MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఆ లెక్కన పాకిస్తాన్‌ ఫైనల్ చేరడం ఖాయమైనా... న్యూజిలాండ్‌పై పాక్‌కి తిరుగులేని రికార్డు...

ఆ లెక్కన పాకిస్తాన్‌ ఫైనల్ చేరడం ఖాయమైనా... న్యూజిలాండ్‌పై పాక్‌కి తిరుగులేని రికార్డు...

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో గ్రూప్ మ్యాచులు, క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత మజాని అందించాయి. ఆఖరి రోజు వరకూ సెమీ ఫైనల్ బెర్తులపై సస్పెన్స్ కొనసాగింది. గ్రూప్ 1 టేబుల్ టాపర్ న్యూజిలాండ్, పాకిస్తాన్‌తో మొదటి సెమీ ఫైనల్ ఆడబోతుంటే... గ్రూప్ 2 టేబుల్ టాపర్ టీమిండియా, ఇంగ్లాండ్‌తో రెండో సెమీ ఫైనల్ ఆడనుంది...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Nov 07 2022, 10:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
PAK vs NZ

PAK vs NZ

ఐసీసీ టోర్నీల్లో టీమిండియా, పాకిస్తాన్ జట్లు సెమీ ఫైనల్ చేరడం ఇది 16వ సారి కాగా న్యూజిలాండ్ 15వ సారి, ఇంగ్లాండ్‌కి 14వ సారి. ఆస్ట్రేలియా 16 సార్లు సెమీస్ చేరి.. భారత్, పాకిస్తాన్‌లతో కలిసి టాప్‌లో ఉంది...

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28

2003 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఐసీసీ టోర్నీల్లో టీమిండియా, న్యూజిలాండ్‌ని ఓడించలేకపోయింది. 2019 వన్డే వరల్డ్ కప్‌లో టేబుల్ టాపర్‌గా సెమీస్ చేరిన భారత జట్టు, న్యూజిలాండ్ చేతుల్లో ఓడింది. ఐసీసీ 2021 టీ20 వరల్డ్ కప్‌లో, ఆఖరి ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లోనూ కివీస్ చేతుల్లో భారత జట్టుకి పరాజయమే ఎదురైంది...

38

అయితే మరోవైపు పాకిస్తాన్ మాత్రం ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్‌కి చుక్కలు చూపిస్తోంది.. 1983 వన్డే వరల్డ్ కప్‌లో, 1992, 1996, 2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లోనూ న్యూజిలాండ్ జట్టును చిత్తుగా ఓడించింది పాకిస్తాన్... 

48

టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లోనూ న్యూజిలాండ్‌పై పాకిస్తాన్‌కి తిరుగులేని రికార్డు ఉంది.టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు ఆరుసార్లు తలబడ్డాయి. ఇందులో నాలుగు సార్లు పాక్ గెలిస్తే, రెండు సార్లు న్యూజిలాండ్ గెలిచింది...

58

2007 టీ20 వరల్డ్ కప్‌లో సెమీ ఫైనల్‌లో పాకిస్తాన్ చేతుల్లో ఓడింది కివీస్. 2009 టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 99 పరుగులకే ఆలౌట్ అయ్యింది న్యూజిలాండ్. ఈ లక్ష్యాన్ని పాక్ 13.1 ఓవర్లలో ఛేదించింది...

68

2010 టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్, పాకిస్తాన్‌పై 1 పరుగు తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది. 134 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన పాక్, 132 పరుగులకు పరిమితమై 1 పరుగు తేడాతో ఓడింది. 2012 టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌పై 13 పరుగుల తేడాతో విజయం అందుకుంది పాకిస్తాన్...

78

2016 టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్, పాకిస్తాన్‌పై 22 పరుగుల తేడాతో  గెలిచింది. 2021 టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి టేబుల్ టాపర్‌గా సెమీస్‌కి అర్హత సాధించింది పాకిస్తాన్... 

88
NZ vs PAK

NZ vs PAK

న్యూజిలాండ్ ప్రస్తుతమున్న ఫామ్ చూస్తే ఆ జట్టును ఓడించడం కొంచెం కష్టమే. అయితే తొలి రెండు మ్యాచుల్లో ఘోర పరాజయాల తర్వాత అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చిన పాకిస్తాన్ ఎప్పుడూ ఎలా ఆడుతుందో చెప్పలేం... కివీస్‌కి కళ్లెం వేయగల సత్తా పాక్‌కి పుష్కలంగా ఉంది. పాక్‌ని చిత్తు చేసి వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్‌ చేరగల సామర్థ్యం కివీస్‌లో ఉంది. మరి ఈ ఇరు జట్లలో ఫైనల్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకునేదెవరో బుధవారం తేలిపోనుంది. 

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs PAK: భారత్ vs పాకిస్థాన్ వరల్డ్ కప్ సమరానికి డేట్ ఫిక్స్.. దాయాదుల ఫైట్ మామూలుగా ఉండదు!
Recommended image2
IPL 2026 : వేపింగ్.. హనీ ట్రాప్ లో ఐపీఎల్ స్టార్స్? బీసీసీఐ 8 పేజీల లెటర్ లో ఏముందంటే?
Recommended image3
IPL 2026: టాప్ గేర్‌లో సన్‌రైజర్స్.. ఐపీఎల్ టేబుల్ టాప్‌లోకి హైదరాబాద్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved