ఇక సూర్యకుమార్ యాదవ్, వన్డే కెరీర్ షెడ్డూకే! ఫైనల్ మ్యాచ్‌లో సింగిల్స్ తీస్తూ...
వన్డేల్లో సూర్యకుమార్ యాదవ్ ట్రాక్ రికార్డు ఏ మాత్రం బాగోలేదు. అయినా సరే అతన్ని వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ఎంపిక చేసింది టీమిండియా మేనేజ్‌మెంట్...
Suryakumar Yadav
కేవలం టీ20ల్లో నెం.1 ర్యాంకు బ్యాటర్ కావడం వల్లనే వన్డేల్లో సక్సెస్ అవుతాడని నమ్ముతూ వచ్చింది టీమిండియా. అయితే సూర్య మాత్రం తనకి ఈ ఫార్మాట్ సెట్ కాదని నిరూపించుకుంటూనే ఉన్నాడు..
Suryakumar Yadav
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో 7 మ్యాచులు ఆడిన సూర్యకుమార్ యాదవ్, 17 యావరేజ్‌తో 106 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 47 బంతుల్లో 49 పరుగులు మినహా... మిగిలిన మ్యాచుల్లో 25+ పరుగులు కూడా చేయలేకపోయాడు సూర్యకుమార్ యాదవ్...
Suryakumar Yadav
ఫైనల్ మ్యాచ్‌లో 36వ ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్, టీ20 స్టైల్‌లో బౌండరీలతో విరుచుకుపడతాడని అనుకున్నారంతా...
సూర్య క్రీజులో ఉంటే ఆఖరి 10 ఓవర్లలో కనీసం 100+ పరుగులు వస్తాయని బోలెడు ఆశలు పెట్టుకున్నారు. అయితే సూర్య మాత్రం బౌండరీలు ఆడడం రానట్టుగా బ్యాటింగ్ చేయడం చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు..
Suryakumar Yadav
డెత్ ఓవర్లలో కుల్దీప్ యాదవ్ క్రీజులోకి వచ్చిన తర్వాత కూడా సూర్యకుమార్ యాదవ్ సింగిల్స్ తీస్తూ కాలక్షేపం చేశాడు. తన కంటే కుల్దీప్ యాదవ్ బాగా ఆడతాడన్నట్టుగా స్ట్రైయిక్ రొటేట్ చేయడం చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. చివరికి 28 బంతులు ఆడి ఒకే ఒక్క ఫోర్ బాది 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు..
సూర్యకుమార్ యాదవ్ కోసం సంజూ శాంసన్‌ని పక్కనబెట్టేశారు సెలక్టర్లు... సంజూ ఉన్నా ఆడిన క్రీజులో కొద్ది సేపు ఉన్నా ఒకటో రెండో సిక్సర్లు కొట్టి అవుట్ అయ్యేవాడు...
Suryakumar Yadav
కనీసం రిజర్వు బెంచ్‌లో ఉన్న రవిచంద్రన్ అశ్విన్‌ని సూర్య ప్లేస్‌లో ఆడించి ఉన్నా ఇంతకంటే మెరుగ్గానే బ్యాటింగ్ చేసేవాడు. అదీకాకుండా బౌలింగ్‌లో వికెట్లు పడగొట్టేవాడని ట్రోల్స్ చేస్తున్నారు అభిమానులు..
ఈ ఇన్నింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ వన్డే కెరీర్ షెడ్డుకి చేరినట్టే. ఇంకా సూర్య అదరగొడతాడని వన్డేల్లో అవకాశం ఇస్తూ పోతే, సెలక్టర్లు తీవ్ర విమర్శలు ఎదుర్కోక తప్పదు..