వరల్డ్ కప్ గెలవడం కోసం గాడిద కాళ్లు పట్టుకున్నా తప్పులేదు... పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్..
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడింది పాకిస్తాన్. ఆస్ట్రేలియాలో ఫాస్ట్ బౌలింగ్ ట్రాక్ బౌలింగ్ పిచ్‌ల మీద టోర్నీ జరుగుతుండడం, పాక్ టీమ్‌లో మంచి ఫాస్ట్ బౌలర్లు ఉండడంతో ఆ జట్టుపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే తొలి రెండు మ్యాచుల్లో ఓడిన పాకిస్తాన్ జట్టు... సెమీస్ రేసు నుంచి దాదాపు తప్పుకుంది...
Pakistan Team
టీమిండియా చేతుల్లో ఆఖరి ఓవర్ ఆఖరి బంతికి ఓడిన పాకిస్తాన్, జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి 3 బంతుల్లో 3 పరుగులు చేయలేక ఓటమి పాలైంది.. పాకిస్తాన్ బౌలర్లు బాగానే రాణించినా బ్యాటర్లు చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయారు...
pakistan
‘ఏడాది నుంచి పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్ సరిగ్గా లేదనే విషయం అందరికీ తెలుసు. నేను కెప్టెన్‌ని అయ్యి ఉంటే నా లక్ష్యం ఒక్కటే ఉండేది ఎలాగైనా వరల్డ్ కప్ గెలవాలి. దాని కోసం నేను ఏమైనా చేస్తా...
Image credit: Getty
గాడిద కాళ్లు పట్టుకోమన్నా పట్టుకున్నా, దాన్ని బాప్ చేయమన్నా చేయడానికి సిద్ధంగా ఉంటా... ఎందుకంటే నా లక్ష్యం వరల్డ్ కప్ గెలవడమే. షోయబ్ మాలిక్ కావాలంటే నేను ఛైర్మెన్‌తో, సెలక్టర్లతో నిక్కచ్ఛిగా ఆ విషయం చెప్పేవాడిని. మాలిక్ లేకపోతే మేం వరల్డ్ కప్ ఆడమని...
కావాల్సిన ప్లేయర్లను ఎలాగైనా రప్పించుకోవాలి, ఆడించుకోవాలి. బాబర్ ఇలాగే ఉంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది గల్లీ టీమ్ కాదు కదా... ఎవరైతే ఏంటి? ఆడించడానికి అని సర్దుకుపోవడానికి... నేనైతే మాలిక్‌ని కచ్ఛితంగా మిడిల్ ఆర్డర్‌లో ఆడించేవాడిని...’ అంటూ చెప్పుకొచ్చాడు పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్...
Image Credit: Getty Images
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో పాకిస్తాన్ తరుపున ఆడిన సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మంచి ఇన్నింగ్స్‌తో పాక్ టీమ్ సెమీ ఫైనల్ చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే అతనికి ఈసారి పాక్ టీమ్‌లో చోటు దక్కలేదు..
జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి 3 బంతుల్లో 3 పరుగులు చేయలేక 1 పరుగు తేడాతో ఓడింది పాకిస్తాన్. అక్టోబర్ 30న నెదర్లాండ్స్‌తో మ్యాచ్ ఆడబోతున్న పాక్, ఈ మ్యాచ్‌లో ఎలాగైనా తమ ప్రతాపం చూపించాలని ఆశపడుతోంది..