జస్ప్రిత్ బుమ్రా లేకపోతేనేం... టీమిండియా బౌలింగ్‌పై భువనేశ్వర్ కుమార్ సంచలన వ్యాఖ్యలు...
టీ20 వరల్డ్ కప్ 2022 ఆరంభానికి ముందు భారత ఫాస్ట్ బౌలింగ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. జస్ప్రిత్ బుమ్రా గాయపడి మెగా టోర్నీకి దూరం కావడం, భువనేశ్వర్ కుమార్ పెద్దగా ఫామ్‌లో లేకపోవడంతో భారత జట్టు సెమీస్ చేరడం కూడా కష్టమే అనుకున్నారంతా. అయితే మొదటి రెండు మ్యాచుల్లో టీమిండియా టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇచ్చింది..
మొదటి రెండు మ్యాచుల్లో భువనేశ్వర్ కుమార్ టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఇప్పటిదాకా 7 ఓవర్లు బౌలింగ్ చేసిన భువీ, 30 డాట్ బాల్స్ వేయడం విశేషం. 4.43 ఎకానమీతో 3 వికెట్లు పడగొట్టాడు భువనేశ్వర్ కుమార్...
Bhuvi
‘ఇన్ని ఏళ్ల కెరీర్‌లో ఆసియా కప్ 2022 వంటి కొన్ని టోర్నీల్లో మాత్రమే నేను సరిగ్గా బౌలింగ్ చేయలేకపోయా. మీడియా, కామెంటేటర్లు, ఫ్యాన్స్ చాలా చెప్పారు. డెత్ బౌలింగ్ సరిగా లేదని కామెంట్లు చేశారు... అయితే నా బలం ఏంటో నాకు బాగా తెలుసు...
Jasprit Bumrah
జస్ప్రిత్ బుమ్రా వంటి బౌలర్ లేకపోవడం భారత జట్టుకి పెద్ద లోటే. అతను ఉండి ఉంటే అదనప బలం చేకూరినట్టు ఉండేది. అయితే బుమ్రా లేకపోయినా మ్యాచులు గెలవగలమని నిరూపించడానికే మేం ఇక్కడికి వచ్చాం...
Bhuvi
మా బలాలేంటో మాకు బాగా తెలుసు. అలాగే మా బలహీనతలు ఏంటో కూడా బాగా తెలుసు. అందుకే గెలవడానికి ఏం చేయాలో, ఎలా చేయాలో ప్రణాళికలు రచిస్తున్నాం...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్...
Image credit: PTI
ఆసియా కప్ 2022 టోర్నీలో అట్టర్ ఫ్లాప్ అయిన భువనేశ్వర్ కుమార్, ఆ తర్వాత జరిగిన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీసుల్లో కూడా పెద్దగా మెప్పించలేకపోయాడు. అలాగే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో మొదటి రెండు మ్యాచుల్లో భువీ టాప్ క్లాస్ బౌలింగ్ పర్ఫామెన్స్ ఇచ్చి మెప్పించాడు..
బుమ్రా, జడేజా దూరం కావడంతో టీమిండియాలో సీనియర్ మోస్ట్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌పైనే ఆశలు పెట్టుకుంది టీమిండియా. అలాగే అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ కూడా మొదటి రెండు మ్యాచుల్లో చక్కని పర్ఫామెన్స్ ఇచ్చారు...