MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Sports
  • Cricket
  • ఎన్టీఆర్‌తో సూర్యకుమార్ యాదవ్... ఆనందంతో పండగ చేసుకున్న మ్యూచువల్ ఫ్యాన్స్...

ఎన్టీఆర్‌తో సూర్యకుమార్ యాదవ్... ఆనందంతో పండగ చేసుకున్న మ్యూచువల్ ఫ్యాన్స్...

సగటు భారతీయుడికి ఉండే రెండు కాలక్షేపాలు ఒకటి సినిమా, మరొకటి క్రికెట్.. టీమిండియా ఆడే మ్యాచ్‌‌లకు, ఐపీఎల్ మ్యాచ్‌లకు ఎగబడే జనాలు, సినిమా థియేటర్ల దగ్గర కిలోమీటర్ల మేర క్యూ కట్టడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఈ రెండు కలిస్తే అభిమానులకు పండగే.. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలాంటి పండగే చేసుకుంటున్నారు.. 

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jan 17 2023, 01:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

శ్రీలంకతో వన్డే సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు, న్యూజిలాండ్‌తో వన్డే మ్యాచ్ కోసం ప్రస్తుతం హైదరాబాద్‌లో వాలింది. హైదరాబాద్‌కి రాగానే టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్‌ని కలిశారు భారత క్రికెటర్లు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

‘RRR’ సినిమాలో ‘కొమురం భీం’గా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఎన్టీఆర్‌తో కలిసి ఫోటోలు దిగారు క్రికెటర్లు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, యజ్వేంద్ర చాహాల్, శుబ్‌మన్ గిల్, తదితరులు...

310

ఇందులో ఎన్టీఆర్‌తో కలిసి సెపరేట్‌గా ఫోటో దిగారు సూర్యకుమార్ యాదవ్ దంపతులు. దేవిశా, ఎన్టీఆర్‌లపై ఫోటోలు వేసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన సూర్యకుమార్ యాదవ్, ‘బ్రదర్, నిన్ను కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆర్ఆర్ఆర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలిచినందుకు మరోసారి కంగ్రాట్స్’ అంటూ పోస్ట్ చేశాడు...

410

దీనికి ఎన్టీఆర్ కామెంట్ ద్వారా స్పందించాడు. ‘సూర్య, థ్యాంక్యూ సో మచ్. నిన్ను కలవడం నాకూ ఆనందంగా ఉంది. రేపటి మ్యాచ్‌లో దుమ్మురేపు...’ అంటూ కామెంట్ చేశాడు ఎన్టీఆర్.. 

510
Jr ntr

Jr ntr

పూరీ జగన్నాథ్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘టెంపర్’ సినిమా నుంచి చాలా సెలక్టివ్‌గా సినిమాలను ఎంచుకుంటూ వస్తున్నాడు ఎన్టీఆర్ జూనియర్. టీనేజ్ వయసులో ఆకాశమంత క్రేజ్‌ని, సూపర్ స్టార్ స్టేటస్‌ని సంపాదించిన తారక్, వరుస  వైఫల్యాలతో స్టార్ రేసులో కాస్త వెనకబడ్డాడు...

610
Image: Getty Images

Image: Getty Images

అయితే ‘టెంపర్’ తర్వాత చిన్న ఎన్టీవోడు చేసిన ప్రతీ సినిమా అటు అభిమానులను మాత్రమే కాకుండా సినీ ఫ్యాన్స్ అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో ‘నాన్నకు ప్రేమతో’, కొరిటాల శివ దర్శకత్వంలో ‘జనతా గ్యారేజ్’, బాబీ దర్శకత్వంలో ‘జై లవకుశ’, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాల్లో నటించి మెప్పించాడు ఎన్టీఆర్...
 

710

ప్రతీ సినిమా కథలోనూ వైవిధ్యం చూపించి, నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను ఏరికోరి ఎంచుకున్న ఎన్టీఆర్, రాజమౌళి దర్శకత్వంలో నాలుగోసారి చేసిన సినిమా ‘RRR’. గత ఏడాది ఐపీఎల్ సమయంలో విడుదలైన ఈ సినిమా అఖండ విజయం అందుకుంది...

810

‘ఆర్ఆర్ఆర్’ మూవీలో కొమరం భీంగా ఎన్టీఆర్ నటనకు అభిమానులు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా ‘కొమురం భీముడో’ పాటలో తారక రాముడు చూపించిన ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్‌కి హిందీతో పాటు హాలీవుడ్ ప్రముఖులు కూడా ఫిదా అయిపోయారు...

910

గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ సమయంలో ఎన్టీఆర్‌ని మార్వెల్ స్టూడియో పిలుస్తున్నట్టుగా కథనాలు కూడా వచ్చాయి. హాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ మార్వెల్ స్టూడియో, ఎన్టీఆర్‌ని ఓ క్యారెక్టర్‌ కోసం ఎంచుకున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి.. 

1010

ప్రస్తుతం కొరిటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న ఎన్టీఆర్, ఆ తర్వాత ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో సినిమా చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలు దేశవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కాబోతున్నాయి. 

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Recommended image2
IND vs SL: 5వ రోజు క్లైమాక్స్ మామూలుగా ఉండదు.. శ్రీలంక 16 రన్స్ లీడ్, భారత్‌కు 4 వికెట్లే బాకీ
Recommended image3
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved