రోహిత్‌లా అయిపోయా.. సూర్యకుమార్ యాదవ్ ఫన్నీ వీడియో వైరల్
Suryakumar Yadav viral video : ఆసియా కప్ 2025లో భారత్ vs ఒమన్ మ్యాచ్ టాస్ సమయంలో సూర్యకుమార్ యాదవ్ చేసిన ఒక పని ఇప్పుడు వైరల్ గా మారింది. తాను రోహిత్ శర్మలా మారిపోయానంటూ సూర్య చేసిన కామెంట్స్ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

టాస్‌లో సూర్యకుమార్ యాదవ్ ఫన్నీ
ఆసియా కప్ 2025లో భారత్ తన గ్రూప్ దశ చివరి మ్యాచ్‌ను ఒమన్‌తో అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో ఆడింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహించారు. టాస్ గెలిచిన అనంతరం ఆయన మొదట బ్యాటింగ్ ఎంచుకున్నారు. అయితే, టాస్ సమయంలో సూర్య చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయ్యో.. నేను రోహిత్‌లా అయిపోయా : సూర్యకుమార్ యాదవ్
టాస్ తర్వాత జట్ల మార్పుల గురించి ప్రశ్నించగా, సూర్యకుమార్ యాదవ్ ఒక ప్లేయర్ పేరును మాత్రమే చెప్పాడు. మరో ప్లేయర్ పేరును మర్చిపోయాడు. హర్షిత్ రాణా జట్టులోకి వచ్చినట్లు చెప్పిన సూర్య.. రెండో మార్పును మర్చిపోయారు. "ఓహ్! దేవుడా, నేను రోహిత్ శర్మలా అయిపోయాను" అంటూ నవ్వుతూ తప్పించుకున్నారు. ఆయన చెప్పలేకపోయిన పేరు అర్షదీప్ సింగ్. దీన్ని చూసి అందరికీ రోహిత్ శర్మ గతంలో చేసిన ఇలాంటి టాస్ విషయాలు గుర్తొచ్చాయి.
"I have become like Rohit"
- 😂😂
Suryakumar Yadav forget the two changes for India vs Oman during toss. pic.twitter.com/GHXuw0N9vj— GURMEET GILL 𝕏 (@GURmeetG9) September 19, 2025
భారత్ చేసిన జట్టు మార్పులు ఇవే
ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులు చేసింది. స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తికి విశ్రాంతి ఇచ్చి, వారి స్థానంలో అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణాలను తీసుకుంది. ఈ వివరాలు టాస్ సమయంలో సూర్యకుమార్ తెలియజేయగా, అర్షదీప్ పేరు మాత్రం మర్చిపోయాడు.
సోషల్ మీడియాలో సూర్య కుమార్ వీడియో వైరల్
సూర్యకుమార్ యాదవ్ ఈ ఫన్నీ తప్పిదం చేసిన వీడియో వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానులు దీనిని రోహిత్ శర్మ స్టైల్‌తో పోలుస్తూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. రోహిత్ శర్మ కూడా గతంలో టాస్ సమయంలో ఆటగాళ్ల పేర్లు మర్చిపోవడం వల్ల వార్తల్లో నిలిచారు. ఇప్పుడు అదే తరహా పరిస్థితి సూర్యకుమార్ కూడా చేయడం నవ్వులు పూయిస్తోంది.
𝘞𝘰𝘩 𝘥𝘪𝘯 𝘺𝘢𝘢𝘥 𝘢𝘢 𝘨𝘢𝘺𝘦 😉
Both skippers with a nod to Rohit Sharma on his debut anniversary 🤭
Watch #INDvOMAN LIVE now on the Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork#DPWorldAsiaCup2025 [Asia Cup] pic.twitter.com/b7oHP8xESH— Sony Sports Network (@SonySportsNetwk) September 19, 2025
ఇరుజట్ల ప్లేయింగ్-11
భారత్ జట్టు: అభిషేక్ శర్మ, గిల్, సంజూ శాంసన్, (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివం దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.
ఒమన్ జట్టు: ఆమీర్ కలీమ్, జతీందర్ సింగ్ (కెప్టెన్), హమ్మాద్ మిర్జా, వినాయక్ శుక్లా (వికెట్ కీపర్), షా ఫైసల్, జిక్రియా ఇస్లాం, ఆర్యన్ బిష్ట్, మొహమ్మద్ నదీమ్, షకీల్ అహ్మద్, సమయ్ శ్రీవాస్తవ, జితెన్.
భారత్ ఇన్నింగ్స్.. దంచికొట్టిన అభిషేక్.. హాఫ్ సెంచరీతో మెరిసిన సంజూ
భారత్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసి 188/8 స్కోరు చేసింది. ఒమన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా భారత్ బలమైన స్కోరు నమోదు చేసింది. షకీల్ అహ్మద్ 2 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు. షా ఫైసల్ 2 ఓవర్లలో 8 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ నాక్ ఆడాడు. సంజూ 56, తిలక్ వర్మ 29, అభిషేక్ శర్మ 38, అక్షర్ పటేల్ 26 పరుగులు చేశారు.
Innings Break!
Sanju Samson's 56(45) powers #TeamIndia to 188/8 💥
Over to our bowlers 🎯
Updates ▶️ https://t.co/XAsd5MHdx4#INDvOMA | #AsiaCup2025pic.twitter.com/D8G5pI0Z6M— BCCI (@BCCI) September 19, 2025