టీమిండియాకి షాక్... ప్రాక్టీస్ సెషన్స్‌లో విరాట్ కోహ్లీకి గాయం! హర్షల్ పటేల్ వేసిన బౌన్సర్‌కి...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఇంగ్లాండ్‌తో సెమీ ఫైనల్ మ్యాచ్‌కి ముందు టీమిండియాని గాయాలు భయపెడుతున్నాయి. ప్రాక్టీస్ సెషన్స్‌లో భారత కీ ప్లేయర్లు గాయపడ్డారని వార్తలు, క్రికెట్ ఫ్యాన్స్‌ని కంగారుపెడుతున్నాయి...
pakistan
సూపర్ 12 రౌండ్‌లో మొదటి రెండు మ్యాచుల్లో చిత్తుగా ఓడినా, నెట్ రన్ రేట్ కారణంగా అన్యూహ్యంగా సెమీ ఫైనల్ చేరిన పాకిస్తాన్, న్యూజిలాండ్‌తో సిడ్నీలో మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడుతోంది... ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఫెవరెట్‌గా బరిలో దిగుతోంది...
Image credit: Getty
నవంబర్ 10న ఆడిలైడ్‌లో టీమిండియా, ఇంగ్లాండ్ జట్టుతో రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో ఇరు జట్ల మధ్య ఇప్పటిదాకా మూడు మ్యాచులు జరగగా రెండింట్లో టీమిండియా గెలిచింది. ఓ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌కి విజయం వరించింది..
2012 టోర్నీలో చివరిసారిగా ఇంగ్లాండ్‌తో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ ఆడిన టీమిండియా, 10 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ జట్టుతో ఆడనుంది. అయితే ఈ కీలక మ్యాచ్‌కి ముందు ప్రాక్టీస్ సెషన్స్‌లో భారత ప్లేయర్లు గాయపడుతున్నారనే వార్తలు... అభిమానులను కలవరబెడుతున్నాయి...
ఇప్పటికే ఆడిలైడ్ చేరుకున్న భారత జట్టు, మంగళవారం ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంది. ఈ సమయంలో రోహిత్ శర్మ గాయపడ్డాడనే వార్త, సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అయితే రోహిత్‌కి అయిన గాయం పెద్దదేమీ కాదని, అతను సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడతాడని భారత జట్టు స్పష్టం చేసింది...
Image credit: PTI
తాజాగా బుధవారం ప్రాక్టీస్ సెషన్స్‌లో విరాట్ కోహ్లీ గాయపడ్డాడనే వార్త అభిమానులను కంగారు పెడుతోంది. బుధవారం నెట్స్‌లో హర్షల్ పటేల్ బౌలింగ్‌లో ప్రాక్టీస్ చేశాడు విరాట్. ఈ సమయంలో ఓ బౌన్సర్, విరాట్ కోహ్లీ గజ్జల్లో బలంగా తాకిందని సమాచారం. నొప్పితో కాసేపు విలవిలలాడిన కోహ్లీ, ప్రాక్టీస్ సెషన్స్ నుంచి బయటికి వెళ్లాడనే వార్త అభిమానులను షాక్‌కి గురి చేసింది..
ఇప్పటిదాకా జరిగిన మ్యాచుల్లో మూడు హాఫ్ సెంచరీలతో 246 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్న విరాట్ కోహ్లీ, సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆడడం టీమిండియాకి చాలా అవసరం. విరాట్ దూరమైతే టీమిండియా బ్యాటింగ్ వీక్ అయిపోతుంది...
అయితే విరాట్ కోహ్లీకి గాయమైన విషయం నిజమే అయినా కాసేపటి తర్వాత అతను గ్రౌండ్‌లోకి తిరిగొచ్చాడు. అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ, సెల్ఫీలు దిగాడు. దీంతో అతని గాయం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలుస్తోంది..