MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • భారత్ vs ఒమన్: ఆసియా కప్ సూపర్-4కు ముందు టీమిండియా సూపర్ రికార్డు

భారత్ vs ఒమన్: ఆసియా కప్ సూపర్-4కు ముందు టీమిండియా సూపర్ రికార్డు

India vs Oman : ఆసియా కప్ 2025 వరుస విజయాలతో భారత్ గ్రూప్ స్టేజ్ లో మరో మ్యాచ్ మిగిలి వుండగానే సూపర్ 4 దశకు చేరుకుంది. ఇప్పుడు ఒమన్ తో జరగబోయే మ్యాచ్ లో మరో ఘనత సాధించడానికి సిద్ధంగా ఉంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 19 2025, 04:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టీ20 క్రికెట్ లో భారత జట్టు మరో మైలురాయి
Image Credit : Insta/indiancricketteam

టీ20 క్రికెట్ లో భారత జట్టు మరో మైలురాయి

ఆసియా కప్ 2025 గ్రూప్-Aలో భారత్-ఒమన్ జట్లు శుక్రవారం అబుదాబిలోని షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియంలో తలపడనున్నాయి. ఇది టీమిండియా చరిత్రలో 250వ టీ20 మ్యాచ్‌ కావడం విశేషం. దీంతో భారర్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంటుంది. 

సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత్ సూపర్-4 దశకు అర్హత సాధించింది. మరోవైపు, రెండు మ్యాచ్‌ల్లోనూ పరాజయాన్ని చవిచూసిన ఒమన్ జట్టు టోర్నమెంట్ నుంచి అవుట్ అయింది. ఈ మ్యాచ్ ఫలితం పాయింట్ల పట్టికపై ప్రభావం చూపకపోయినా, భారత్ బెంచ్ స్ట్రెంగ్త్‌ను పరీక్షించుకునే అవకాశం లభిస్తుంది.

DID YOU
KNOW
?
టీ20 లో 250 మ్యాచ్ లు
T20I లో 250 మ్యాచ్‌లను ఆడిన మొదటి జట్టు పాకిస్తాన్. ఒమన్ తో జరిగే మ్యాచ్ తో భారత్ 250 టీ20 మ్యాచ్ మార్కును అందుకుంటుంది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఒమన్ పై పరుగుల వర్షం కురుస్తుందా?
Image Credit : X/BCCI

ఒమన్ పై పరుగుల వర్షం కురుస్తుందా?

ఒమన్ జట్టు ఇప్పటికే పాకిస్తాన్, యూఏఈలతో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. జతిందర్ సింగ్ నేతృత్వంలోని ఈ జట్టు కనీసం చివరి మ్యాచ్‌లో మంచి ప్రదర్శనలు ఇవ్వాలని చూస్తోంది. మరోవైపు, భారత్ సూపర్-4 దశకు ముందు కీలక ఆటగాళ్లను విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. 

అలాగే, ధనాధన్ ఇన్నింగ్స్ లతో పరుగుల వర్షం కురుస్తుందనే అంచనాలున్నాయి. బుమ్రాకు విశ్రాంతి ఇచ్చి, అర్షదీప్ సింగ్‌ను ఆడించే అవకాశం ఉంది. అయితే, జట్టు కాంబినేషన్ బలంగా ఉన్నందున పెద్ద మార్పులు చేసే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.

35
ఆటగాళ్లు, ఇరు జట్ల గత రికార్డులు
Image Credit : X/BCCI

ఆటగాళ్లు, ఇరు జట్ల గత రికార్డులు

భారత్-ఒమన్ జట్లు ఇప్పటివరకు ఏ ఒక్క అంతర్జాతీయ టీ20లోనూ తలపడలేదు. అయితే, 2024లో జరిగిన ACC ఎమర్జింగ్ ఆసియా కప్‌లో భారత్ జూనియర్ జట్టు ఒమన్‌ను ఓడించింది. భారత్ గత ఐదు మ్యాచ్‌ల్లో ఒకే ఓటమి చవిచూసింది. 

మరోవైపు, ఒమన్ ఐదు వరుస ఓటములతో కష్టాల్లో ఉంది. జతిందర్ సింగ్ గత 10 మ్యాచ్‌ల్లో 302 పరుగులు సాధించగా, ఆమీర్ కలీమ్ 9 వికెట్లు తీశాడు. వీరి ప్రదర్శన ఈ మ్యాచ్‌లో కీలకం కానుంది.

45
భారత్ vs ఒమన్ : పిచ్, వెదర్ రిపోర్టు
Image Credit : Getty

భారత్ vs ఒమన్ : పిచ్, వెదర్ రిపోర్టు

షేక్ జాయెద్ స్టేడియం పిచ్ బ్యాట్స్‌మెన్‌కు సహకరించడమే కాకుండా బౌలర్లకు కూడా కొంత అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఇప్పటివరకు జరిగిన 95 టీ20ల్లో, తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు 44సార్లు విజయం సాధించగా, రెండవ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన జట్లు 51సార్లు గెలిచాయి. అంటే ఛేజింగ్ చేయడం కొంత అనుకూలంగా ఉంటుంది.

వాతావరణ రిపోర్టులు గమనిస్తే.. అబుదాబిలో 37°C నుండి 39°C వరకు ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి. వర్షం పడే అవకాశం లేకపోయినా, ఆఖరి ఇన్నింగ్స్‌లో డ్యూలో ప్రభావం ఉండే అవకాశం ఉంది.

55
వారికి విశ్రాంతి ఇవ్వండి.. పాక్ తో మ్యాచ్ ముఖ్యం
Image Credit : X/BCCI

వారికి విశ్రాంతి ఇవ్వండి.. పాక్ తో మ్యాచ్ ముఖ్యం

ఆసియా కప్‌లో ఒమన్‌ మ్యాచ్‌కు ముందు, మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ జస్ప్రీత్ బుమ్రాతో సహా స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని సూచించారు. పాకిస్తాన్‌తో సెప్టెంబర్ 28న జరగనున్న కీలక మ్యాచ్‌కు బుమ్రాను తాజాగా ఉంచడం ముఖ్యం అని అన్నారు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌తో ప్రయోగాలు చేసి, తిలక్ వర్మ, సంజూ శాంసన్ లకు అవకాశమివ్వాలని సూచించారు. బౌలర్ల కంటే బ్యాటర్లను సిద్ధం చేయడం రాబోయే సూపర్-4 దశలో భారత్‌కు బలాన్నిస్తుందని గవాస్కర్ స్పష్టం చేశారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఆసియా కప్ 2025
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇంటర్నేషనల్ క్రికెట్లో 35,117 బంతులు, 5850 ఓవర్లు.. కెరీర్లో ఒక్క నోబాల్ వేయని స్టార్ బౌలర్, ఎవరో తెలుసా?
Recommended image2
IND vs WI 3rd T20: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం
Recommended image3
India vs West Indies: భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే
Related Stories
Recommended image1
PAK vs UAE : యూఏఈపై గెలుపు.. ఆసియా కప్ 2025 సూపర్ 4లోకి పాకిస్తాన్ ఎంట్రీ
Recommended image2
Flipkart BBD 2025 : నథింగ్ ఫోన్లు, ఇయర్‌బడ్స్, వెరబుల్స్ పై భారీ డిస్కౌంట్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved