MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Sports
  • Cricket
  • ఐపీఎల్‌ వేస్ట్ అని ఎవరన్నారు! దాని వల్లే నేను ఇక్కడున్నా... మార్కస్ స్టోయినిస్ కామెంట్స్...

ఐపీఎల్‌ వేస్ట్ అని ఎవరన్నారు! దాని వల్లే నేను ఇక్కడున్నా... మార్కస్ స్టోయినిస్ కామెంట్స్...

టీమిండియా మాత్రమే కాదు, ఇంగ్లాండ్ ప్లేయర్లు ఫెయిల్ అయినా కూడా ఐపీఎల్‌ మీదే విమర్శలు వస్తాయి. ఆసియా కప్‌లో భారత జట్టు ఫెయిల్యూర్‌ తర్వాత ఐపీఎల్‌ని బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్ వినిపించింది. మాజీ క్రికెటర్లు కూడా ఐపీఎల్‌ తెచ్చి, భారత జట్టును నాశనం చేశారని అక్కసు వెళ్లగక్కారు...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Oct 26 2022, 12:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఇంగ్లాండ్ నుంచి ఐపీఎల్ ఆడే క్రికెటర్లు తక్కువైనా, వారి ఫెయిల్యూర్‌ని ఎవ్వరిపైన తోయాలో తెలియక ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ని సాకుగా చెప్పుకొచ్చారు. అయితే ఐపీఎల్‌ వల్లే తాను స్టార్ క్రికెటర్‌గా మారానని అంటున్నాడు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్...
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Marcus Stoinis

Marcus Stoinis

తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతుల్లో 89 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన ఆతిథ్య ఆస్ట్రేలియా, రెండో మ్యాచ్‌లో శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేయగా ఆ లక్ష్యాన్ని 16.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది ఆసీస్...

38

డేవిడ్ వార్నర్ 11, మిచెల్ మార్ష్ 17, గ్లెన్ మ్యాక్స్‌లో 23 పరుగులు చేసి అవుట్ కావడం... ఆరోన్ ఫించ్ 42 బంతుల్లో 31 పరుగులు చేయడంతో ఆస్ట్రేలియాకి మరో షాక్ తప్పదేమో అనుకున్నారందరూ. అయితే ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన మార్కస్ స్టోయినిస్ 18 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 59 పరుగులు చేసి సునామీ ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ని ముగించాడు...

48
Image Credit: Getty Images

Image Credit: Getty Images

13వ ఓవర్‌లో మ్యాక్స్‌వెల్ అవుటైన తర్వాత ఇంకా విజయానికి 69 పరుగులు కావాల్సిన దశలో క్రీజులోకి వచ్చిన స్టోయినిస్, 17వ ఓవర్‌లో మ్యాచ్‌ని ముగించేశాడు. 

58

గత ఏడాది టీ20 వరల్డ్ కప్‌లోనూ ఆస్ట్రేలియాకి మ్యాచ విన్నర్‌గా మారిన స్టోయినిస్, తన సక్సెస్ క్రెడిట్ ఐపీఎల్‌కి ఇచ్చేశాడు. ‘ఐపీఎల్ వల్ల నా క్రికెట్ పూర్తిగా మారిపోయింది. ఆటలో ఎలా భాగం కావాలి, గేమ్‌ని ఎలా రీడ్ చేయాలనే విషయాలను ఐపీఎల్‌లో బాగా అర్థం చేసుకున్నా...

68

ఐపీఎల్‌ వల్ల అత్యంత కష్టమైన పిచ్‌ల మీద ఎలా ఆడాలో తెలియడమే కాదు, అత్యుత్తమ కోచ్‌లు, వరల్డ్ బెస్ట్ ప్లేయర్లతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోవడం, వారి దగ్గరి నుంచి విలువైన విషయాలు నేర్చుకునే అవకాశం దక్కింది...

78

నేను కొన్నేళ్లుగానే ఐపీఎల్ ఆడుతున్నా, చాలా తక్కువ టీమ్స్ తరుపునే ఆడా. అయితే డ్రెస్సింగ్ రూమ్‌లో వరల్డ్ బెస్ట్ ప్లేయర్లు ఉన్నప్పుడు వారి దగ్గరి నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. స్పిన్ బౌలింగ్‌లో ఎలా ఆడాలో అక్కడే నేర్చుకున్నా... అదే నా ఆటను ఇలా మార్చేసింది...’ అంటూ కామెంట్ చేశాడు మార్కస్ స్టోయినిస్...

88
Marcus Stoinis

Marcus Stoinis

17 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మార్కస్ స్టోయినిస్, టీ20 వరల్డ్ కప్‌ చరిత్రలో రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. యువరాజ్ సింగ్ 2007 వరల్డ్ కప్‌లో 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా, 17 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న స్టోయినిస్, నెదర్లాండ్ క్రికెటర్ స్టీఫెన్ మైబర్గ్‌ రికార్డును సమం చేశాడు..

About the Author

CR
Chinthakindhi Ramu
 

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs AFG: వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్.. సంజూ వచ్చేశాడు.. భారత తుది జట్టు ఇదే
Recommended image2
Asia Cup 2026 Final: దుబాయ్ లో బిగ్ ఫైట్.. 8వ సారి ఆసియా కప్‌పై కన్నేసిన భారత్
Recommended image3
Asia Cup 2026 Final: ఆసియా కప్‌లో భారత్‌ను ఆపడం ఎవరి వల్ల కాదు.. మళ్లీ ఫైనల్‌కు టీమిండియా గ్రాండ్ ఎంట్రీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved