- Home
- Sports
- Cricket
- స్వదేశానికి చేరుకున్న ఆవేశ్ ఖాన్... నెట్ బౌలర్ నుంచి న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కి...
స్వదేశానికి చేరుకున్న ఆవేశ్ ఖాన్... నెట్ బౌలర్ నుంచి న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కి...
టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి నెట్‌బౌలర్‌గా ఎంపికైన ఆవేశ్ ఖాన్, యూఏఈ నుంచి స్వదేశానికి చేరుకున్నాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచిన ఆవేశ్ ఖాన్, త్వరలోనే టీమిండియా ఆరంగ్రేటం చేయడానికి సిద్ధమవుతున్నాడు...

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడిన ఆవేశ్ ఖాన్, 16 మ్యాచుల్లో 24 వికెట్లు తీసి... హర్షల్ పటేల్ తర్వాత అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.
ఫస్టాఫ్‌లో పర్ఫామెన్స్ కారణంగా భారత జట్టు, ఇంగ్లాండ్ టూర్‌కి స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపికైన ఆవేశ్ ఖాన్, టెస్టు సిరీస్ ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడి, అర్ధాంతరంగా స్వదేశానికి చేరుకున్నాడు.
స్టాండ్ బై ప్లేయర్‌గా ఎన్నిక కావడం వల్ల శ్రీలంక టూర్‌లో ఆరంగ్రేటం చేసే అవకాశాన్ని కోల్పోయాడు ఆవేశ్ ఖాన్...
మధ్యప్రదేశ్‌కి చెందిన ఆవేశ్ ఖాన్, సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 2021 టోర్నీలో తన జట్టు తరుపున పాల్గొనబోతున్నాడు.
ఆ తర్వాత భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే టీ20 సిరీస్‌లో ఆవేశ్ ఖాన్‌కి అవకాశం ఇవ్వాలని భారత క్రికెట్ బోర్డు సెలక్టర్లు భావిస్తున్నారు.
140+ వేగంతో బంతులు వేసే ఆవేశ్ ఖాన్, హర్షల్ పటేల్ కంటే మంచి సగటుతో వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ‘142 నుంచి 145 కి.మీ.ల వేగంతో బంతులు వేసే ఆవేశ్ ఖాన్, బౌలింగ్‌కి సహకరించని పిచ్‌లపై కూడా బౌన్స్‌లను రాబట్టగలుగుతున్నాడు.
అతను టీమిండియాకి నెట్ బౌలర్‌గా చాలారోజులుగా ఉంటున్నాడు. కానీ అతనికి ప్రమోషన్ ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది...’ అంటూ కామెంట్ చేశాడు ఓ బీసీసీఐ అధికారి...
టీ20 వరల్డ్‌కప్ 2021 ఫైనల్ ముగిసిన తర్వాత మూడు రోజులకు నవంబర్ 17న న్యూజిలాండ్‌తో స్వదేశంలో టీ20 సిరీస్ ఆడనుంది భారత జట్టు...
ఈ టీ20 సిరీస్‌కి విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రా, రోహిత్ శర్మ వంటి సీనియర్లకు విశ్రాంతినిచ్చి రుతురాజ్ గైక్వాడ్, దేవ్‌దత్ పడిక్కల్, పృథ్వీషా వంటి కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని భావిస్తోంది బీసీసీఐ...
ఈ సిరీస్ ద్వారా ఆవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్ వంటి ఐపీఎల్ 2021 సీజన్ బౌలింగ్ స్టార్లకు అవకాశం ఇవ్వాలని భావిస్తోంది బీసీసీఐ.
ప్రస్తుతం టీమిండియాతో నెట్ బౌలర్లుగా సేవలు అందిస్తున్న హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్... భారత జట్టు టీ20 వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత బయో బబుల్ నుంచి బయో బబుల్‌లో చేరతారని సమాచారం...