MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Sports
  • Cricket
  • నేను కూడా విరాట్ కోహ్లీ లాంటి ఇన్నింగ్స్ ఆడగలను... టీ20 వరల్డ్ కప్‌లో చోటుపై స్టీవ్ స్మిత్ కామెంట్...

నేను కూడా విరాట్ కోహ్లీ లాంటి ఇన్నింగ్స్ ఆడగలను... టీ20 వరల్డ్ కప్‌లో చోటుపై స్టీవ్ స్మిత్ కామెంట్...

2016 టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాకి కెప్టెన్‌గా వ్యవహరించాడు స్టీవ్ స్మిత్. గత ఏడాది యూఏఈలో జరిగిన పొట్టి ప్రపంచకప్‌లోనూ పాల్గొన్న స్టీవ్ స్మిత్‌కి ఈసారి ఆసీస్ తుది జట్టులో చోటు దక్కడం కూడా కష్టమైపోయింది. కీలక ప్లేయర్లు గాయపడడంతో ఆఫ్ఘాన్‌తో జరిగే మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Nov 02 2022, 11:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సింగపూర్ సెన్సేషన్ టిమ్ డేవిడ్‌ ఎంట్రీతో స్టీవ్ స్మిత్, తుది జట్టులో చోటు కోసం ఆశగా ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. మొదటి మూడు మ్యాచుల్లో రిజర్వు బెంచ్‌కే పరిమితమైన స్టీవ్ స్మిత్... ఆస్ట్రేలియా వికెట్ కీపర్ మాథ్యూ వేడ్‌తో పాటు ఆరోన్ ఫించ్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్ గాయపడడంతో ఆఫ్ఘాన్‌తో మ్యాచ్ ఆడడం ఖాయమైపోయింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్, రెండు క్యాచులు అందుకుని ఆస్ట్రేలియా విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. అవకాశం వస్తే తాను విరాట్ కోహ్లీలాంటి ఇన్నింగ్స్‌లు ఆడతానని అంటున్నాడు...

36

‘విరాట్ కోహ్లీ మెల్‌బోర్న్‌లో ఆడిన ఇన్నింగ్స్ చాలా స్పెషల్. మిగిలిన ప్లేయర్లు అందరూ దాదాపు చేతులు ఎత్తేసినప్పుడు విరాట్ కోహ్లీ వీరోచితంగా పోరాడాడు. నేను కూడా ఇలాంటి ఇన్నింగ్స్‌లు ఆడగలను...

46


నేను ఇప్పుడు టెస్టు క్రికెట్, వన్డే క్రికెట్‌పైనే ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల టీ20ల్లో చోటు దక్కించుకోలేకపోతున్నా. అయితే ఫార్మాట్ ఏదైనా దానికి తగ్గట్టుగా ఆడినప్పుడే గొప్ప బ్యాటర్ కాగలరు. ఈ టోర్నమెంట్ సాగుతున్న విధానం, ఈ వికెట్స్ బ్యాటర్లకు సహకరిస్తున్న విధానంపై నాకు పూర్తి క్లారిటీ ఉంది...

56

ఆస్ట్రేలియా గ్రౌండ్స్, మిగిలిన దేశాల గ్రౌండ్స్ కంటే పెద్దగా ఉంటాయి. హిట్టర్లు కూడా ఇక్కడ బౌండరీలు కొట్టేందుకు బాగా కష్టపడాల్సిందే. అదే ఇక్కడి గ్రౌండ్స్ గురించి ఐడియా ఉన్నవారికి, ఎలా బౌండరీలు సాధించాలో ఐడియా ఉంటుంది. అది నాకు బాగా తెలుసు...

66

ఎలాగోలా తుదిజట్టులోకి రావడం కోసమే ఎదురుచూస్తున్నా. అవసరమైతే హిట్టర్‌గా మారి మ్యాచ్ ఫినిష్ చేసేందుకు కూడా నేను సిద్ధం. నాకున్న అపార అనుభవాన్ని మ్యాచులు గెలిపించేందుకు ఉపయోగిస్తా. టెస్టులకు వైస్ కెప్టెన్‌గా ఉన్నా, ఆస్ట్రేలియాకి కెప్టెన్‌గానూ చేశా. ఆ అనుభవం, టీ20ల్లో ఆడడానికి సరిపోతుందని అనుకుంటున్నా...’ అంటూ చెప్పుకొచ్చాడు స్టీవ్ స్మిత్.. 

About the Author

CR
Chinthakindhi Ramu
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Recommended image2
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ వరల్డ్ రికార్డు.. శ్రీలంకపై సెంచరీతో ద్రవిడ్ 27 ఏళ్ల ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు
Recommended image3
భారత్ శ్రీలంక టెస్టులో ప్లేయర్స్ మధ్య వాగ్వాదం.. అసలేం జరిగింది? తొలిరోజు ఆధిప‌త్యం ఎవ‌రిదంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved