MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • సూప‌ర్-8లో విరాట్ కోహ్లీ బ్యాట్ ప‌దును చూపిస్తాడా? రోహిత్‌తో ఓపెనింగ్ నిర్ణయం క‌ర‌క్టేనా?

సూప‌ర్-8లో విరాట్ కోహ్లీ బ్యాట్ ప‌దును చూపిస్తాడా? రోహిత్‌తో ఓపెనింగ్ నిర్ణయం క‌ర‌క్టేనా?

Rohit Sharma-Virat Kohli : టీ20 ప్రపంచకప్ 2024లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ-ర‌న్ మిష‌న్ విరాట్ కోహ్లీలు ఓపెనింగ్ భాగస్వాములుగా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విరాట్ కోహ్లీ నిరాశ‌ప‌రిచాడు. అలాగే, రోహిత్ శర్మ కూడా తొలి మ్యాచ్‌లో తప్ప మిగ‌తా మ్యాచ్ ల‌లో రాణించలేకపోయాడు.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 17 2024, 08:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

Rohit Sharma-Virat Kohli : అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సూపర్-8కి అర్హత సాధించింది. భారత్ రెండో రౌండ్‌కు చేరినా.. ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు పెద్ద‌గా త‌మ ప్ర‌త్యేక‌త‌ను చూపించ‌లేక‌పోయారు. 

27

ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో కోహ్లి 10 పరుగులు కూడా చేయలేదు. అలాగే, కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి మ్యాచ్‌లో అర్ధ సెంచరీ చేసిన తర్వాత, మిగిలిన మ్యాచ్‌లలో ఫ్లాప్ అయ్యాడు. ఈ క్ర‌మంలోనే సూపర్-8లో కూడా అదే ఓపెనింగ్ జోడీతో భారత్ వెళ్తుందా అనేది ప్రశ్న. ఎందుకంటే సూప‌ర్-8లో ప్రతి మ్యాచ్‌ భారత్‌కు చాలా కీలకం.

37

ఈ క్ర‌మంలోనే టీ20 ప్రపంచకప్‌లో మిగిలిన మ్యాచ్‌లకు విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మల ఓపెనింగ్ బ్యాటింగ్ జోడీలో ఎలాంటి మార్పులు చేయకూడదని భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. 

47

ఓపెనింగ్ జోడీని మార్చడం వల్ల భారత బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం చెడిపోతుందని జాఫర్ అభిప్రాయపడ్డాడు. ఇప్ప‌టివ‌ర‌కు ఈ స్టార్లు ఇద్ద‌రు ఓపెనింగ్ జోడీగా రావ‌డంతో మిగ‌తా ప్లేయ‌ర్లు కూడా త‌మ స్థానాల‌కు అల‌వాటు ప‌డ్డార‌నీ, ఇప్పుడు మార్పులు చేస్తే ఇత‌ర ఈ జోడీతో పాటు ఇత‌ర ప్లేయ‌ర్ల‌పై ఒత్తిడిప‌డే అవ‌కాశ‌ముంద‌ని పేర్కొన్నాడు.

57

బ్యాటింగ్ ఆర్డ‌ర్ చెడిపోకుండా య‌శ‌స్వి జైస్వాల్ ను ఆడించాల‌ని చూస్తే అత‌న్ని మూడో స్థానంలో బ్యాటింగ్ కు తీసుకురావ‌చ్చ‌నీ, దీంతో రిష‌బ్ పంత్ నాలుగో స్థానం బ్యాటింగ్ ఆర్డ‌ర్ లోకి వెళ్తాడ‌ని చెప్పాడు. ఇది జ‌ట్టు కూర్పుపై పెద్ద‌గా ప్ర‌భావం చూపే అవ‌కాశం లేద‌న్నాడు. సూర్య‌కుమార్ బ్యాటింగ్ ఆర్డ‌ర్ దెబ్బ‌ప‌డే అకాశం ఉంది కాబ‌ట్టి ఇలాంటి మార్పులు చేయ‌ర‌ని తాను అనుకుంటున్నాన‌ని చెప్పాడు. 

67
Virat Kohli, RohitSharma

Virat Kohli, RohitSharma

ప్ర‌స్తుతం రిషబ్ పంత్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. 'రిషబ్ మూడో స్థానంలో మంచి ప్రదర్శన కనబరిచాడు. సూర్య‌కుమార్ కూడా త‌న బ్యాట్ ప‌దును చూపించాల్సిన అవ‌స‌రముంది. వెస్టిండీస్ పిచ్ ప‌రిస్థితులు గ‌మ‌నిస్తే పవర్‌ప్లేలో మంచి ప‌రుగులు రావాలంటే కోహ్లీ-రోహిత్ ల‌తో ఓపెనింగ్ ఫ‌లితాలు ఇస్తాయ‌ని కూడా జాఫ‌ర్ పేర్కొన్నాడు. 

 

77

ఆతిథ్య అమెరికాపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన త‌ర్వాత‌ భారత్ సూపర్ 8కి అర్హత సాధించింది. భారత్ ఇప్పుడు జూన్ 20న బార్బడోస్‌లో ఫామ్‌లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌తో సూపర్ 8 మ్యాచ్ ఆడనుంది. ఇది కరేబియన్‌లో వారి మొదటి మ్యాచ్ కూడా. ఇప్పటివరకు భారత్ ఆడిన మ్యాచ్‌లన్నీ న్యూయార్క్‌లోనే జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త పిచ్‌పై ఆడడం భారత్‌కు సవాల్‌గా మారనుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
భారత దేశం
రోహిత్ శర్మ
క్రీడలు
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Abhishek Sharma : ఈ శర్మకు బౌలింగ్ చేయడం ఆ ప్లేయర్ల కర్మ..! 20 బంతుల్లో సెంచరీ ఏంటి సామీ..!!
Recommended image2
Mumbai Indians: ముంబైకి ఊపిరిపోసిన తెలుగోడు.! కల్ట్ కంబ్యాక్‌తో మిగిలిన జట్లకు పెద్ద వార్నింగ్..
Recommended image3
T20ల్లో భారత్ తరఫున అత్యధిక సెంచరీ వీరులు వీరే.. కోహ్లీని దాటేసిన అభిషేక్ శర్మ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved