రోహిత్ కెప్టెన్ అయ్యాక, దాన్ని పట్టించుకోవడం మానేశాడు... టీమిండియా ఫీల్డింగ్‌పై అజయ్ జడేజా ఫైర్...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా బౌలర్లు అంచనాలకు మించి రాణించారు. జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా గైర్హజరీలో ఎలా రాణిస్తారో అనుకున్న బౌలర్లు... టాప్ క్లాస్ పర్ఫామెన్స్‌తో మెప్పించారు. బ్యాటింగ్‌లోనూ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా మంచి పర్ఫామెన్స్ ఇస్తున్నారు. అయితే ఫీల్డింగ్ మాత్రం అట్టర్ ఫ్లాప్ అవుతోంది...
పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ నుంచి టీమిండియా ఫీల్డింగ్ స్థాయికి తగ్గట్టుగా లేదు. అంతకుముందు ఆసియా కప్ టోర్నీలోనూ చెత్త ఫీల్డింగ్‌తో వచ్చిన అవకాశాలను చేజేతులా చేజార్చుకున్న భారత జట్టు, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలోనూ పెద్దగా మెప్పించలేకపోతోంది...
Virat Kohli
సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ క్యాచ్ డ్రాప్ చేయడం, కెప్టెన్ రోహిత్ శర్మ రెండు సార్లు రనౌట్ చేసే ఛాన్సులను మిస్ చేశాడు. ఈ ఫీల్డింగ్ మిస్టేక్స్ కారణంగానే భారత జట్టు, సఫారీ టీమ్ చేతుల్లో పరాజయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది...
Image credit: PTI
‘విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఫీల్డింగ్‌పై చాలా కేర్ తీసుకునేవాడు. ఫీల్డింగ్ మిస్టేక్స్‌ని ఏ మాత్రం అంగీకరించేవాడు కాదు. మంచి ఫీల్డింగ్ నైపుణ్యాలు ఉన్నవారికే టీమ్‌లో ప్రాధాన్యం ఇచ్చేవాడు. అయితే రోహిత్ శర్మ కెప్టెన్ అయ్యాక ఇది పూర్తిగా మారిపోయింది...
Image credit: PTI
విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక హెడ్ కోచ్ కూడా మారిపోయాడు. ఇప్పుడు రోహిత్ శర్మ కానీ రాహుల్ ద్రావిడ్ కానీ ఫీల్డింగ్‌పై ఫోకస్ పెడుతున్నట్టు కనిపించడం లేదు. కేవలం బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలపైనే శ్రద్ధ పెడుతున్నారు. కనీసం ఫీల్డింగ్ ప్రాక్టీస్ అయినా చేయిస్తున్నారా? అనేది నా అనుమానం...
Team India
భారత జట్టులో సరైన ఫీల్డర్లు ఎవ్వరైనా ఉన్నారా? బౌండరీ లైన్ దగ్గర రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీలను నిలబెడుతున్నారు. బౌలింగ్‌లో ఈ ఇద్దరూ మంచి ప్లేయర్లే. కానీ వీళ్ల నుంచి మంచి ఫీల్డింగ్ ఆశించలేం. టీ20ల్లో బ్యాటింగ్, బౌలింగ్ చేస్తే సరిపోదు, ఫీల్డింగ్ చాలా ముఖ్యం...
టీమిండియా ఇకనైనా ఫీల్డింగ్‌పై ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. లేకపోతే క్యాచ్ డ్రాప్‌లు, మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాయి. వరల్డ్ కప్ లాంటి టోర్నీల్లో ఒక్క మ్యాచ్ ఓడినా అది టీమ్‌పైన తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ కెప్టెన్ అజయ్ జడేజా...