ఆ ముగ్గురి బ్యాటులను మార్చిన ఎంఎస్ ధోనీ... వరల్డ్ కప్ మెంటర్‌గా మాహీ చేసిన పనికి...
క్రికెటర్లకు అభిమానులు ఉంటే, మహేంద్ర సింగ్ ధోనీకి వీరాభిమానులు, భక్తులు ఉంటారు. భారత క్రికెట్‌పై ధోనీ వేసిన ముద్ర అలాంటిది మరి. ప్రస్తుత భారత క్రికెట్ టీమ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా అండ్ కో.. దాదాపు అందరూ మాహీ ఫ్యాన్సే. భారత బ్యాటింగ్‌లో మాహీ చేసిన మార్పు, ఇప్పుడు బయటికి వచ్చింది...
2007 నుంచి 2016 వరకూ జరిగిన టీ20 వరల్డ్ కప్స్ అన్నింటిలో టీమిండియాకి కెప్టెన్‌గా వ్యవహరించాడు మహేంద్ర సింగ్ ధోనీ. 2007లో టైటిల్ గెలిచిన టీమిండియా, 2014లో ఫైనల్ చేరినా రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 2016లో సెమీస్ నుంచి ఇంటిదారి పట్టింది..
Dhoni
మాహీ లేకుండా జరిగిన మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ 2021లోదే. దీంతో మాహీ అనుభవం, అతని సేవలు టీమిండియాకి అందించాలనే ఉద్దేశంతో అతన్ని భారత జట్టుకి మెంటర్‌గా నియమించింది బీసీసీఐ. అయితే ఈ ఎత్తుగడ పెద్దగా సక్సెస్ కాలేదు..
dhoni
భారీ అంచనాలతో టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీని ఆరంభించిన టీమిండియా... పాకిస్తాన్, న్యూజిలాండ్ చేతుల్లో చిత్తుగా ఓడి సూపర్ 12 రౌండ్ నుంచే నిష్కమించింది. పూర్తి ఫిట్‌గా లేని హార్ధిక్ పాండ్యాని ఆడించడం... యజ్వేంద్ర చాహాల్‌ని కాదని వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహార్‌లను వరల్డ్ కప్‌కి సెలక్ట్ చేయడం వెనక మాహీ హస్తం ఉందని టాక్ వినబడింది..
దీంతో టీమిండియా ఓటమి తర్వాత అప్పటి భారత సారథి విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు మెంటర్ మాహీని కూడా వదల్లేదు ట్రోలర్స్. ఈ దెబ్బతో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి పూర్తిగా దూరమయ్యాడు మహేంద్ర సింగ్ ధోనీ. వ్యాపార ప్రకటనల్లో తప్ప ఆఖరికి స్టేడియంలో కూడా మాహీ కనిపించడం లేదు...
అయితే మెంటర్‌గా ఉన్న సమయంలో మాహీ చేసిన మార్పులు, టీమిండియాకి ఇప్పుడు బాగా ఉపయోగపడుతున్నాయట. హార్ధిక్ పాండ్యా, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ వాడుతున్న బ్యాటులను సరిగ్గా గమనిస్తే.. కింద కాస్త చెక్కినట్టు కనబడుతుంది...
‘2019 వన్డే వరల్డ్ కప్‌కి ముందు ధోనీ ఇలాంటి బ్యాటులు వాడేవాడు. ఆయన సలహా వల్లే ఇప్పుడు హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్, కెఎల్ రాహుల్ ఇలాంటి బ్యాటులు వాడుతున్నారు. పవర్ హిట్టింగ్‌కి ఈ బ్యాట్స్ బాగా పనికి వస్తాయి...’ అంటూ చెప్పుకొచ్చాడు స్పోర్ట్స్ బ్యాట్స్ తయారీ సంస్థ ఎస్‌జీ (సన్స్‌పరెల్స్ గ్రీన్‌లాండ్స్) మేనేజింగ్ డైరెక్టర్ పరాస్ ఆనంద్...
ఈ బ్యాట్లను ప్రత్యేకంగా టీ20 ఫార్మాట్ కోసమే తయారుచేస్తారు. గ్రౌండ్‌లో ఏ వైపుకి కావాలంటే ఆ వైపుకి షాట్స్ ఆడేందుకు ఈ కర్వ్ బ్యాట్స్ బాగా పనికొస్తాయి. 2021లో ఐపీఎల్‌లో పాండ్యా షాట్ సెలక్షన్ సరిగ్గా లేదని గమనించిన మాహీ, ఈ బ్యాట్స్ వాడమని సూచించాడట.
Image credit: Getty
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇదే రకమైన బ్యాటులను వాడిన హార్ధిక్ పాండ్యా, బ్యాటుతో 480+ పరుగులు చేసి, సెలక్టర్లను ఇంప్రెస్ చేశాడు. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీతో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు హార్ధిక్ పాండ్యా...
KL Rahul
హార్ధిక్ పాండ్యా బాగానే ఆడుతున్నా కెఎల్ రాహుల్, రిషబ్ పంత్‌లు పెద్దగా మెప్పించలేకపోతున్నారు.ఆసియా కప్‌లో ఫెయిల్ అయిన రిషబ్ పంత్, టీ20 వరల్డ్ కప్ 2022లో ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ ఆడలేకపోయాడు. మరోవైపు కెఎల్ రాహుల్, రెండు మ్యాచుల్లోనూ సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరాడు...