సూర్యకుమార్ యాదవ్ చాలా గ్రేట్, మనవాళ్లలా కాదు... పాక్ క్రికెటర్లపై కనేరియా కామెంట్!

First Published Dec 8, 2020, 11:43 AM IST

అమెరికాలో 2022లో ప్రారంభం కాబోయే మేజర్ లీగ్ టీ20 క్రికెట్ ప్రపంచక్రికెట్‌పై ప్రభావం చూపిస్తోంది. అమెరికాకి ఆడేందుకు న్యూజిలాండ్ క్రికెటర్ కోరీ అండర్సన్, ఆ దేశానికి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అతనితో పాటు చాలామంది క్రికెటర్లు అమెరికా బాట పడుతున్నారు. పాక్ ఓపెనర్ సమీ అస్లామ్ ఇలాగే అమెరికాకు పయనమయ్యాడు. దీనిపై ఆవేదన వ్యక్తం చేస్తూ, పాక్ క్రికెట్ బోర్డు తీవ్ర ఆగ్రహం తెలిపాడు ఆ దేశ మాజీ క్రికెటర్ డానిషే కనేరియా.

భారత జట్టులో చోటు దక్కకపోయినా చాలా ఏళ్లుగా ఓపికగా ఎదురుచూస్తున్నాడు ముంబై ఇండియన్స్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్...

‘ఇండియన్ 360’గా పేరొందిన సూర్యకుమార్ యాదవ్... గత మూడు ఐపీఎల్ సీజన్లలో 400+ స్కోరు చేసిన మొట్టమొదటి భారత క్రికెటర్‌గా కూడా రికార్డు క్రియేట్ చేశాడు.

‘సూర్యకుమార్ యాదవ్‌కి జాతీయ జట్టులో చోటు దక్కకపోయినా అతనికి బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంఛైజీ అండగా నిలిచింది... దేశం మీద అతనికి అమితమైన అభిమానం, ప్రేమ ఉన్నాయి...

పాక్ క్రికెటర్ల విషయంలో అది కొరవడింది. పాక్ క్రికెట్ బోర్డు వైఫల్యం కారణంగానే టాలెంట్ ఉన్న క్రికెటర్లు దేశాన్ని విడిచి, అవకాశాలు వెతుక్కుంటూ వెళుతున్నారు...’ అంటూ ట్వీట్ చేశాడు పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా.

పాక్ ఓపెనర్ సమీ అస్లామ్ జాతీయ జట్టులో అవకాశం వస్తుందని చాలా కాలం ఎదురుచూశాడు... ఎంతకీ అవకాశం రాకపోవడం అమెరికా మేజర్ లీగ్‌లో ఫ్రాన్సీ ఆఫర్ వస్తుందనే ఆశతో అక్కడికి మకాం మార్చేశాడు...

ఇంగ్లాండ్ టూర్‌కి సమీ అస్లామ్ ఎంపిక అవుతాడని వార్తలు వచ్చాయి. కానీ అతనికి ఛాన్స్ ఇవ్వలేదు సెలక్టర్లు. ఆ తర్వాత డిసెంబర్ 18 నుంచి ప్రారంభం కాబోతున్న న్యూజిలాండ్ సిరీస్‌కి కూడా అస్లామ్‌ని పక్కనబెట్టింది పాక్ క్రికెట్ బోర్డు...

సమీ అస్లామ్‌కి చాలా అన్యాయం జరిగింది... మిగిలిన ప్లేయర్లలా అతనికి ఎలాంటి అవకాశాలు దక్కలేదు. కారణం పాక్ క్రికెట్ బోర్డులో ఉన్న బంధుప్రీతి... పీసీబీ ఈ వైఖరి కారణంగానే సమీ లాంటి టాలెంటెడ్ క్రికెటర్ దేశం విడిచి వెళ్లాడు...’ అంటూ విరుచుకుపడ్డాడు కనేరియా...

ఐపీఎల్ 2020 సీజన్‌లో 400+ పరుగులతో రాణించిన సూర్యకుమార్ యాదవ్‌కి ఆసీస్ టూర్‌లో అవకాశం దక్కుతుందని భావించారంతా. కానీ అతనికి మొండిచెయ్యి చూపించారు సెలక్టర్లు...

ఎన్నో ఏళ్లుగా నిలకడగా రాణిస్తున్నా సూర్యకుమార్ యాదవ్‌కి జాతీయ జట్టులో అవకాశం రాకపోవడంతో న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ స్కాట్ స్టైరిస్ ఓ షాకింగ్ కామెంట్ చేశాడు...

‘సూర్యకుమార్ యాదవ్ నువ్వు అంతర్జాతీయ క్రికెట్ ఆడాలనుకుంటే... వెంటనే న్యూజిలాండ్ వచ్చేయ్. నీకు ఎప్పుడు డోర్లు తెరిచే ఉంటాయి...’ అంటూ ట్వీట్ చేశాడు న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ స్కాట్ స్టైరిస్.

అయితే ఇలాంటి కవ్వింపు చర్యలకు లొంగని సూర్యకుమార్ యాదవ్... జాతీయ జట్టులో అవకాశం వచ్చేంతవరకూ ఎదురుచూస్తానని, రాకపోతే ముంబై ఇండియన్స్ తరుపున ఆడుతూ ఉంటానని క్లారిటీ ఇచ్చి అందరి మనసులు దోచుకున్నాడు.

‘సూర్యకుమార్ యాదవ్ లాంటి ప్లేయర్‌కి ఇంతవరకూ భారత జట్టులోకి ఎందుకు తీసుకోలేదో నాకు అర్థం కావడం లేదు... వేరే జట్టులో ఉండి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు... జాతీయ జట్టుకి ఆడే అర్హత లేదా..’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు బ్రియాన్ లారా.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?