MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • Cricket
  • ఆరోన్ ఫించ్, దినేశ్ కార్తీక్, రోహిత్ శర్మ... ఆఖరిసారి టీ20 వరల్డ్ కప్ ఆడబోతున్న ప్లేయర్లు వీరే...

ఆరోన్ ఫించ్, దినేశ్ కార్తీక్, రోహిత్ శర్మ... ఆఖరిసారి టీ20 వరల్డ్ కప్ ఆడబోతున్న ప్లేయర్లు వీరే...

ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ మరో కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ 2007 నుంచి 2022 వరకూ అన్ని టీ20 వరల్డ్ కప్‌ టోర్నీల్లో పాల్గొన్న ప్లేయర్లుగా రోహిత్ శర్మ, షకీబ్ అల్ హసన్ రికార్డు క్రియేట్ చేయబోతున్నారు. అయితే ఈ టీ20 వరల్డ్ కప్ టోర్నీకి చాలామంది ప్లేయర్లకు ఆఖరి పొట్టి ప్రపంచకప్ టోర్నీ కానుంది... 

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Oct 14 2022, 05:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
aaron finch

aaron finch

ఆరోన్ ఫించ్: 35  ఏళ్ల ఆస్ట్రేలియా వైట్ బాల్ కెప్టెన్ ఆరోన్ ఫించ్, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందే వన్డే ఫార్మాట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు. కొద్దికాలంగా సరైన ఫామ్‌లో లేక పరుగులు చేయడానికి ఆపసోపాలు పడుతున్న ఆరోన్ ఫించ్, టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత  అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వీడ్కోలు తీసుకుంటాడని టాక్ వినబడుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Martin Guptill

Martin Guptill

మార్టిన్ గుప్టిల్:న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గుప్టిల్, తన కెరీర్‌లో ఆరో టీ20 వరల్డ్ కప్‌లో ఆడబోతున్నాడు. 36 ఏళ్ల మార్టిన్ గుప్టిల్, టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీకి అందుబాటులో ఉండడం అనుమానమే. ఇప్పటికే సరైన ఫామ్‌లో లేక తుది జట్టులో చోటు కోసం కష్టపడుతున్న గుప్టిల్, తన కెరీర్‌లో 121 టీ20 మ్యాచులు ఆడి 3497 పరుగులు చేశాడు...

38
Dinesh Karthik

Dinesh Karthik

దినేశ్ కార్తీక్: ఐపీఎల్ 2022 సీజన్ పర్ఫామెన్స్ కారణంగా 37 ఏళ్ల వయసులో టీమిండియాలో చోటు దక్కించుకోగలిగాడు సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్. టీమిండియా ఆడిన మొట్టమొదటి టీ20 మ్యాచ్‌లో సభ్యుడిగా ఉన్న దినేశ్ కార్తీక్, 2024 టీ20 వరల్డ్ కప్‌ వరకూ ఆడడం అనుమానమే... ఆడినా అతన్ని అప్పటిదాకా కొనసాగిస్తే అది ఆరవై ఆరో వింతే అవుతుంది...

48
Mohammed Nabi

Mohammed Nabi

మహ్మద్ నబీ: ఆఫ్ఘాన్ కెప్టెన్ మహ్మద్ నబీ వయసు 38 ఏళ్లు. ఇప్పటిదాకా 101 టీ20 మ్యాచులు ఆడిన మహ్మద్ నబీకి ఇదే ఆఖరి టీ20 వరల్డ్ కప్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి.. 

58
Moeen Ali

Moeen Ali

మొయిన్ ఆలీ: ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ మొయిన్ ఆలీ వయసు 35 ఏళ్లకు పైనే. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడుతున్న ఇంగ్లాండ్ జట్టులో అతి పెద్ద వయస్కుడు మొయిన్ ఆలీనే. 61 టీ20 మ్యాచులు ఆడిన మొయిన్ ఆలీ మరో రెండేళ్లు నిలకడైన ప్రదర్శన చూపించాలంటే అది జరిగే పని కాకపోవచ్చు...

68
David Warner

David Warner

డేవిడ్ వార్నర్:ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా 36 ఏళ్లకు దగ్గరపడ్డాడు. లేటుగా అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన డేవిడ్ వార్నర్, త్వరలో ఆస్ట్రేలియా వైట్ బాల్ కెప్టెన్సీ తీసుకుంటాడని టాక్ వినబడుతోంది. అయితే వార్నర్ భాయ్ మరో రెండేళ్లు ఆడతాడా? ఆడగలడా? అనేది అనుమానించాల్సిన విషయమే... 

78
Shakib Al Hasan

Shakib Al Hasan

షకీబ్ అల్ హసన్: 35 ఏళ్ల వయసులో బంగ్లాదేశ్ జట్టుకి కెప్టెన్‌గా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడబోతున్నాడు షకీబ్ అల్ హసన్. మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ నుంచి కొనసాగుతూ వస్తున్న షకీబ్, మరో రెండేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగడం కొంచెం కష్టమే...

88

రోహిత్ శర్మ:టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వయసు 35 ఏళ్లు. ఇప్పటికే ఫిట్‌నెస్, గాయాలు, బిజీ షెడ్యూల్ కారణంగా క్రికెట్‌కి బ్రేక్ తీసుకుంటున్న రోహిత్, టీ20 వరల్డ్ కప్ 2024 వరకూ ఆడే అవకాశాలు కనిపించడం లేదు. కెప్టెన్‌గా మొట్టమొదటిసారి టీ20 వరల్డ్ కప్ ఆడుతున్న హిట్ మ్యాన్, టైటిల్ గెలిస్తే ఆ విజయంతో టీ20 కెరీర్‌కి ముగింపు పలకుతాడని కూడా ప్రచారం జరుగుతోంది... 

About the Author

CR
Chinthakindhi Ramu
రోహిత్ శర్మ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Abhishek Sharma Secret: అభిషేక్ శర్మ విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ ఇదే !
Recommended image2
Abhishek Sharma: ఒకేఒక్క ఇన్నింగ్స్ తో 7 రికార్డులు బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ
Recommended image3
IND vs AFG 3rd T20: ఆఫ్ఘన్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా.. 127 పరుగులతో భారీ విజయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved