ని కాపాడుకుంటూ విజయాన్ని అందుకోగలిగింది...
ఆ తర్వాత నవంబర్ 8న దుబాయ్ వేదికగా నమీబియాతో మ్యాచ్ ఆడుతుంది టీమిండియా. అన్నీ సజావుగా జరిగి టేబుల్ టాపర్‌గా నిలిస్తే, సూపర్ 12కి ముందు జరిగే ఈ మ్యాచ్‌లో కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంటుంది...