MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Sports
  • Cricket
  • 12 ఏళ్ల చెత్త రికార్డు బీట్ చేసిన రోహిత్- రాహుల్... తరాలు మారినా మారని ఓపెనర్ల బ్యాటింగ్...

12 ఏళ్ల చెత్త రికార్డు బీట్ చేసిన రోహిత్- రాహుల్... తరాలు మారినా మారని ఓపెనర్ల బ్యాటింగ్...

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా సెమీ ఫైనల్‌ నుంచే ఇంటి దారి పట్టింది. భారత జట్టు సెమీస్ దాకా చేరిందంటే కూడా మిడిల్ ఆర్డర్‌లో సూర్యకుమార్ యాదవ్, టాపార్డర్‌లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ వల్లే. ఓపెనర్లు కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ... టోర్నీలో ఆరు మ్యాచుల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు.. 

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Nov 13 2022, 03:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Rohit Rahul

Rohit-Rahul

ఇంగ్లాండ్ ఓపెనర్లు పవర్ ప్లే ముగిసే సమయానికి సమయానికి 63 పరుగులు చేశారు. అంటే సాధించాల్సిన లక్ష్యంలో 33 శాతం పవర్ ప్లేలో వచ్చేసింది. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఒక్క మ్యాచ్‌లో కూడా భారత ఓపెనర్లు 50+ భాగస్వామ్యం కూడా జోడించలేకపోయారు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
KL Rahul

KL Rahul

కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ కలిసి టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో జోడించిన అత్యధిక భాగస్వామ్యం 27 పరుగులు మాత్రమే. ఆఖరికి జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో కూడా కెఎల్ రాహుల్, మొదటి ఓవర్‌లో పరుగులేమీ రాబట్టలేక మెయిడిన్ ఓవర్ ఇచ్చాడు. జింబాబ్వేపై మొదటి 10 బంతుల్లో కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ కలిసి చేసింది 2 పరుగులే...

37
Image credit: PTI

Image credit: PTI

2014 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియా ఫైనల్ చేరింది. అయితే విరాట్ కోహ్లీ ఒంటరిపోరాటం వల్లే ఆ టోర్నీలోనూ భారత జట్టు గెలుస్తూ వచ్చింది. 8 ఏళ్ల క్రితం జరిగిన ఆ టోర్నీలో శిఖర్ ధావన్- రోహిత్ శర్మ కలిసి ఓపెనింగ్ చేశారు. ఈ ఇద్దరూ కలిసి 5.82 రన్‌రేట్‌తో పరుగులు చేశారు...

47
Image credit: Getty

Image credit: Getty

అంతకుముందు 2010 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో గౌతమ్ గంభీర్- మురళీ విజయ్ కలిసి ఓపెనింగ్ చేశారు. రోహిత్ శర్మ మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి వచ్చింది. ఈ టోర్నీలో భారత ఓపెనింగ్ జోడి రన్‌రేట్ 5.34 మాత్రమే. ఇప్పటిదాకా టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో ఇదే అత్యల్ప ఓపెనింగ్ బ్యాగస్వామ్యం రన్‌రేట్‌గా ఉండేది..
 

57
Image credit: PTI

Image credit: PTI

అయితే కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత అగ్రెసివ్ యాటిట్యూడ్‌తో కొడతాం... అని చెప్పిన రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ కలిసి టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో అంతకంటే దారుణంగా ఆడారు. రోహిత్- రాహుల్ ఓపెనింగ్ జోడి రన్‌రేట్ కేవలం 4.98 మాత్రమే...

67
KL Rahul

KL Rahul

ఐపీఎల్, బీబీఎల్, ది హండ్రెడ్ వంటి టోర్నీల రాకతో పవర్ ప్లేలో ఓపెనర్ల బ్యాటింగ్ పూర్తిగా మారిపోయింది. మొదటి బంతి నుంచే సిక్సర్లు, ఫోర్లు బాదుతూ బౌలర్లపై ప్రెషర్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు బ్యాటర్లు. కానీ రోహిత్, రాహుల్ మాత్రం అగ్రెసివ్ యాటిట్యూడ్ అని చెప్పి... పాత కాలం టెస్టు బ్యాటింగ్‌ని తలపించారు.. 

77
rohit rahul

rohit rahul

జింబాబ్వే, సౌతాఫ్రికాలతో జరిగిన మ్యాచుల్లో తొలి ఓవర్‌ మెయిడిన్ ఇచ్చిన కెఎల్ రాహుల్, భయపడుతూ బ్యాటింగ్ చేస్తున్నట్టు కనిపించాడు కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్రమైన ప్రెషర్‌తో బ్యాటింగ్ చేశాడు. ఫలితం టీమిండియా నాకౌట్‌ నుంచే వాకౌట్ చేసింది...

About the Author

CR
Chinthakindhi Ramu
రోహిత్ శర్మ

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Recommended image2
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Recommended image3
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved