టీమిండియానే నమ్ముకున్న పాకిస్తాన్... సౌతాఫ్రికాతో మ్యాచ్ ఎలాగైనా గెలవాలంటూ...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో తొలి రెండు మ్యాచులు గెలిచి 4 పాయింట్లతో ఉన్న ఏకైక జట్టు టీమిండియానే. గ్రూప్ 1లో మూడు మ్యాచులు వర్షం కారణంగా రద్దు కాగా, గ్రూప్ 2లో ఒకే మ్యాచ్‌కీ వరుణుడు ఆటంకం కలిగించడం విశేషం. దీంతో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన పాక్ భవితవ్యం, టాప్‌లో ఉన్న టీమిండియా ప్రదర్శన పైనే ఆధారపడి ఉంది...
india
టీమిండియాతో మ్యాచ్‌లో, జింబాబ్వేతో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ ఆఖరి బంతికి ఓడిన పాకిస్తాన్... మిగిలిన మ్యాచుల్లో నెదర్లాండ్స్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌లతో మ్యాచులు ఆడనుంది. ఈ మూడు మ్యాచుల్లో గెలిచినా పాక్‌కి సెమీస్ చేరే అవకాశాలు తక్కువే...
Image credit: PTI
జింబాబ్వే- సౌతాఫ్రికా మధ్య జరిగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. బంగ్లాదేశ్‌పై 104 పరుగుల భారీ తేడాతో విజయం అందుకున్న సౌతాఫ్రికా.. . 3 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. సౌతాఫ్రికా సెమీస్ చేరాలంటే మిగిలిన అన్ని మ్యాచుల్లో తప్పక గెలవాల్సి ఉంటుంది...
India vs Netherlands
పాకిస్తాన్ సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఇండియా- సౌతాఫ్రికా మ్యాచ్ రిజల్ట్ కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం అందుకుంటే... సౌతాఫ్రికా- పాకిస్తాన్ మ్యాచ్ వరకూ దాయాది సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఆ మ్యాచ్‌లో సఫారీ జట్టుపై విజయం అందుకుంటే పాక్ ఇంకా సెమీస్ రేసులో ఉంటుంది...
ఒకవేళ సౌతాఫ్రికా, టీమిండియా చేతుల్లో ఓడినా పాకిస్తాన్‌పై గెలిస్తే... జింబాబ్వేపై వచ్చిన పాయింట్ అదనంగా ఉండడంతో సెమీ ఫైనల్‌కి వెళ్లగలుగుతుంది. నెదర్లాండ్స్‌పై పాకిస్తాన్ భారీ తేడాతో గెలిచి, సౌతాఫ్రికాని చిత్తు చేసి సెమీస్ చేరాలని చాలా ఆశలే పెట్టుకుంది పాక్...
India vs Pakistan
సౌతాఫ్రికాతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో లక్కీగా ఓ పాయింట్ తెచ్చుకున్న జింబాబ్వే, పాక్‌పై గెలిచి 3 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. దీంతో నెదర్లాండ్స్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌లతో మ్యాచుల్లో ఏ రెండు మ్యాచులు గెలిచినా జింబాబ్వేకి సెమీస్ అవకాశాలు పుష్కలంగా ఉంటాయి..