కోహ్లీకి ఛాన్సే లేదు! అతనే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్... గౌతమ్ గంభీర్ కామెంట్...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా బ్యాటింగ్ భారాన్ని మోస్తున్నారు విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్. ఇప్పటిదాకా జరిగిన ఐదు మ్యాచుల్లో మూడేసి హాఫ్ సెంచరీలు చేసిన విరాట్, సూర్యకుమార్ యాదవ్... చెరో రెండు సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు గెలిచారు...
Virat Kohli-Suryakumar Yadav
టీ20 వరల్డ్ కప్‌లో ఇప్పటిదాకా 5 మ్యాచులు ఆడిన సూర్యకుమార్ యాదవ్, 193.97 స్ట్రైయిక్ రేటుతో 225 పరుగులు చేశాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉన్న సూర్యకుమార్, ఇప్పటిదాకా 37 అంతర్జాతీయ టీ20 మ్యాచులు మాత్రమే ఆడాడు...
‘టీమిండియాలో విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ వంటి ప్లేయర్లు ఉండొచ్చు. కానీ వాళ్లంతా చాలా సంప్రదాయ ప్లేయర్లు. సూర్యకుమార్ యాదవ్ వేరు. అతని ఆట వేరు. ప్రతీ బంతిని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ ఆడతాడు...
Image credit: PTI
సూర్యకుమార్ యాదవ్ ప్లేయర్లు చాలా అరుదు. ఇప్పటిదాకా భారత జట్టుకి అలాంటి ప్లేయర్ దొరకలేదు. నెం.4లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. నిలకడగా పరుగులు చేసేవాళ్లు చాలామంది ఉంటారు. అయితే 180+ స్ట్రైయిక్ రేటుతో 200లకు పైగా పరుగులు... అందులో మూడు హాఫ్ సెంచరీలు...
ఇండియా టీ20 వరల్డ్ కప్ గెలిచినా, గెలవకపోయినా నా వరకూ సూర్యకుమార్ యాదవ్, ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’.. అతను ఇప్పటికే తన మార్కు వేసేశాడు.
Image credit: Getty
నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసేటప్పుడు పవర్ ప్లేలో ఆడే అవకాశం ఉండదు. అయినా 180-200 స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేయడమంటే మామూలు విషయం కాదు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్..
Image credit: Getty
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఐదు మ్యాచుల్లో 123 సగటుతో 246 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా టాప్‌లో నిలిచాడు. 225 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, టాప్ 3లో ఉన్నాడు. సూర్య స్ట్రైయిక్ రేటు 193.97గా ఉంటే విరాట్ కోహ్లీ స్ట్రైయిక్ రేటు 130కి పైన ఉంది..