విరాట్ కోహ్లీ రికార్డును సమం చేసిన సూర్యకుమార్ యాదవ్..
Suryakumar Yadav equals Virat Kohli's record: టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా అఫ్గానిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో అదరగొట్టి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు సూర్యకుమార్ యాదవ్. ఈ క్రమంలోనే అతను విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు.
Virat Kohli-Suryakumar Yadav
Suryakumar Yadav equals Virat Kohli's record : టీ20 వరల్డ్ కప్ 2024 లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. గ్రూప్ దశ మ్యాచ్ లో వరుస విజయాలతో సూపర్-8కు చేరుకుంది. అలాగే, సూపర్-8లో తన తొలి మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టును చిత్తు చేసింది రోహిత్ సేన.
Suryakumar Yadav
సూపర్-8లో టీమిండియా విజయంలో స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు. బ బ్యాటర్లు పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో క్రీజులోకి వచ్చి హాఫ్ సెంచరీ ఇన్నింగస్ తో అదరగొట్టాడు. టీమిండియా విజయంలో సూర్య కుమార్ ఆడిన 53 పరుగులు ఇన్నింగ్స్ కీలకంగా ఉన్నది. దీంతో అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
Suryakumar Yadav
టీ20 క్రికెట్ లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అంతుకున్న ప్లేయర్ గా ఘనత సాధించాడు. రన్ మిషన్ కింగ్ కోహ్లీ రికార్డును సమం చేశాడు. సూర్య కుమార్ యాదవ్ 64 టీ20 మ్యాచ్ లను ఆడి 15 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. కింగ్ కోహ్లీ కూడా 120 మ్యాచ్ లను ఆడి 15 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
India , Cricket,
సూర్య కుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ తర్వాత అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను అందుకున్న ప్లేయర్ మలేషియన్ స్టార్ వీరందీప్ సింగ్. అతను 78 టీ20 మ్యాచ్ లను ఆడి 14 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న నాలుగో ప్లేయర్ సికందర్ రజా. ఈ పాకిస్తానీ-జింబాబ్వే క్రికెట్ 86 మ్యాచ్ లను ఆడి అందులో 14 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ప్లేయర్ మహ్మద్ నబీ మొత్తం 126 మ్యాచ్ లను ఆడి అందులో 14 సార్లే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను అందుకున్న టాప్-5 లో ఐదో స్థానంలో ఉన్నాడు.