MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Sports
  • Cricket
  • వాళ్లు తీస్ మార్ ఖాన్‌లేమీ కాదు! టీమిండియా సెమీస్ నుంచే ఇంటికి వస్తుందంటున్న షోయబ్ అక్తర్...

వాళ్లు తీస్ మార్ ఖాన్‌లేమీ కాదు! టీమిండియా సెమీస్ నుంచే ఇంటికి వస్తుందంటున్న షోయబ్ అక్తర్...

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియాపై పెద్దగా అంచనాలు లేవు. జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా గాయపడి టోర్నీకి దూరంగా ఉండడంతో పాటు భువీ పెద్దగా ఫామ్‌లో లేకపోవడంతో భారత జట్టు సెమీస్ చేరడం కూడా కష్టమేనని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Oct 28 2022, 02:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
India vs Netherlands

India vs Netherlands

పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఆఖరి బంతికి ఉత్కంఠ విజయం అందుకున్న టీమిండియా, నెదర్లాండ్స్‌పై భారీ విజయాన్ని మూటకట్టుకుంది. ఇక మిగిలిన మ్యాచుల్లో సౌతాఫ్రికా గండాన్ని దాటితే... బంగ్లా, జింబాబ్వేలపై మ్యాచులు గెలిస్తే సరిపోతుంది..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అయితే లక్కీగా సెమీ ఫైనల్ చేరినా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా అంతకుమించి ముందుకు వెళ్లదని కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్... ‘పాకిస్తాన్ టీమ్‌ బాలేదు, వాళ్ల ఆట తీరు కూడా అంతే. ఐసీసీ టోర్నీలకు యావరేజ్ టీమ్‌ని సెలక్ట్ చేసి, యావరేజ్ ఆట ఆడిస్తే... ఇలాంటి రిజల్ట్స్‌ వస్తాయి.

37

అయితే పాకిస్తాన్ టీమ్‌, సూపర్ 12 రౌండ్ నుంచి ఇంటిదారి పడుతుందని ముందుగానే ఊహించా. టీమిండియా మరో వారం ఆడుతుందంతే. వాళ్లు కూడా వచ్చేవారం ఇంటికి వచ్చేవారు. సెమీ ఫైనల్‌లో టీమిండియా ఓడిపోవడం పక్కా...

47

ఎందుకంటే వాళ్లేం తీస్ మాన్ ఖాన్‌‌లు కాదు. పాకిస్తాన్ టీమ్ ఎలాగైతే యావరేజ్‌గా ఉందో టీమిండియా కూడా అంతే. అయితే మన టీమ్, వాళ్ల కంటే చెత్తగా ఉంది అంతే... ఐసీసీ టోర్నీలు గెలవాలంటే కావాల్సిన రేంజ్ ఇరు జట్ల దగ్గరా లేదు...

57
babar

babar

ఈ ఓపెనర్లు, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లతో మీరు మ్యాచులేం గెలుస్తారు. పాక్‌కి ఓ చెత్త కెప్టెన్ దొరికాడు. రెండో గేమ్‌లోనే పాకిస్తాన్, వరల్డ్ కప్ నుంచి నిష్కమించింది. మరీ జింబాబ్వేతో మ్యాచ్ ఓడిపోతారని ఎవరు మాత్రం అనుకుంటారు...

67

షాహీన్ ఆఫ్రిదీ ఫిట్‌గా ఉన్నాడా? అతను ఫిట్‌గా లేకపోయినా ఆడించాలని ఆడిస్తున్నారా? మన ఓపెనర్లకు 30 యార్డ్ సర్కిల్‌ని ఎలా వాడుకోవాలో కూడా తెలీదు. ఫకార్ జమాన్‌ని రిజర్వు బెంచ్‌లో కూర్చెబెడుతున్నారు. అతని అనుభవాన్ని వాడుకోవడం లేదు...

77
Babar and Rizwan

Babar and Rizwan

ఫకార్ జమాన్ లాంటి బ్యాక్ ఫుట్ బ్యాటర్‌, ఆస్ట్రేలియాలో బాగా ఆడగలడు. ఇంత చెత్తగా ఆడితే జనాలకు ముఖాలు ఎలా చూపించగలం. వాళ్లు అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతారు? ఓ ప్లాన్ లేదు, ఓ మిడిల్ ఆర్డర్ లేదు... సరైన ఓపెనర్లు లేరు...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Recommended image2
IND vs SL: 5వ రోజు క్లైమాక్స్ మామూలుగా ఉండదు.. శ్రీలంక 16 రన్స్ లీడ్, భారత్‌కు 4 వికెట్లే బాకీ
Recommended image3
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved