MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • హసన్ ఆలీ భార్యపై అసభ్య కామెంట్లు చేస్తున్న పాక్ ఫ్యాన్స్... షమీ విషయంలో అప్పుడు అలా...

హసన్ ఆలీ భార్యపై అసభ్య కామెంట్లు చేస్తున్న పాక్ ఫ్యాన్స్... షమీ విషయంలో అప్పుడు అలా...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచి, విజయోత్సహంతో సెమీ ఫైనల్ బరిలో దిగింది పాకిస్తాన్. వరుసగా ఆరు మ్యాచుల్లో జట్టులో మార్పులు చేయకుండా ఒకే ప్లేయింగ్ ఎలెవన్‌తో ఆడి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది పాక్...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Nov 12 2021, 01:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112

పాకిస్తాన్ ఆడుతున్న తీరు చూసి ఆస్ట్రేలియా కూడా కాసింత జంకినట్టు కనిపించింది. పాక్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ వంటి ఫీల్డర్లు కూడా క్యాచ్ డ్రాప్ చేశారు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212

అయితే నిజ జీవితంలో ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడానికి పెద్ద సమయం పట్టనట్టే... ఆటలో కూడా ఐదు మ్యాచులు గెలిచిన జట్టు, ఓటమి రుచి చూడడానికి ఒక్క మ్యాచ్ చాలు... అలాంటి ఓటమి పాక్‌కి ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్‌లో ఎదురైంది...

312

177 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి, ఆరు బంతులు మిగిలి ఉండగానే ఛేదించి, టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది ఆస్ట్రేలియా... ఆసీస్‌తో పాటు పాక్ ఫీల్డర్లు కూడా కొన్ని క్యాచులను డ్రాప్ చేశారు.

412

షాహీన్ ఆఫ్రిదీ వేసిన 19వ ఓవర్ మూడో బంతికి మాథ్యూ వేడ్ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్ దగ్గర హసన్ ఆలీ జారవిడిచాడు. ఆ తర్వాత వరుసగా మూడు సిక్సర్లు బాదిన వేడ్, మ్యాచ్‌ను మరో ఓవర్ ఉండగానే ముగించాడు...

512

భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత పేసర్ మహ్మద్ షమీ వేసిన 17వ ఓవర్‌లో 17 పరుగులు రాబట్టిన పాక్ ఓపెనర్లు రిజ్వాన్, బాబర్ ఆజమ్ మ్యాచ్‌ను ముగించేశారు...

612

మహ్మద్ షమీ ముస్లిం మతస్తుడు కావడంతో అతన్ని నీచంగా తిడుతూ, కావాలనే భారత జట్టును ఓడించావని దూషిస్తూ సోషల్ మీడియా వేదికగా దాడికి పాల్పడ్డారు కొందరు నెటిజన్లు...

712

ఇప్పుడు సరిగ్గా అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు హసన్ ఆలీ. ‘హసన్ ఆలీ క్యాచ్ డ్రాప్ చేయడం వల్లే మేం ఓడిపోయాం. అదే టర్నింగ్ పాయింట్. ఆ క్యాచ్ అందుకుని ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదంటూ’ కామెంట్ చేశాడు పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్...

812

పరిణితి లేని కెప్టెన్‌గా తగ్గట్టే పాక్ క్రికెట్ ఫ్యాన్స్ కూడా హసన్ ఆలీని, అతని భార్యను, కుటుంబాన్ని బూతులు తిడుతూ సైబర్ దాడి చేస్తున్నారు...

912

మహ్మద్ షమీపై జరిగిన సైబర్ అటాక్‌ని ఖండించిన పాక్ క్రికెటర్లు ఎవ్వరూ, హసన్ ఆలీ గురించి ఒక్క ట్వీట్ కూడా చేయకపోవడం విశేషం...

1012

హసన్ ఆలీ, భారతదేశానికి చెందిన ఇంజనీర్ సమీయా అర్జోని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. శత్రుదేశానికి చెందిన అమ్మాయిని పెళ్లాడడంతో పాక్ జనాలు మరింత రెచ్చిపోయి, సమీయా ఇన్‌స్టా అకౌంట్‌పై బూతులతో దాడి చేస్తున్నారు...

1112

ఈ సైబర్ దాడిని భారత నెటిజన్లు ఖండిస్తున్నారు. హసన్ ఆలీకి మద్ధతుగా ఉన్నామని భరోసా ఇస్తూ ‘IND stand with Hasan Ali’హ్యాష్ ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తున్నారు...

1212

హసన్ ఆలీ భార్య సమీయా అర్జోతో పాటు సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 1 పరుగుకే క్లీన్ బౌల్డ్ అయిన షోయబ్ మాలిక్ భార్య, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా ఈ విధమైన కామెంట్లు, పోస్టులను ఎదుర్కొంటుండడం విశేషం...

About the Author

CR
Chinthakindhi Ramu
 
3rd TEST • SA vs AUS
Live
SASA
329 & 387
AUSAUS
(10.3 ov) 429 & 29/3
Day 5 - Session 1
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs NZ: చేతులెత్తేసిన బ్యాట‌ర్లు.. టీమిండియా ఓటమికి కారణాలు ఇవే
Recommended image2
Glenn Phillips: గ్లెన్ ఫిలిప్స్ మెరుపు సెంచరీ... రికార్డులు బద్దలు కొట్టిన కీవీస్ స్టార్
Recommended image3
Hardik Pandya: హార్దిక్ పాండ్యా కోసం బిగ్ ప్లాన్.. ముగ్గురు స్టార్లను ఇచ్చేస్తున్న సీఎస్‌కే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved