బాబర్ ఆజమ్ రికార్డు బ్రేక్ చేసిన రోహిత్ శర్మ.. ఒకే ఏడాదిలో అత్యధిక టీ20 విజయాలతో...
టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ద్వైపాక్షిక సిరీసుల్లో పరాజయమే లేకుండా దూసుకుపోయాడు రోహిత్ శర్మ. ఆసియా కప్ 2022 టోర్నీలో సూపర్ 4 రౌండ్‌లో ఊహించని షాక్ తగిలినా, దాన్నుంచి త్వరగానే కోలుకున్న భారత జట్టు... టీ20 వరల్డ్ కప్ 2022లో టేబుల్ టాపర్‌గా నిలిచి సెమీ ఫైనల్ చేరింది...
పాకిస్తాన్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, జింబాబ్వేతో జరిగిన మ్యాచుల్లో విజయాలు అందుకున్న టీమిండియా, సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం పరాజయం పాలైంది. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 71 పరుగుల భారీ తేడాతో ఘన విజయం అందుకున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు...
Image credit: Getty
ఒకే ఏడాది అత్యధిక టీ20 విజయాలు అందుకున్న సారథిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు రోహిత్ శర్మ. 2022లో రోహిత్ శర్మకు ఇది 21వ విజయం కాగా బాబర్ ఆజమ్, 2021లో 20 విజయాలు అందుకున్నాడు. 2018లో పాక్ మాజీ కెప్టెన్ 17 టీ20 విజయాలు అందుకోగా, 2016లో ఎంఎస్ ధోనీ 15 విజయాలు అందుకున్నాడు..
Image credit: Getty
ఈ ఏడాది 50+ పరుగుల తేడాతో విజయం అందుకోవడం టీమిండియాకి ఇది 10వ సారి. ఇదే ఏడాది 6 సార్లు 50+ పరుగుల తేడాతో విజయం అందుకున్న న్యూజిలాండ్ రెండో పొజిషన్‌లో ఉంటే, 2018లో పాకిస్తాన్ 5 సార్లు ఈ ఫీట్ సాధించింది..
surya kumar
ఓవరాల్‌గా రోహిత్ శర్మకు ఆటగాడిగా ఇది 100వ టీ20 విజయం. ఇంతకుముందు పాక్ సీనియర్ క్రికెటర్ 87 టీ20 విజయాల్లో భాగం పంచుకోగా భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 75 విజయాల్లో భాగస్వామిగా ఉన్నాడు.
Image credit: Getty
సూర్యకుమార్ యాదవ్, జింబాబ్వేతో జరిగిన టీ20 మ్యాచ్‌లో గెలిచిన ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అతనికి ఈ ఏడాదిలో ఆరోది. 2016లో విరాట్ కోహ్లీ 6 సార్లు టీ20ల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలవగా సూర్యకుమార్ యాదవ్ దాన్ని సమం చేశాడు...