- Home
- Sports
- Cricket
- సూర్యకుమార్ యాదవ్‌కి వైస్ కెప్టెన్సీ... శ్రేయాస్ అయ్యర్ సంగతేంటి? ఆకాశ్ చోప్రా కామెంట్స్...
సూర్యకుమార్ యాదవ్‌కి వైస్ కెప్టెన్సీ... శ్రేయాస్ అయ్యర్ సంగతేంటి? ఆకాశ్ చోప్రా కామెంట్స్...
2022 ఏడాదిలో బ్యాటర్‌గా సూపర్ సక్సెస్ అయ్యాడు సూర్యకుమార్ యాదవ్. టీ20ల్లో రెండు సెంచరీలు బాదిన సూర్య, ఈ ఏడాది 900+ పరుగులు చేసి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్‌లోకి ఎగబాకాడు. వచ్చే ఏడాదిని టీ20 వైస్ కెప్టెన్‌గా మొదలెట్టబోతున్నాడు సూర్యకుమార్ యాదవ్...

Image credit: Getty
టీ20ల్లో నిలకడైన ప్రదర్శన ఇస్తున్న సూర్యకుమార్ యాదవ్‌ని శ్రీలంకతో జరిగే సిరీస్‌కి వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది టీమిండియా మేనేజ్‌మెంట్. కెఎల్ రాహుల్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుండడంతో ఈ సిరీస్‌కి దూరంగా ఉంటున్నాడు...
Image credit: PTI
రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీని టీ20 ఫార్మాట్‌కి దూరం పెట్టాలని నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. దీంతో ఇకపై జరిగే టీ20 సిరీస్‌లకు హార్ధిక్ పాండ్యానే కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది... సూర్యకుమార్ యాదవ్‌కి వైస్ కెప్టెన్సీ ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది...
Image credit: Getty
‘రెండు మూడేళ్ల క్రితం శ్రేయాస్ అయ్యర్, టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ అవుతాడని అన్నారు. గత ఏడాది గాయంతో జట్టుకి దూరం కాకపోయి ఉంటే ఈపాటికి అయ్యర్‌కి కెప్టెన్సీ పగ్గాలు దక్కి ఉండేవి కూడా. అయ్యర్ మూడు ఫార్మాట్లలో రాణించగలనని నిరూపించుకున్నాడు...
Shreyas Iyer
శ్రేయాస్ అయ్యర్‌ని కెప్టెన్‌గా చూసినప్పుడు హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్, కెఎల్ రాహుల్ కూడా టీమ్‌లో ఉన్నారు. వాళ్లంతా కెప్టెన్లుగా మారారు. అయ్యర్ కనీసం వైస్ కెప్టెన్సీ కూడా దక్కించుకోలేకపోయాడు.
శ్రేయాస్ అయ్యర్‌కి గాయం కాకపోయి ఉంటే సూర్యకుమార్ యాదవ్ ఇంకా తుదిజట్టులో చోటు కోసం ఎదురుచూస్తూ ఉండేవాడేమో...’ అంటూ వ్యాఖ్యానించాడు భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా...
Suryakumar Yadav
టీమిండియా వైస్ కెప్టెన్సీ దక్కడంపై సంతోషం వ్యక్తం చేశాడు సూర్యకుమార్ యాదవ్.. ‘ఇప్పటికీ నాకు ఇదొక కలలా ఉంది. ఎన్నో ఏళ్లుగా చేస్తున్న కఠినమైన శ్రమకు ఫలితం దక్కింది. నాకు టీమిండియాలో ఎప్పుడు చోటు దక్కుతుందా అని మా నాన్న ఎదురుచూసేవాడు...
Suryakumar Yadav
ఏ సిరీస్‌కి టీమ్‌ని ప్రకటించినా... దీంట్లో నీ పేరు లేదేంట్రా? అని తెగ ఫీలయ్యేవారు. ఇప్పుడు నన్ను టీమిండియా వైస్ కెప్టెన్‌గా చేశారని ఆయనే గర్వంగా చెప్పారు. హార్ధిక్ పాండ్యాతో బ్యాటింగ్ చేయడాన్ని బాగా ఎంజాయ్ చేశా. మా ఇద్దరికీ మంచి అనుబంధం ఉంది...’ అంటూ వ్యాఖ్యానించాడు సూర్యకుమార్ యాదవ్..